తెలంగాణలో టీడీపీపై ఫోకస్ పెడుతున్నారు ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు.. అందులో భాగంగా ఇవాళ తెలంగాణ టీడీపీ నాయకులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.. తెలంగాణలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంపై సమీక్ష నిర్వహించిన ఆయన కీలక ఆదేశాలు జారీ చేశారు. లీడర్లందరూ క్షేత్రస్థాయికి వెళ్లి సభ్యత్వ నమోదుపై పనిచేయాలి.. పార్టీ కోసం అందరూ పనిచేయాల్సిందేనని స్పష్టం చేశారు. రాష్ట్ర పార్టీ కార్యాలయంలో సభ్యత్వ నమోదుపై కోఅర్డినేషన్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది.. మన టీడీపీ యాప్‌లో నాయకులందరూ తమ కార్యక్రమాలు నమోదు చేయాలని సూచించారు. భవిష్యత్‌లో కార్యకర్తల సంక్షేమానికి పెద్దపీట వేస్తాం, కార్యకర్తలకు ఇన్సూరెన్స్, వైద్యానికి సాయం, ఉపాది కల్పనకు ప్రణాళికలు కూడా రూపొందిస్తున్నట్టు వెల్లడించారు. ఇక, ప్రతీ వారం పార్టీ ఆఫీసుకు వచ్చి సభ్యత్వ నమోదుపై రివ్యూ చేయనున్నట్టు వెల్లడించారు చంద్రబాబు..
Read Also: Sri Lanka Crisis: శ్రీలంకలోని తమిళులకు స్టాలిన్ సర్కార్ భారీ సాయం