చంద్రబాబు, పవన్ కల్యాణ్‌పై మంత్రి జోగి రమేష్ విమర్శలు గుప్పించారు. పేదలకు ఇస్తున్న సెంటు స్థలంలో సమాధులు కట్టుకోవాలని చంద్రబాబు అనడం దారుణమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ఇంత దుర్మార్గంగా మాట్లాడతారా?అమరావతిలో రాజధాని కడితే పేదవాళ్లు అక్కడ ఉండకూడదా?.. పవన్, చంద్రబాబు పార్టీలను భూస్థాపితం చేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. చంద్రబాబును రాజకీయ సమాధి చేయడానికి వైసీపీ రెడీగా ఉంది అని మంత్రి జోగిరమేష్ అన్నారు. చంద్రబాబుకు ఊడిగం చేయడానికి పవన్ ఉన్నారా? చేతకాక సీఎం పదవి వద్దని పవన్ అంటున్నారు అని మంత్రి జోగి రమేష్ విమర్శలు గుప్పించారు.
Also Read : NTR: మరోసారి విలన్ గా ఎన్టీఆర్.. ఏ సినిమాలో అంటే..?
చంద్రబాబు మంచి నీళ్ళు తాగి మాట్లాడాడా లేకపోతే అయ్యన్న పాత్రుడు ఇచ్చిన గంజాయి తాగి మాట్లాడాడా.. అంటూ మంత్రి జోగి రమేష్ అన్నారు. మూడు సెంట్ల భూమి ఇచ్చానని చంద్రబాబు పచ్చి అబద్ధాలు చెప్పాడు అని మండిపడ్డారు. 31 లక్షల మంది పేద వర్గాలకు ఇళ్ళు సిద్ధం అవుతుంటే ఇలాంటి వ్యాఖ్యలు చంద్రబాబు చేయడం బాధకరమని మంత్రి అన్నారు. రాష్ట్ర ప్రజలు చంద్రబాబు రాజకీయ జీవితాన్ని, టీడీపీని సమాధి చేయనున్నారు అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read : Revanth Reddy : బండి సంజయ్… కేసీఆర్ ఇద్దరి మాటలు ఒకేలా ఉన్నాయి
రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు ఓటు వేయటానికి మాత్రమే ఉన్నారా అంటూ చంద్రబాబును మంత్రి జోగి రమేష్ ప్రశ్నించారు. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పని చేసిన చంద్రబాబు ఒక్క సెంటు భూమి అయినా పెదలకు ఇచ్చారా అని అడిగారు. అమరావతిలో రాజధాని కడితే పేదవాళ్ళు అక్కడ ఉండకూడదా..?అని ప్రశ్నించారు. చంద్రబాబు ఇంత దుర్మార్గంగా మాట్లాడతారా.. చంద్రబాబు రోడ్డు పై కేకలు, రంకెలు వేస్తున్నాడు..ఎంత మంది పొత్తులు పెట్టుకుని వచ్చినా వాళ్లను ఓడించటానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు అని మంత్రి వ్యాఖ్యానించారు. మళ్లీ 2024లో వచ్చేది జగన్ సర్కార్ వస్తుందని ధీమా వ్యక్తం చేశాడు. చంద్రబాబు తన హయాంలో పేదలకు ఇచ్చానని చెప్పుకుంటున్న ఇళ్ళ స్థలాల వివరాలు బయట పెట్టాలి అంటూ మంత్రి జోగి రమేష్ సవాల్ విసిరారు.