విజయవాడ, గుంటూరు జిల్లాల్లో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి పర్యటన కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియా రేపు (శుక్రవారం) విజయవాడ, గుంటూరు జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈరోజు సాయంత్రం ఢిల్లీ నుండి విజయవాడ చేరుకుని.. రాత్రికి విజయవాడలో బస చేయనున్నారు. శుక్రవారం ఉదయం 9.15 కు విజయవాడలో పాత ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో క్రిటికల్ కేర్ బ్లాక్, BSL-3 ల్యాబ్ నిర్మాణానికి కేంద్రమంత్రి శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం అక్కడ కొత్తగా నిర్మించిన IPHL ల్యాబ్స్…
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వెళ్ళనున్న బహిరంగ సభల షెడ్యూల్ ఖరారు అయింది. జనవరి 5వ తేదీ నుంచి 25 పార్లమెంట్ సెగ్మెంట్లల్లో చంద్రబాబు బహిరంగ సభలు నిర్వహించనున్నారు. అంతేకాకుండా.. రెండు రోజుల్లో మూడు బహిరంగ సభలు నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. తొలి విడతలో జనవరి 5వ తేదీ నుంచి 10వ తేదీ వరకు బహిరంగ సభల షెడ్యూల్ ఉండనుంది. అంతేకాకుండా.. తొలి విడతలో ఏడు పార్లమెంట్ సెగ్మెంట్లను కవర్ చేసేలా టీడీపీ ప్రణాళికలు సిద్ధం…
జగన్ లాంటి పరిపాలన వ్యవస్థ ఏర్పాటు చేసేవాన్ని వదిలేసి చంద్రబాబు లాంటి దుర్మార్గున్ని తెచ్చుకొని కొరివితో తల గోక్కుంటామా అని ప్రజలే అంటున్నారు.. ప్రశాంత్ కిషోర్ సొంత పార్టీ పెట్టాలని ఆశ ఉంది.. బీజేపీని ఓడించడానికి దేశంలోని నాయకుల అందరిని అనుసంధానం చేశాడు.. అది బెడీసీ కొట్టింది అని మంత్రి కొట్టు సత్యనారాయణ విమర్శలు గుప్పించారు.
బడుగు, బలహీన వర్గాల స్థితిగతులు పెంచేందుకు జగన్ ఎంతో కృషి చేస్తున్నారని మంత్రి మేరుగ నాగార్జున పేర్కొన్నారు. రాష్ట్రంలోనే పేదల విద్యార్థులు బాగుండాలనే ఉద్దేశంతో ఇంగ్లీష్ మీడియంలో తీసుకువచ్చారని.. చంద్రబాబు మనవడు ఇంగ్లీష్ మీడియంలో చదవచ్చు.. వాళ్ళ బంధువులు చదవచ్చు.. కానీ బడుగు వర్గాల పిల్లలు మాత్రం చదువుకోకూడదని న్యాయస్థానాలకు వెళ్ళాడని ఆయన తీవ్రంగా మండిపడ్డారు.
అన్ని వర్గాల అవసరాలను తీర్చే పాలనను ముఖ్యమంత్రి జగన్ ఇస్తున్నారని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పీడిక రాజన్న దొర పేర్కొన్నారు. వైఎస్సార్ కంటే రెండడుగులు ముందుకు వేసి సంక్షేమ పథకాలను అందిస్తున్నారని ఆయన అన్నారు. ఎలాంటి సిఫారసు లేకుండా అర్హులందరికీ వారి ఖాతాల్లో నేరుగా లబ్ధిని అందిస్తున్నారని ఆయన స్పష్టం చేశారు.
ఏపీలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. ఎన్నికలకు ముందే పార్టీల మధ్య యుద్ధం మొదలైంది. టీడీపీ, జనసేన వర్సస్ అధికార వైఎస్సార్సీపీ మధ్య నెట్టింట పోస్టర్ వార్ మొదలైంది.
గతంలో వైసీపీ కోసం పనిచేసిన సమయంలో వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు.. బీహార్ వాడొచ్చాడు వాడి వల్ల ఏమవుతుందన్న చంద్రబాబు.. ఇప్పుడు ఎందుకు పీకేతో కలుస్తున్నారని మంత్రి మేరుగ నాగార్జున ప్రశ్నించారు. పది మంది ప్రశాంత్ కిషోర్లు వచ్చినా ప్రజలంతా సీఎం జగన్ వెంట ఉన్నారన్నారు.
బీజేపీ ఎంపీ జీవీఎల్ నర్సింహారావు పొత్తులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. పొత్తుల అంశం బీజేపీ జాతీయ పార్టీ నిర్ణయం తీసుకుంటుందన్న ఆయన.. ఎన్నికల సందర్భంలో పొత్తులపై నిర్ణయం ఉంటుందన్నారు.. అధికార పార్టీ నేతలు మాపై ఆరోపణలు చేయడం సబబు కాదని హితవుపలికారు. ఏదేమైనా బీజేపీ నిర్ణయం లేటైనా లేటెస్ట్ గా ఉంటుందని చెప్పుకొచ్చారు