CM YS Jagan: చంద్రబాబు పేదల ఇళ్ళను సమాధి కట్టే స్థలం అంటాడు.. శ్మశానాలతో పోల్చిన చంద్రబాబుకు మానవత్వం ఉందా? అంటూ ఆవేదన వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. ఇళ్ళు లేని పేదలకు ఎంత ఆవేదన ఉంటుందో అన్న స్పృహ అయినా చంద్రబాబుకు ఉందా? అని ఫైర్ అయ్యారు.. ఒక పక్షి కూడా సొంతంగా ఒక గూడు కట్టుకుని తన కుటుంబంతో ఉంటుంది.. కానీ, పేదల ఇళ్ళను అడ్డుకుంటున్న ద్రోహి చంద్రబాబు అంటూ ఆగ్రహం వ్యక్తం…
టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో జరిగిన వాలంటీర్లకు వందన కార్యక్రమంలో రోజా పాల్గొని ప్రసంగించారు. పేదలకు ఇచ్చే సెంటు స్థలాన్ని చంద్రబాబు సమాధులతో పోల్చడాన్ని ఆమె తప్పుబట్టారు.
14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసి ఎన్ని ఎకరాలు ఇళ్ల పట్టాల కోసం ఇచ్చారో చెప్పాలంటూ చంద్రబాబును ఏపీ ఉపముఖ్యమంత్రి పీడిక రాజన్న దొర ప్రశ్నించారు. విజయనగరం జిల్లా మెంటాడ మండలం కుంటినవలసలో ఆయన చంద్రబాబుపై మండిపడ్డారు.
చంద్రబాబుకు బహిరంగ సవాల్ విసిరారు ప్రభుత్వ సలహాదారు, వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి.. ఆర్ 5 జోన్ లే అవుట్ లలో ప్రభుత్వ సలహాదారు సజ్జల ఈ రోజు పర్యటించారు.. నవులూరు, కృష్ణాయపాలెంలో లేఅవుట్లను పరిశీలించారు.. అయితే, కృష్ణాయపాలెంలో అమరావతి రైతుల నినాదాలు చేశారు.. సజ్జల కాన్వాయ్ వెళుతున్న సమయంలో ఆర్ 5 జోన్ వెనక్కి తీసుకోవాలని నినాదాలు చేశారు అమరావతి రైతులు.. తన పర్యటన తర్వాత మీడియాతో మాట్లాడిన సజ్జల.. లే అవుట్ల అభివృద్ధి…
రాజకీయాల్లో సమాధులు వంటి మాటలు మాట్లాడవచ్చా.. అంటూ చంద్రబాబును మంత్రి బొత్స సత్యనారాయణ అడిగారు. మేం కాన్ఫిడెంట్ గా ఉన్నాం...తుది తీర్పు కూడా పేద ప్రజలకు అనుకూలంగా ఉంటుందని.. చంద్రబాబు ఎవరిని కలిసి రమ్మంటున్నాడో చూద్దాం అని ఆయన అన్నారు.
రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు ఓటు వేయటానికి మాత్రమే ఉన్నారా అంటూ చంద్రబాబును మంత్రి జోగి రమేష్ ప్రశ్నించారు. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పని చేసిన చంద్రబాబు ఒక్క సెంటు భూమి అయినా పెదలకు ఇచ్చారా అని అడిగారు.
ప్రభుత్వంపై రైతులను ఉసిగొల్పాలనే దురుద్దేశంతో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఉన్నారు అని మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. పంట నష్టం అంచనాలకు సంబంధించిన సోషల్ ఆడిట్ రిపోర్ట్ ఈనెల 25న వస్తుంది అని స్పష్టం చేశారు. రైతు భరోసాతో కలిపి ఇన్ ఫుట్ సబ్సిడీ అందజేస్తాం అని ఆయన వెల్లడించారు.
CM YS Jagan: ఎన్నికల్లో పొత్తుల విషయంలో విపక్షాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి.. వైఎస్ఆర్ మత్స్యకార భరోసా నిధుల విడుదల సందర్భంగా బాపట్ల జిల్లా నిజాంపట్నంలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలోనే చంద్రబాబుకు పేదలు గుర్తుకు వస్తున్నారు.. గత పాలనలో ఎస్సీలకు, మత్స్యకారులకు, బీసీలకు అన్యాయం జరిగింది అని ఆరోపించారు.. నేను చేసిన మంచిని ప్రజలని, దేవుడిని నమ్ముకున్నాను.. కానీ, చంద్రబాబు, దత్త పుత్రుడు పొత్తులు, ఎత్తులు,…
MLA Nallapareddy: జనసేన అధినేత పవన్ కల్యాణ్పై సంచలన వ్యాఖ్యలుచేశారు.. కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి.. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం.. జనసేన ఇంకా అందరూ కలుస్తారని చెబుతున్నారు.. అసలు జనసేన పార్టీ ఉందా? అని ప్రశ్నించారు.. ఇక, పవన్ తన శీలాన్ని చంద్రబాబు నాయుడుకి అమ్మేశాడు.. ఎన్ని వందల కోట్లు తీసుకున్నాడో.. పవన్-చంద్రబాబుకే తెలుసని ఆరోపించారు. చంద్రబాబు నాయుడును కలిసేందుకు వెళ్లేటప్పుడు నాదెండ్ల మనోహర్ ను తీసుకెళ్లడు.. అక్కడే అర్థమయిపోతుంది.. కేవలం డబ్బులు కోసమే జనసేన…