CM YS Jagan: ఎన్నికల్లో పొత్తుల విషయంలో విపక్షాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. వైఎస్‌ఆర్ మత్స్యకార భరోసా నిధుల విడుదల సందర్భంగా బాపట్ల జిల్లా నిజాంపట్నంలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలోనే చంద్రబాబుకు పేదలు గుర్తుకు వస్తున్నారు.. గత పాలనలో ఎస్సీలకు, మత్స్యకారులకు, బీసీలకు అన్యాయం జరిగింది అని ఆరోపించారు.. నేను చేసిన మంచిని ప్రజలని, దేవుడిని నమ్ముకున్నాను.. కానీ, చంద్రబాబు, దత్త పుత్రుడు పొత్తులు, ఎత్తులు, జిత్తులు, కుయుక్తులు నమ్ముకున్నారు. పెద్ద గ్రౌండ్‌లో సభ పెట్టే దమ్ము లేదు.. చిన్న చిన్న సందుల్లో మీటింగ్ పెట్టి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని ఫైర్ అయ్యారు.. ఇక, చంద్రబాబుతో సహా టీడీపీ వెంటిలేటర్ మీద ఉందని.. దత్త పుత్రుడు రెండు చోట్ల పోటీ చేస్తే ఒక్క చోట కూడా ప్రజలు నమ్మలేదు.. దండం పెట్టి పంపారని ఎద్దేవా చేశారు.
ఇక, ఒక్కో ఎన్నికకు ఒక్కో రేటు పెట్టి పార్టీని అమ్ముతున్న ప్యాకేజ్ స్టార్‌కు సీఎం పదవి అవసరం లేదట అంటూ పవన్ కల్యాణ్‌పై సెటైర్లు వేశారు సీఎం జగన్.. రాష్ట్రాన్ని గజ దొంగల ముఠా లాగా దోచుకోవాలని అందరూ కలుస్తున్నారు.. కానీ, పేదల కోసం నిలబడి ఉన్న నన్ను ఎవ్వరూ ఏమిచేయలేరనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.. అయితే, బీజేపీతో, కాంగ్రెస్ తో పొత్తులు పెట్టుకునేది వీళ్లే.. విడిపోయేది వీళ్లే.. పెళ్లిళ్లు చేసుకునేది వీళ్లీ.. విడాకులు ఇచ్చేది వీళ్లేనంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.. చంద్రబాబు ఏం చెబితే దానికి తల ఆడించడం ఒక్కటే దత్త పుత్రుడి తెలిసిందంటూ ఫైర్ అయ్యారు. బీజేపీకి భయపడే పవన్ ఆ పార్టీ పక్కకు చేరాడని.. కానీ, చంద్రబాబు చెబితే బీజేపీకి దత్త పుత్రుడు విడాకులు ఇస్తాడని వ్యాఖ్యానించారు.. ఇలాంటి రాజకీయాలు కాదు.. రాజకీయాల్లో విశ్వసనీయత కావాలన్నారు జగన్..
గజ దొంగల ముఠాలో.. దుష్ట చతుష్టయం ఉంది.. కర్ణాటకలో కాంగ్రెస్ గెలిస్తే చంద్రబాబు బ్యాచ్ సంబరాలు జరుపుకున్నారు.. మళ్లీ అదే బీజేపీతో కలవాలని తపన పడుతున్నారని విమర్శించారు సీఎం జగన్.. చంద్రబాబు చేయబోతున్న యుద్ధం జగన్ తో కాదు జనంతోనేనన్న ఆయన.. దోచుకున్న సంపద దాచుకోవాలని దిక్కు మాలిన ఆలోచన గజ దొంగలది అన్నారు.. దత్త పుత్రుడు రెండు సినిమాల మధ్య గ్యాప్‌లో పొలిటికల్ మీటింగ్‌లు పెడతాడు.. ప్యాకేజీ స్టార్ వచ్చి చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్ట్ చదివి పోతున్నాడు అంటూ ఆరోపణలు గుప్పించారు.. అధికారంలో ఉంటే అమరావతి, అధికారం లేకపోతే హైదరాబాద్ వెళ్లిపోయే నాయకులు వీళ్లన్న ఆయన.. నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడే తాడేపల్లిలో ఇల్లు కట్టుకున్నా… కానీ, ఆంధ్ర ప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చంద్రబాబు జూబ్లీ హిల్స్ లో ఇల్లు కట్టుకున్నాడు.. మన రాష్ట్ర సంపద దోచుకుని హైదరాబాద్ లో బతుకున్న నాయకులు దత్త పుత్రుడు, దత్త తండ్రి అని విమర్శించారు.. 175 స్థానాల్లో ఒంటరిగా పోటీ చేసే సత్తా కుడా లేదు ఈ నాయకులకు లేదని ఎద్దేవా చేశారు సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.