మూడేళ్ల వైసీపీ పాలనపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మూడేళ్ల వైసీపీ పాలనలో ఏపీని వల్లకాడు చేశారని ఆయన ఆరోపించారు. ప్రజలను భయభ్రాంతులకు గురి చేశారని.. తమ బాధలను చెప్పుకునే వీల్లేకుండా ప్రజల నోళ్లను నొక్కి పెట్టారని విమర్శించారు. దీంతో చాలా మంది ఆత్మహత్యలు చేసుకున్నారని.. చాలాచోట్ల కొందరు హత్యలకు గురయ్యారని చంద్రబాబు మండిపడ్డారు. వైసీపీ హయాంలో 60 మంది టీడీపీ కార్యకర్తలను హత్య చేశారన్నారు. 4 వేల మంది టీడీపీ వారిపై కేసులు…
టీడీపీ నేతలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు ఎంపీ విజయసాయిరెడ్డి. భవానీపురంలో జిల్లా పార్టీ కార్యాలయం ప్రారంభించటం సంతోషంగా ఉందన్నారు. ఎన్టీఆర్ జిల్లా వైసీపీ పార్టీ కార్యాలయాన్ని భవానీ పురంలో ప్రారంభించిన ఎంపీ విజయసాయిరెడ్డి. మంత్రులు తానేటి వనిత, అంబటి రాంబాబు, జోగి రమేష్, జిల్లా పార్టీ అధ్యక్షుడు వెల్లంపల్లి, ఎమ్మెల్యేలు, నేతలు హాజరయ్యారు. రాబోయే ఎన్నికల్లో జిల్లాలో ఏడు స్థానాలు గెలిచి సీఎంకి బహుమతిగా ఇస్తామన్నారు వెల్లంపల్లి. 26 జిల్లాల్లోనూ పార్టీ సొంత కార్యాలయాలు నిర్మించుకుంటాం. ఏడాది గడువులో…
తెలుగు రాష్ట్రాల్లో ముందస్తు ఎన్నికలు వస్తాయా ? ఏపీ, తెలంగాణలో అధికార పార్టీలు.. ఆ దిశగా ముందుకు వెళ్తున్నాయా ? విపక్ష నేతలు చేస్తున్న ప్రచారంలో నిజం ఎంత ? అసలు ఎందుకు ఈ రకమైన ప్రచారం జరుగుతోంది ? తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు హాట్ హాట్‌గా సాగుతున్నాయి. అటు ఆంధ్రప్రదేశ్‌లోనూ, ఇటు తెలంగాణలోనూ రాజకీయ వాతావరణ వేడెక్కింది. అన్ని పార్టీలు తమ పాలిటిక్స్‌ను యాక్టివ్ మోడ్‌లోకి మార్చేశాయి. ముందస్తు ఎన్నికల ప్రచారాలతో ఈ వాతావరణం మరింత…
టీడీపీ అధినేత చంద్రబాబు మరోసారి ఏపీలో జిల్లాల పర్యటనలకు రెడీ అవుతున్నారు. 26 జిల్లాలలో ఏడాది పాటు విస్తృత పర్యటనలు చేయాలని ఆయన నిర్ణయించారు. ఎన్టీఆర్ శత జయంత్యుత్సవాల్లో భాగంగా ప్రతి జిల్లాలోనూ చంద్రబాబు పర్యటించనున్నారు. జిల్లా పర్యటనల్లో ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజా సమస్యలపై రోడ్ షోలు, బహిరంగ సభలు నిర్వహించనున్నారు. చంద్రబాబు ఒక్కో టూర్ మూడు రోజుల చొప్పున నెలకు రెండు జిల్లా టూర్లు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నెల మూడో వారం నుంచే…
ఏపీ ప్రభుత్వంపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర విమర్శలు చేశారు. విద్యా శాఖలోకి మున్సిపల్ స్కూళ్ల విలీనం ప్రభుత్వ కుట్ర అని మండిపడ్డారు. ఏపీలో 2,115 పురపాలక పాఠశాలలకు చెందిన వేల కోట్ల ఆస్తుల కోసమే విలీన ప్రయత్నాలు జరుగుతున్నాయని చంద్రబాబు ఆరోపించారు. జగన్ తన స్వార్థం కోసం నాలుగున్నర లక్షల విద్యార్థుల భవిష్యత్తును పణంగా పెడతారా అంటూ ప్రశ్నించారు. మున్సిపల్ స్కూళ్ల విలీన నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. విలీన…
మహానాడు తర్వాత పార్టీ పటిష్టత, ఇంఛార్జుల పనితీరుపై టీడీపీ అధినేత చంద్రబాబు వరుస సమీక్షలు జరుపుతున్నారు. మంగళవారం నాడు అమరావతిలోని పార్టీ కార్యాలయంలో శ్రీకాకుళం- విజయనగరం, విశాఖపట్నం-అనకాపల్లి పార్లమెంట్లపై చంద్రబాబు సమీక్షించారు. నాలుగు పార్లమెంట్ సెగ్మెంట్ల కో-ఆర్డినేటర్లు చినరాజప్ప, గణబాబు, బుద్దా వెంకన్నలతో విడివిడిగా టీడీపీ అధినేత సమీక్ష జరిపారు. రోడ్డెక్కని నేతలు, పని చేయని నాయకుల విషయంలో నివేదికలు ఇవ్వాలని వారిని చంద్రబాబు ఆదేశించారు. Minister Roja: పవన్ కళ్యాణ్ రియల్ హీరో కాదు.. రీల్…
కుప్పం టీడీపీ నేత, గంగమ్మ గుడి మాజీ ఛైర్మన్ రవిపై దాడి అంశంపై టీడీపీ అధినేత చంద్రబాబు డీజీపీకి లేఖ రాశారు. లేఖతో పాటు ఫొటోలు, సీసీటీవీ ఫుటేజీని చంద్రబాబు జతచేశారు. వైసీపీ గూండాల వల్ల కుప్పంలో శాంతి భద్రతల సమస్యలు వస్తున్నాయని ఆయన లేఖలో వివరించారు. గంగమ్మ గుడి మాజీ ఛైర్మన్ రవి నివాసంపై దాడి కుప్పంలో వైసీపీ అరాచకానికి నిదర్శనమని పేర్కొన్నారు. పోలీస్ స్టేషన్‌కు 200 మీటర్ల దూరంలో ఉన్న రవి ఇంటిపై వైసీపీ…
పవన్ కళ్యాణ్ రియల్ హీరో కాదు.. రీల్ హీరో మాత్రమేనని మంత్రి రోజా అన్నారు. సినిమాల్లో పవన్ ప్రధాని, సీఎం, గవర్నర్ కూడా కావొచ్చని.. కానీ రియల్ లైఫ్‌లో ఆయన సీఎం కాలేడని ఆమె జోస్యం చెప్పారు. ప్రజలకు మంచి చేయాలన్న ఆలోచన చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లకు లేదని మంత్రి రోజా మండిపడ్డారు. గుంటూరులో వైఎస్సార్ యంత్ర సేవా పథకం ప్రారంభోత్సవం సందర్భంగా ఆమె ట్రాక్టర్ నడిపి కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపారు. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని…
విద్యుత్ మీటర్ల గుర్చి ప్రతిపక్షాలు మాటాడుతున్నాయని.. అసలు మీటర్ సిస్టమ్ పెట్టిందే చంద్రబాబు అని ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం వ్యాఖ్యానించారు. విద్యుత్ మీటర్ సిస్టమ్ ప్రవేశపెట్టలేదని చంద్రబాబును చెప్పమనండంటూ సీతారాం ప్రశ్నించారు. రైతుకు కావలసిన విద్యుత్ డైవర్షన్స్‌ను అరికట్టేందుకే ఈ మీటర్ల ప్రక్రియ అని ఆయన వెల్లడించారు. మీటర్లు పెట్టకపోతే విద్యుత్ మిగుల్చుకోలేమన్న ఆయన.. సిస్టమ్ కరెక్ట్ చేసి రైతులకు నాణ్యమైన విద్యుత్ అందిస్తే తప్పా అంటూ ప్రశ్నించారు. Devineni Uma: మంత్రి అంబటి కుట్రలు,…
పవన్ కామెంట్లు టీడీపీని డిఫెన్సులో పడేసినట్టే కన్పిస్తోంది. పార్టీ ఆవిర్భావ సభలో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకుండా జాగ్రత్త పడతాననే పవన్ కామెంట్లతో, తమతో కలిసి పని చేయడానికి సంసిద్దతను పవన్ తన కామెంట్ల ద్వారా తెలిపారని జనమంతా భావించారు. అదే తరహాలో టీడీపీ కూడా అనుకుంది. ఆ తర్వాత ఒకట్రెండు సందర్భాల్లో కూడా పవన్ ఇదే తరహాలో మాట్లాడితే పొత్తు పక్కా అని తమ్ముళ్లూ ఫిక్స్ అయినట్టే కన్పించారు. చంద్రబాబు ఏం కోరుకుంటున్నారో, దానికి అనుగుణంగానే…