ఆంధ్రప్రదేశ్లో వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీచేయాలనే నిర్ణయానికి వచ్చిన తెలుగుదేశం-జనసేన పార్టీలు ఉమ్మడి కార్యాచరణతో ముందుకు సాగుతున్నాయి. అందులో భాగంగా.. సీఎంగా వైఎస్ జగన్ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లటమే లక్ష్యంగా ఇవాళ్టి నుంచి "రా కదలి రా!" పేరిట తెలుగుదేశం కార్యక్రమాలు నిర్వహిస్తోంది.. ఇక, తెలుగుదేశం- జనసేన ఎన్నికల గుర్తులతో సరికొత్త లోగో ఆవిష్కరించారు..
గుంటూరులో మంత్రి రజని కార్యాలయంపై దాడి చేయడం దుర్మార్గమని మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు. ఆఫీస్ మీద రాళ్లు వేసి ఫ్లెక్సీలు చింపివేసి టీడీపీ శ్రేణులు రౌడీయిజం చేశారని తీవ్రంగా మండిపడ్డారు. టీడీపీ వాళ్లు ఫ్రీ ప్లాన్డ్గా చేసిన చర్య ఇది అంటూ ఆయన ఆరోపించారు. మంత్రి విడుదల రజిని కార్యాలయంపై దాడి చేయడం హింసను ప్రేరేపించడమేనని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలుగు ప్రజలకు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పారు. కొత్త ఆశతో, కొత్త సంకల్పంతో, కొత్త విశ్వాసంతో కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుదామని చంద్రబాబు అన్నారు.
చంద్రబాబుపై మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మళ్లీ అధికారంలోకి వస్తానని చంద్రబాబు చెబుతున్నారు.. ఆయన తల పని చేస్తోందో లేదో.. అర్థం కావడం లేదని విమర్శించారు. ఏమి ఆలోచన చేసి మాట్లాడుతున్నాడో తెలియడం లేదని దుయ్యబట్టారు. కుప్పం ప్రాంతంలో పండించే కూరగాయలను కార్గో విమానాశ్రయం ఏర్పాటు చేసి విదేశాలకు పంపిస్తానని చెప్పాడు.. నాకు వదిలేయండి అని నేను చూసుకుంటానని చెబుతున్నాడన్నారు మంత్రి కాకాణి. ఎన్నికల వరకే ఆయన చూసుకుంటానంటాడు.. ఆ తర్వాత వదిలేస్తాడని…
టీడీపీ అధినేత చంద్రబాబు తన సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆకాశమే హద్దుగా కుప్పం ప్రజలు అభిమానం చూపిస్తున్నారని అన్నారు. ఈసారి కుప్పంలో లక్ష మెజారిటీ గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. వైసీపీకి పెయింటింగ్స్ మీదా ఉండే అభిమానం ప్రజల మీద లేదని ఆరోపించారు. జగన్ జాబ్ క్యాలెండర్ విడుదల చేశాడా అని దుయ్యబట్టారు. జగన్ బటన్ నొక్కడంలో చిదంబరం రహస్యం ఉందని విమర్శించారు. సొంత పేపర్ కు యాడ్ ఇవ్వడానికి…
తమ ప్రభుత్వం మహిళలకు భద్రత కల్పిస్తున్నదని ఎంపీ నందిగం సురేష్ తెలిపారు. మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు ఇచ్చిన ప్రభుత్వం.. వైసీపీ ప్రభుత్వం అని అన్నారు. ఒకప్పుడు ఓటు వేయడానికి మాత్రమే ఎస్సీలు ఉండేవాళ్ళు.. ఈరోజు ఎస్సీలు హోంమంత్రులుగా పనిచేసే పరిస్థితి జగనన్న ప్రభుత్వంలో వచ్చిందని పేర్కొన్నారు. కర్మ గాలి చంద్రబాబు అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రంలో ఎస్సీలు, బీసీలు, మైనార్టీలు నిర్వీర్యం అయిపోతారని విమర్శించారు. రాజధాని ప్రాంతంలో మనం ఉంటే మురికి కూపాలుగా మారతాయని కోర్టుల్లో…
ఒక పార్టీ అధ్యక్షుడిపై గెలిచినపుడు గొప్పగా అనిపించింది.. ఇపుడు చూస్తుంటే చాలా మామూలు వ్యక్తిపై గెలిచినట్టు ఉంది అని ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ అన్నారు. పార్టీ పెట్టినప్పుడు చేగువేరాతో పాటు మహనీయుల ఫోటో పెట్టుకున్న పవన్ ఇపుడు అవి తీసేసి.. చంద్రబాబు ఫోటో పెట్టుకున్నారు.. చంద్రబాబులో పవన్ కళ్యాణ్ కి చేగువేరా కనిపిస్తున్నాడు అని ఆయన ఎద్దేవా చేశారు.