టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో గ్యాంగ్ రేప్ ఘటనపై టీడీపీ నేతలు రాద్ధాంతం చేయడంపై ఆమె మండిపడ్డారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు మహిళా కమిషన్ తూతూ మంత్రంగా ఉందని ఆరోపించారు. బోండా ఉమ మహిళా కమిషన్ సుప్రీమా అంటున్నారని.. బోండా ఉమ లాంటి ఆకు రౌడీలకు మహిళా కమిషన్ సుప్రీమేనని వాసిరెడ్డి పద్మ స్పష్టం చేశారు. చంద్రబాబుకు బాధితులను ఎలా పరామర్శించాలో కూడా…
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, ఆ పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావుకు నోటీసులు జారీ చేసింది ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్.. ఈ నెల 27వ తేదీన కమిషన్ ముందు విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొంది… విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో అత్యాచార ఘటన కలకలం సృష్టించగా.. ఇవాళ అత్యాచార బాధితురాలిని పరామర్శించేందుకు నేతలు క్యూ కట్టారు.. ఏపీ మంత్రులతో పాటు.. టీడీపీ నేతలు కూడా ఆస్పత్రికి వెళ్లారు.. ఈ క్రమంలో.. ఏపీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ వాసిరెడ్డి…
విజయవాడ పాత ప్రభుత్వాస్పత్రిలో జరిగిన గ్యాంగ్ రేప్ ఘటన ప్రస్తుతం ఏపీలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ నేపథ్యంలో అత్యాచార బాధిత కుటుంబాన్ని శుక్రవారం మధ్యాహ్నం టీడీపీ అధినేత చంద్రబాబు పరామర్శించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ప్రభుత్వాసుపత్రిలో ఓ యువతిపై సామూహిక అత్యాచారం చేయటం ఏపీకే అవమానం అని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో ఆడబిడ్డలకు రక్షణ కరువైందని.. ఈ సంఘటన పట్ల ప్రభుత్వానికి సిగ్గుందో లేదో కానీ తాను మాత్రం సిగ్గుపడుతున్నానని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఇంత జరిగినా…
టీడీపీ అధినేత చంద్రబాబుపై మరోసారి మండిపడ్డారు ఏపీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్.. బిర్లా-సీఎం వైఎస్ జగన్ ఇద్దరూ లంచ్ మీటింగ్ పెట్టుకున్నారని తెలిస్తే చంద్రబాబుకి గుండె అగిపొద్దేమో అని సెటైర్లు వేశారు.. ఆదిత్యా గ్రూప్ కంపెనీ రాష్ట్రానికి రావడం శుభపరిణామంగా అభివర్ణించిన ఆయన.. రూ. 2500 కోట్ల పెట్టుబడులతో 2500 మందికి ఉపాధి రాబోతుందన్నారు.. కానీ, రాష్ట్రానికి పెట్టుబడులు వస్తుంటే చంద్రబాబుకి కడుపు మండుతుందని.. చంద్రబాబు కడుపు మంట ఆయన మాటల్లో కనిపిస్తుందని.. రాష్ట్రానికి పెట్టుబడులు రావడం,…
ఏలూరు జిల్లాలోని ఆగిరిపల్లి మండలం నెక్కలం గొల్లగూడెం గ్రామంలో టీడీపీ అధినేత చంద్రబాబు నిర్వహించిన గ్రామ సభలో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. తనకు మాట్లాడే అవకాశం కల్పించాలంటూ గ్రామ సభకు వచ్చిన వైసీపీ ఎంపీటీసీ కాజా రాంబాబు విజ్ఞప్తి చేశారు. తాను వైసీపీలోనే ఉంటూ గ్రామంలో జరిగిన రూ.75 లక్షల అవినీతిపై పోరాడుతున్నట్లు రాంబాబు చెప్పడంతో చంద్రబాబు ఆయనకు మాట్లాడే అవకాశం కల్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేకా ప్రతాప్ తనయుడు అవినీతికి పాల్పడ్డాడంటూ చంద్రబాబుకు…
అమరావతిలోని టీడీపీ కార్యాలయంలో బుద్ధా వెంకన్న ఆధ్వర్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బుద్ధా వెంకన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుపై చెత్తవాగుడు వాగేవారిని ఆయన హెచ్చరించారు. చంద్రబాబు కోసం 100 మందితో సూసైడ్ బ్యాచ్ సిద్ధంగా ఉందని వ్యాఖ్యానించారు. ఎవరైనా అనవసరంగా నోరు పారేసుకుంటే చంపడానికైనా, చావడానికైనా సూసైడ్ బ్యాచ్ సిద్ధంగా ఉందని తెలిపారు. వచ్చే రెండేళ్ల పాటు చంద్రబాబు కుటుంబంపై పిచ్చి వేషాలు చేసే వైసీపీ బ్యాచ్…
ఏపీలో రెండేళ్లలో సార్వత్రిక ఎన్నికలు రానున్నాయి. ఈ ఎన్నికల కోసం ఇప్పటి నుంచే టీడీపీ అధినేత చంద్రబాబు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈరోజు చంద్రబాబు 73వ పుట్టినరోజు. తన బర్త్ డే నుంచే ప్రజాక్షేత్రంలోకి చంద్రబాబు ఎంటర్ అవుతున్నారు. ఈ మేరకు ఈరోజు ఏలూరు జిల్లాలో ఆయన పర్యటించనున్నారు. నూజివీడు నియోజకవర్గం ఆగిరిపల్లి మండలం నెక్కలం గొల్లగుడెం గ్రామంలో పర్యటించి ప్రజా సమస్యలను తెలుసుకోనున్నారు. అడవినెక్కలం అంబేద్కర్ నగర్ నుంచి నెక్కలం గొల్లగూడెం వరకు చంద్రబాబు పాదయాత్ర…
మాజీ మంత్రి, బీజేపీ నేత రావెల కిషోర్‌బాబు తిరిగి టీడీపీ గూటికి చేరతారనే వార్తలు వినిపిస్తున్నాయి. గుంటూరులో మంగళవారం నాడు టీడీపీ అధినేత చంద్రబాబును రావెల కిషోర్‌బాబు కలిసి మంతనాలు జరిపారు. దీంతో ఆయన టీడీపీలో చేరడం ఖాయమని తెలుస్తోంది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో జనసేన తరఫున పోటీ చేసి రావెల ఓటమి పాలయ్యారు. ఎన్నికల తర్వాత రావెల జనసేనకు గుడ్‌బై చెప్పి బీజేపీలో చేరారు. అయితే కొంతకాలంగా ఆయన మళ్లీ టీడీపీలో చేరతారంటూ ప్రచారం జరుగుతోంది.…
టీడీపీ పార్టీ కార్యాలయంలో మీడియా ప్రతినిధులతో టీడీపీ అధినేత చంద్రబాబు చిట్ చాట్ చేశారు. జగన్ పాలనపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రభుత్వంపై ఈ స్థాయి ప్రజా వ్యతిరేకత లేదు చరిత్రలో చూడలేదు. ప్రభుత్వాలు విఫలం అవ్వడం వేరు.. పాలనపై ఈ స్థాయి అసంతృప్తి వేరు. టీడీపీ అత్యధిక సీట్లు గెలుచుకున్న 1994లో కూడా అంతకు ముందున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై ఇంత వ్యతిరేకత లేదన్నారు చంద్రబాబు. జగన్ ప్రభుత్వ విధానాలతో ప్రజల జీవన ప్రమాణాలు దారుణంగా దెబ్బతిన్నాయి.…
ఏపీలో టీడీపీ వర్సెస్ వైసీపీ మధ్య మాటలయుద్ధం కొనసాగుతోంది. టీడీపీ మాజి ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి వైసీపీ ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. కళ్యాణదుర్గంలో జరిగిన ఘటన పై అధికార పార్టీ నాయకులు మాట్లాడలేక పోతున్నారు. చంద్రబాబు, లోకేష్ ట్విటర్ లో పెడితే దానిపై కేసులు పెట్టారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గా ఉన్నపుడు జగన్ చంద్రబాబు ను నడి రోడ్డులో ఉరి వెయ్యండి అంటే ఏ కేసులు పెట్టలేదన్నారు. మీ సహచర మాజీమంత్రి కొడాలి నాని, తాజా…