చంద్రబాబు, ప్రశాంత్ కిషోర్, లోకేష్.. ఆ ముగ్గురి మధ్య మూడు గంటల పాటు సాగిన చర్చలు ఇప్పుడు కీలకంగా మారాయి.. ఏపీలో రానున్న రోజుల్లో ఎలాంటి రాజకీయ ఎత్తుగడులు వేస్తారు. పీకే.. టీడీపీతో కలిసి పనిచేస్తారా? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
చంద్రబాబు-పీకే భేటీపై స్పందించిన మంత్రి అంబటి రాంబాబు.. ప్రశాంత్ కిషోర్.. టీడీపీకి ప్రాణం పోయడానికి పనికిరాడు.. చనిపోయిన టీడీపీకి పోస్టుమార్టం చేయడానికి మాత్రమే పనికొస్తాడు అని వ్యాఖ్యానించారు. ఎంతమంది ప్రశాంత్ కిషోర్‌లు వచ్చినా, ఎంతమంది పవన్ కల్యాణ్‌లు కట్ట కట్టుకుని వచ్చినా.. ఎన్ని వ్యూహాలు రచించినా టీడీపీ గెలవడం అసాధ్యం అని జోస్యం చెప్పారు.
మాజీ మంత్రి, కాపు సంక్షే సేన అధ్యక్షుడు హరిరామ జోగయ్య జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌కు బహిరంగ లేఖ రాశారు. చంద్రబాబే కాబోయే ముఖ్యమంత్రి.. ఈ నిర్ణయంలో రెండో మాటలేదు.. "అనుభవస్తుని నాయకత్వమే ఈరాష్ట్రానికి కావాలి" అని పవన్ కళ్యాన్ అనేక సార్లు ప్రకటించారు.. కనుక అందరి మాట ఇదే అంటూ" లోకేష్ ప్రకటించేశారని ఆయన లేఖలో తెలిపారు.
2014లో పెళ్లి అయ్యింది.. విడాకులు తీసుకున్నారు.. ఇప్పుడు మళ్లీ కలిశారు అంటూ టీడీపీ-జనసేన పొత్తులపై సెటైర్లు వేశారు మంత్రి బొత్స సత్యనారాయణ.. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పని చేసిన చంద్రబాబు ఉత్తరాంధ్రాకు ఏమి చేశారు..? అని నిలదీసిన ఆయన.. ఇది ప్రజాస్వామ్యం అనుకుంటున్నారా?రాజరికం అనుకుంటున్నారా? అని ప్రశ్నించారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని.. 12 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో అవసరాల కోసం మభ్యపెట్టడం, మోసం చేయడం, అబద్దాలు చెప్పడం.. దైవభక్తి ఉన్న వైఎస్ జగన్ ఎన్నడూ చేయలేదన్నారు.
జాబు రావాలంటే బాబు రావాలని అబద్ధాలు చెబుతున్నారు అంటూ కేఏ పాల్ అన్నారు. 60 లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఎలా ఇస్తారు.. చంద్రబాబుకు బిల్ క్లింటన్, బిల్గేట్స్ ను నేనే పరిచయం చేశా.. రైతులకు రుణమాఫీ గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు చేయలేదు.. కాంగ్రెస్ మేనిఫెస్టోను కాపీ కొట్టి మహిళలకు ఉచిత బస్సు వైద్యం వీటన్నిటి గురించి వాగ్దానాలు చేస్తున్నారు.
సజ్జల మాట్లాడుతూ.. కోట్లాది మంది హృదయాల్లో శాశ్వత స్థానం సంపాదించుకున్నారు వైఎస్ రాజశేఖర రెడ్డి.. మన కాళ్ళపై మనం నిలబడే విధంగా ప్రజల జీవితాల్లో పూర్తి మార్పు తీసుకుని రావటం అంత తేలిక కాదు.. దీన్ని చేసి చూపించిన వ్యక్తులు అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి.. ఇప్పుడు ఆయన కుమారుడు జగన్ కే సాధ్యం అని ఆయన చెప్పారు.
విశాఖపట్నంలో యువగళం విజయోత్సవ సభ కేవలం సీఎం జగన్ ని తిట్టటానికే ప్రాధాన్యత ఇచ్చారు అని డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. పాదయాత్రలోని అనుభవాలను, ప్రజల సమస్యలను కనీసం సభలో చెప్పలేదు.. సీనియర్ అని చెప్పుకున్న చంద్రబాబు.. ఇటు పవన్ ని తీసుకు రావటానికి పడిన పాట్లు అందరూ గమనించారు.