అన్ని వర్గాల అవసరాలను తీర్చే పాలనను ముఖ్యమంత్రి జగన్ ఇస్తున్నారని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పీడిక రాజన్న దొర పేర్కొన్నారు. వైఎస్సార్ కంటే రెండడుగులు ముందుకు వేసి సంక్షేమ పథకాలను అందిస్తున్నారని ఆయన అన్నారు. ఎలాంటి సిఫారసు లేకుండా అర్హులందరికీ వారి ఖాతాల్లో నేరుగా లబ్ధిని అందిస్తున్నారని ఆయన స్పష్టం చేశారు.
ఏపీలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. ఎన్నికలకు ముందే పార్టీల మధ్య యుద్ధం మొదలైంది. టీడీపీ, జనసేన వర్సస్ అధికార వైఎస్సార్సీపీ మధ్య నెట్టింట పోస్టర్ వార్ మొదలైంది.
గతంలో వైసీపీ కోసం పనిచేసిన సమయంలో వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు.. బీహార్ వాడొచ్చాడు వాడి వల్ల ఏమవుతుందన్న చంద్రబాబు.. ఇప్పుడు ఎందుకు పీకేతో కలుస్తున్నారని మంత్రి మేరుగ నాగార్జున ప్రశ్నించారు. పది మంది ప్రశాంత్ కిషోర్‌లు వచ్చినా ప్రజలంతా సీఎం జగన్ వెంట ఉన్నారన్నారు.
బీజేపీ ఎంపీ జీవీఎల్ నర్సింహారావు పొత్తులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. పొత్తుల అంశం బీజేపీ జాతీయ పార్టీ నిర్ణయం తీసుకుంటుందన్న ఆయన.. ఎన్నికల సందర్భంలో పొత్తులపై నిర్ణయం ఉంటుందన్నారు.. అధికార పార్టీ నేతలు మాపై ఆరోపణలు చేయడం సబబు కాదని హితవుపలికారు. ఏదేమైనా బీజేపీ నిర్ణయం లేటైనా లేటెస్ట్ గా ఉంటుందని చెప్పుకొచ్చారు
చంద్రబాబు ఎంతమంది పీకేలను పెట్టుకున్నా.. సీఎం వైఎస్ జగన్ను పీకేదేం ఉండదన్నారు కొడాలి నాని . చంద్రబాబు అవుట్డేటెడ్ పొలిటీషియన్ అని సీఎం జగన్, మేం రోజు చెబుతూనే ఉన్నాం.. ఇప్పుడు ప్రశాంతి కిషోర్ ను కలిస్తే భూమి బద్దలై పోతుందా..? అని ప్రశ్నించారు. ప్రశాంత్ కిషోర్ ను మేం పూర్తిగా వాడేశాం.. ఆయన బుర్రలో గుజ్జంతా అయిపోయిందని వ్యాఖ్యానించారు.
ఎంతమంది చంద్రబాబు కలిసి వచ్చినా.. వైఎస్ జగన్ను ఏమీ చేయలేరు.. వచ్చే ఎన్నికల్లో మళ్లీ గెలిచేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే అంటున్నారు ఏపీ మంత్రులు, వైసీపీ నేతలు.. ఇక, గుంటూరులో మీడియాతో మాట్లాడిన మంత్రి విడుదల రజిని.. ఎవరు ఎవరిని తెచ్చుకున్నా ఇక్కడ గెలిచేది వైసీపీనే అని ధీమా వ్యక్తం చేశారు.