టీడీపీ ఆవిర్భవించినప్పుడు యూత్ లుక్ ఎక్కువ. తర్వాత యువతను ప్రోత్సహించిన సందర్భాలు అరుదే. తెలుగుదేశం ఆవిర్భవించిన 40 ఏళ్ల తర్వాత… రాబోయే ఎన్నికల్లో 40 శాతం మంది యువతకే ప్రాధాన్యం అన్నది ప్రస్తుతం చంద్రబాబు మాట. 2019 ఎన్నికల తర్వాత పార్టీకి గడ్డుకాలం నడుస్తోంది. దీనికితోడు ఇంఛార్జుల పేరుతోనో.. సీనియర్లు అనే హోదాలోనో చాలా మంది లీడర్లు ఎక్కడికక్కడ పాతుకుపోయారు. వారు పనిచేయరు.. మిగిలిన వారికి అవకాశం ఇవ్వరు అనే విమర్శలు పసుపు శిబిరంలోనే ఉన్నాయి. వచ్చే…
టీడీపీ సీనియర్ నేత.. మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడి ఇంటి గోడ కూల్చిన వ్యవహారం పైన టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశం పై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమ స్పందించారు. జగన్.. ఇవాళ నీది.. రేపు మాది గురుపెట్టుకో అంటూ మండిపడ్డారు. జగన్.. మా ఇంటి గోడలు పడగొడుతున్నావ్.. తాడేపల్లి ప్యాలెస్ పునాదులు కదులుతున్నాయి గుర్తుంచుకో అంటూ హెచ్చరించారు. తన ఇంటి పునాదులు కదులుతుండడంతో జగన్ టీడీపీ నేతల ఇళ్లని కూలుస్తున్నారని…
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి.. వరుస ట్వీట్లతో చెలరేగిపోతున్నారు.. టీడీపీ అధినేత చంద్రబాబు, ఆ పార్టీ నేతలను టార్గెట్ చేస్తూ.. సెటైర్లు వేస్తూ ట్విట్టర్‌లో మంట పెడుతున్నారు. మరోవైపు, అదే స్థాయిలో టీడీపీ నుంచి సాయిరెడ్డి ట్వీట్లకు కౌంటర్లు కూడా పడుతున్నా.. ఆయన ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు.. ఇక, తన తాజా ట్వీట్‌లో.. టీడీపీ అంటే తెలుగు దున్నపోతుల పార్టీ అంటూ కొత్త అర్థం చెప్పారు…
టీడీపీ అధినేత చంద్రబాబు వ్యాఖ్యలపై సెటైర్లు వేస్తూనే కౌంటర్ ఎటాక్ దిగారు మంత్రి బొత్స సత్యనారాయణ.. చంద్రబాబు నా నియోజకవర్గానికి వెళ్ళి… నేను వ్యక్తిగతంగా పనికి మాలిన వ్యక్తి అన్నట్లు మాట్లాడాడరు.. పనికి మాలినతనానికి చంద్రబాబుదే పేటెంట్ హక్కు అని.. ప్రపంచంలో చంద్రబాబు కంటే పనికి మాలిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా..? రాష్ట్రానికి సంబంధించి ఒక్కటైనా పనికి వచ్చే విషయం మాట్లాడారా..? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. ఇక, ఏపీ సర్కార్-బైజూస్ ఒప్పందంపై చంద్రబాబు చేసిన కామెంట్లుకు…
ఏపీ సర్కార్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. బాదుడే బాదుడు పేరుతో నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తూ పెరిగిన ధరలు, ప్రభుత్వ వైఫల్యాలపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. అయితే, సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి.. చంద్రబాబుపై కౌంటర్ ఎటాక్‌కు దిగారు.. అర్జంటుగా సైకియాట్రిస్టుకో, బూతవైద్యుడికో చూపించండయ్యా.. ముసలాడికి (చంద్రబాబు) మెంటలో, గాలి సోకిందో, మతిపోయిందో తెలియట్లేదు అంటూ సెటైర్లు వేశారు. కోట్లాది మంది ప్రజలు ఎన్నుకున్న…
రాష్ట్రంలో సామాజిక న్యాయానికి ఆద్యుడు స్వర్గీయ ఎన్టీఆర్ అన్నారు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు. విజయనగరంలో ఆయన చీపురుపల్లిలో మాట్లాడుతూ. రాష్ట్రంలో విధ్వంస పాలన జరుగుతుంది…రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కి పోయింది. ప్రభుత్వం చెప్పిన నాడు నేడు ఏమయ్యింది. పదో తరగతిలో ఎందుకు అంతమంది ఫెయిల్ అయ్యారు. ఎన్నికల ముందు ప్రత్యేక హోదా తెస్తాం అని జగన్ అన్నారు… ఇప్పుడు మెడలు వంచారు… కాళ్ల బేరానికి వచ్చారని దుయ్యబట్టారు. జగన్ హోదా విషయంలో మెడలు వంచారు. జగన్ చర్యలకు…
టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్ ఎన్నిసార్లు పొర్లు దండాలు పెట్టినా ప్రజలు నమ్మబోరన్నారు ఎంపీలు మోపిదేవి వెంకటరమణ, నందిగం సురేష్. బాపట్ల జిల్లా పర్చూరులో జరిగిన రైతు సంఘీభావ యాత్ర లో పాల్గొన్నారు ఎంపీలు మోపిదేవి వెంకటరమణ, నందిగం సురేష్. అర్హతే ప్రామాణికంగా అర్హులైన పేదలకు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందిస్తున్న ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డిదే అన్నారు ఎంపీ మోపిదేవి వెంకటరమణ. రాష్ట్రాభివృద్ధి, ప్రజల అవసరాల కోసం అప్పు చేసే అధికారం ప్రభుత్వానికి…
ఏపీలో రాజకీయ విమర్శల వేడి రాజుకుంటూనే వుంది. మంత్రులు టీడీపీ నేతలపై తమదైన రీతిలో మండిపడుతూనే వున్నారు. తాజాగా ఇరిగేషన్ మంత్రి అంబటి రాంబాబు చంద్రబాబుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబు మాటలు చూస్తుంటే జాలేస్తోంది. ముఖ్యమంత్రిని తీవ్రవాదిలాగా తయారు అయ్యారంటారు. క్విట్ జగన్ అంటాడు. నలభై ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న నాయకుడి మాటలేనా అవి?? ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అన్నారు మంత్రి అంబటి రాంబాబు. బొబ్బిలి సినిమా గుర్తుకు తెచ్చుకుని ఆవేశం తెచ్చుకోండి అంటున్నాడు…