టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ఆకస్మిక మరణంపై టీడీపీ అధినేత చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పర్యటిస్తున్న చంద్రబాబు.. బొజ్జల వార్త తెలియగానే తాను ఆవేదనకు గురయ్యానని తెలిపారు. బొజ్జల మరణం అత్యంత బాధాకరమని చంద్రబాబు పేర్కొన్నారు. లాయర్‌గా వృత్తి జీవితం ప్రారంభించిన బొజ్జల ఎన్టీఆర్ పిలుపుతో రాజకీయాల్లోకి వచ్చారన్నారని గుర్తుచేశారు. శ్రీకాళహస్తి నియోజకవర్గ ప్రజలకు బొజ్జల ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేవారని.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు.…
టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి ఆకస్మిక మృతిపై రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. తెలంగాణ సీఎం కేసీఆర్.. బొజ్జల మృతికి సంతాపం తెలుపుతూ ఓ ప్రకటన విడుదల చేశారు. ఓమంచి సహచరుడిని , ఆత్మీయుడిని కోల్పోయానంటూ సదరు ప్రకటనలో పేర్కొన్నారు. బొజ్జల కుటుంబ సభ్యులకు ఆయన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. టీఆర్ఎస్ ఆవిర్భావానికి ముందు కేసీఆర్ కూడా టీడీపీలో కొనసాగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పార్టీకి చెందిన పలువురు కీలక…
టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి విమర్శలు చేశారు. ఎన్నికల్లో చంద్రబాబుకు సొంతంగా పోటీ చేసే ధైర్యం లేదని ఆరోపించారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా పొత్తులతోనే చంద్రబాబు పోటీ చేస్తారని.. వచ్చే ఎన్నికల్లో వైసీపీని ఢీకొట్టే ధైర్యం చంద్రబాబుకు లేదని మంత్రి కాకాణి ఎద్దేవా చేశారు. అనైతిక పొత్తులతో పోటీ చేయాలని చంద్రబాబు ఆలోచిస్తున్నారని మండిపడ్డారు. అయితే ఏపీలో ప్రజలంతా వైసీపీ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. చంద్రబాబు,…
పొత్తులపై పరోక్ష వ్యాఖ్యలు చేసిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. ఆంధ్రప్రదేశ్‌లో పొలిటికల్ హీట్ పెంచారు.. అయితే, చంద్రబాబుపై కౌంటర్ ఎటాక్ దిగారు మంత్రి జోగి రమేష్.. చంద్రబాబుతో పాటు పవన్ కల్యాణ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు.. ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన.. పొత్తుల కోసం చంద్రబాబు ఆరాటం, ప్యాకేజీ కోసం పవన్ కల్యాణ్ పోరాటం చేస్తున్నారు అంటూ ఆరోపణలు గుప్పించారు. ఎంత మంది కలిసినా 2024లో వచ్చేది వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమేననే నమ్మకాన్ని వ్యక్తం…
చంద్రబాబుకి అమరావతి మీదే ప్రేమ.. విశాఖకు పరిపాలన రాజధాని చంద్రబాబు వద్దంటే.. ఉత్తరాంధ్ర టీడీపీ నేతలు ఎందుకు మాట్లాడడం లేదు? ఫైర్ అయిన మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్‌కు కౌంటర్ ఇచ్చారు టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు.. సోషల్ మీడియా వేదికగా తాజా మాజీ మంత్రి అవంతికి కౌంటర్ ఇస్తూ.. విశాఖని రాజధానిగా ప్రకటించిన తరువాత అవంతి గారి రాసలీలల ఆడియో విడుదల తప్ప ఏమైనా జరిగిందా..? విశాఖ అభివృద్ధికి అదనంగా ఒక్క రూపాయైనా…
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉన్నా.. అప్పుడే పొత్తులపై చర్చలు మొదలయ్యాయి… జనసేన ఆవిర్భావి దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన భారీ బహిరంగసభ వేదికగా పొత్తులపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటన చేయగా.. ఇప్పుడు.. పొత్తులపై కీలక వ్యాఖ్యలు చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. ఇక, బీజేపీ నేతలు కూడా పలు సందర్భాల్లో పొత్తుల విషయంపై మాట్లాడుతూనే ఉండగా… మరోవైపు.. చరిత్రలో పొత్తులు లేకుండా గెలిచిన చరిత్ర అసలు టీడీపీకి ఉందా? అని…
వైసీపీ సర్కార్‌కు వ్యతిరేకంగా కొత్త నినాదం అందుకున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో ఉన్న ఆయన.. అన్నవరంలో తుని, ప్రత్తిపాడు టీడీపీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్విట్ జగన్.. సేవ్ ఆంధ్రప్రదేశ్.. ఇదే మన నినాదం అన్నారు.. క్విట్ ఇండియా ఉద్యమం లాగే ఈ ఉద్యమం చేయాలని పిలుపునిచ్చారు. కుటుంబ సభ్యులను కూడా బజారుకి ఈడుస్తున్నారని మండిపడ్డ చంద్రబాబు.. కౌరవ సభను.. గౌరవ సభ చేసిన తర్వాతనే…
అమరావతిని రాజధానిగా చేస్తాం.. విశాఖను అభివృద్ధి చేస్తామంటూ గురువారం రోజు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించిన విషయం తెలిసిందే.. అయితే, చంద్రబాబు వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావు… ఇవాళ విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆయన.. చంద్రబాబుకి అమరావతి మీదే ప్రేమ.. విశాఖకు పరిపాలన రాజధాని చంద్రబాబు వద్దంటే.. ఉత్తరాంధ్ర టీడీపీ నేతలు ఎందుకు మాట్లాడడం లేదు? అంటూ మండిపడ్డారు. విశాఖలో టీడీపీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలతో రాజీనామా చేసి.. మళ్లీ ఎన్నికలకు…
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని చుట్టేస్తున్నారు.. జిల్లాల పర్యటనలో భాగంగా.. ఇవాళ తూర్పు గోదావరి, కాకినాడ జిల్లాల్లో పర్యటించనున్నారు.. తూర్పు గోదావరి జిల్లా తాళ్లరేవులో బాదుడే బాదుడు కార్యక్రమంలో పాల్గొననున్నారు చంద్రబాబు. ఇక, సాయంత్రం తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంలో ఆయన పర్యటన కొనసాగనుంది.. Read Also: Kedarnath: తెరచుకున్న కేదార్నాథ్.. భక్తుల పులకింత.. చంద్రబాబు పర్యటన వివరాలు ఇలా ఉన్నాయి.. * అన్నవరంలో ఉదయం 10 గంటలకు తూర్పు గోదావరి జిల్లాకి చెందిన ముఖ్య…
1. నేడు తూర్పుగోదావరి జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటించనున్నారు. 2. ఏపీలో నేటి నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 1,456 పరీక్ష కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. 9.14 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. 3. నేటి నుంచి తెలంగాణలో ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. తెలంగాణలో 1,443 పరీక్ష కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. 9,07,393 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. 4. నేడు ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ…