MLA Nallapareddy: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై సంచలన వ్యాఖ్యలుచేశారు.. కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి.. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం.. జనసేన ఇంకా అందరూ కలుస్తారని చెబుతున్నారు.. అసలు జనసేన పార్టీ ఉందా? అని ప్రశ్నించారు.. ఇక, పవన్ తన శీలాన్ని చంద్రబాబు నాయుడుకి అమ్మేశాడు.. ఎన్ని వందల కోట్లు తీసుకున్నాడో.. పవన్-చంద్రబాబుకే తెలుసని ఆరోపించారు. చంద్రబాబు నాయుడును కలిసేందుకు వెళ్లేటప్పుడు నాదెండ్ల మనోహర్ ను తీసుకెళ్లడు.. అక్కడే అర్థమయిపోతుంది.. కేవలం డబ్బులు కోసమే జనసేన పార్టీని చంద్రబాబు పాదాల దగ్గర పెట్టాడని విమర్శించారు.
ఇక, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తో పాటు కాపు నాయకులను అడుగుతున్నా.. రంగాని చంపించింది చంద్రబాబు నాయుడు కదా..? ఇది జగమెరిగిన సత్యం అన్నారు నల్లపరెడ్డి.. ప్యాకేజీ స్టార్ అంటే చెప్పుతో కొడతాను అని పవన్ అంటున్నాడు.. నువ్వు నిజంగా ప్యాకేజీ స్టార్ వే అని కామెంట్ చేశారు. చంద్రబాబు నాయుడు దగ్గర డబ్బులు తీసుకున్నావు, సూట్ కేసులు చేతులు మారాయి అని ఆరోపించారు. నన్ను చెప్పుతో కొట్టు చూద్దాం.. నీకంత ధైర్యం ఉంటే కోవూరుకి రా నడిరోడ్డులో నిలబడతాను.. చెప్పు తీసుకొని రా నన్ను కొట్టేందుకు అని సవాల్ చేశారు.
చిరంజీవి ఎంతో పెద్దమనిషి.. రాజకీయంలో వచ్చాడు పార్టీ పెట్టాడు హుందాగా ఉన్నాడు.. నీకు ఎక్కడిది హుందాతనం అంటూ పవన్ కల్యాణ్‌పై ఫైర్ అయ్యారు ప్రసన్నకుమార్‌రెడ్డి.. ఆ కుటుంబంలో చెడ పుట్టావు.. 20 నుంచి 25 సీట్లకు చంద్రబాబు నాయుడుకి కొన్ని కోట్ల రూపాయలకు పార్టీని అమ్మేశావన్న ఆయన.. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని దించాలని రంగాను చంపించిన చంద్రబాబు నాయుడుతో చేతులు కలుపుతావా..? అని మండిపడ్డారు.. నిన్ను ప్రజలు క్షమించరు అని హెచ్చరించారు. పవన్‌ను జనసేన పార్టీ కార్యకర్తలు, నాయకులు.. ఫ్యాన్స్ అందరు కూడా చీదరించుకుంటారు.. ఎవరు వచ్చినా జగన్ మోహన్ రెడ్డిని ఏమి పీకలేరు అని వ్యాఖ్యానించారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి.