సీఎం జగన్మోహన్ రెడ్డికి టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ లేఖ రాశారు. వైసీపీ పాలనలో మైనారిటీలకు తీవ్ర అన్యాయం. టీడీపీ హయాంలో మైనారిటీల అభివృద్ధికి ప్రవేశపెట్టిన పథకాలు ఆపేయడం దారుణం అన్నారు. నిలిపేసిన పథకాలను తక్షణమే పునరుద్ధరించి మైనారిటీలను ఆర్థికంగా ఆదుకోవాలి. ముస్లిం సోదరులకు సంక్షేమం అందించడంలో వివక్ష ఎందుకు?
ప్రభుత్వ చర్యలతో మరింత పేదరికంలోకి మైనారిటీలు వెళ్లిపోతున్నారన్నారు. వైసీపీ పాలనతో మైనారిటీలకు ఒరిగిందేమిటి? టీడీపీ హయాంలో ఇచ్చిన రంజాన్ తోఫా, దుల్హన్ పథకాలకు మంగళం పాడేశారన్నారు. మూడేళ్లుగా యువతకు ఉపాధి కరువు, నిలిచిన ఉన్నత విద్య, విదేశీ విద్య. బడ్జెట్ లో నామమాత్రపు కేటాయింపులు జరుగుతున్నాయని అనగాని తన లేఖలో పేర్కొన్నారు. జగన్ రెడ్డి పాలనలో ముస్లింలపై దాడులు పెరిగాయన్నారు. ముస్లిం ఆడబిడ్డలపై అఘాయిత్యాలకు పాల్పడిన ఒక్కరిపైనా చర్యలు తీసుకున్నారా అని ఆయన ప్రశ్నించారు.
పేద, ధనిక తేడా లేకుండా అంతా సంతోషంగ పండుగ చేసుకోవాలని ఆనాడు చంద్రబాబు 10 లక్షల కుటుంబాలకు రంజాన్ తోఫా అందించారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కక్షపూరితంగా వాటిని ఆపేసింది. హజ్ యాత్రకూ సాయం అందించడంలేదన్నారు. మూడేళ్ళుగా స్వయం ఉపాధి యూనిట్ల పంపిణీ జరగడం లేదు. షాదీఖానాలకు నిధులు కేటాయించకపోవడం, ప్రార్థనా మందిరాలకు పైసా ఇవ్వకపోవడం మైనారిటీలకు ద్రోహం చేయడమే అన్నారు.
India Corona: దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు