వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే అమరావతి భూ కుంభకోణంపై విచారణ చేపట్టాం అని మల్లాది విష్ణు అన్నారు. టీడీపీ నేత వర్ల రామయ్య కోర్టుకు వెళ్లి విచారణ జరగకుండా అడ్డుకున్నారు అని ఆయన కామెంట్స్ చేశారు. తప్పు చేయకపోతే కోర్టులకు వెళ్లి స్టే తెచ్చుకోవటం ఎందుకు!? అని మల్లాది విష్ణు ప్రశ్నించారు.
ఆంధ్రప్రదేశ్ లో ఎన్ని పార్టీలు కలిసి ఎన్నికలకు వచ్చినా.. వైసీపీ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. రానున్న ఎలక్షన్స్ లో తాము 150 నియోజకవర్గాల్లో ఘన విజయం సాధిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
తెలుగుదేశం పార్టీ కోసం పవన్ కల్యాణ్ జనసేన పార్టీ పెట్టాడని మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. రైతుల పరామర్శ పేరుతో చంద్రబాబుకు అనుకూల రాజకీయం చేస్తున్నాడని ఆయన విమర్శించారు.
చంద్రబాబుకు భారీ షాక్ తగిలింది. ఉండవల్లి కరకట్టపై ఆయన గెస్ట్‌హౌస్‌ను ఏపీ ప్రభుత్వం అటాచ్ చేసింది. క్రిమినల్ లా అమెండ్మెంట్ 1944 చట్టం ప్రకారం అధికారులు చర్యలు తీసుకున్నారు. స్థానిక జడ్జికి సమాచారమచ్చి లింగమనేని గెస్ట్‌హౌస్‌ను సర్కారు అటాచ్ చేసింది.
Ambati Rambabu: వైసీపీలో కొందరు సకల కళా కోవిదులున్నారు.. చిట్టి చిట్టి అడుగులేసుకుంటూ.. క్యూట్ క్యూట్ గా నన్ను విమర్శించేందుకు కొందరు నేతలు వస్తారు కదా..? వాళ్లని సీఎం అభ్యర్థులుగా ప్రకటించండి అంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించిన విషయం విదితమే.. ఇక, మేం చేయలేమని వైసీపీ భావిస్తే.. మమ్మల్ని ఎందుకు పట్టించుకుంటారు..? టీడీపీనైనా పట్టించుకోవడం లేదు కానీ.. మమ్మల్ని మాత్రం వదలడం లేదన్న ఆయన.. వైసీపీకి మేమంటే భయం అందుకే మమ్మల్ని విమర్శిస్తున్నారని కామెంట్…
Pawan Kalyan: పొత్తులపై మరోసారి క్లారిటీ ఇచ్చారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.. మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో నిర్వహించిన జనసేన మండల, డివిజన్ అధ్యక్షుల సమావేశంలో మాట్లాడిన పవన్.. సీఎం.. సీఎం అనే కేకలు వేస్తే ముఖ్యమంత్రి కాలేను. క్రేన్లతో గజమాలలు వేసే కన్నా.. ఓట్లు వేయాలి. ఓట్లు వేస్తేనే సీఎం అవుతామని గుర్తించాలని సూచించారు. ప్రజాశక్తిని ఓట్ల కింద మార్చుకోవాలంటే నా అంత బలంగా తిరగాలి. ఏం చేసినా నిర్మాణాత్మకంగా చేయాలి. సీఎం అనే…
ముఖ్యమంత్రి కావాలనే చంద్రబాబు కలనే పవన్ కల్యాణ్ కంటున్నాడు అంటూ సెటైర్లు వేశారు సజ్జల.. తనకు బలం లేదని పవన్ అంగీకరించారన్న ఆయన.. తనను ముఖ్యమంత్రిని చేయాలనే అభిమానులను చంద్రబాబుకు తాకట్టుపెడుతున్నాడని కామెంట్ చేశారు సజ్జల రామకృష్ణారెడ్డి.
టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి.. నెల్లూరు జిల్లాలో మీడియాతో మాట్లాడిన ఆయన.. తమ ఉనికిని కాపాడుకునేందుకు చంద్రబాబు. పవన్ కల్యాణ్‌ను రైతులపై ఎనలేని ప్రేమ చూపిస్తున్నట్లు నటిస్తున్నారని విమర్శించారు. అసలు పవన్ కు రాజకీయ అవగాహన లేదన్న ఆయన.. చంద్రబాబు హయాంలో రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు.. మరి అప్పుడు పవన్ ఎందుకు మాట్లాడ లేదు? అని ప్రశ్నించారు.. చంద్రబాబు ప్రభుత్వంలో రైతులకు ఏమి చేశారో…