విజయవాడ ఎంపీ కేశినేని నాని మరోసారి సొంతపార్టీ, అధినేతపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫిబ్రవరిలో నా నిర్ణయం ప్రకటిస్తానని ఆయన తెలిపారు. శుక్రవారం విజయవాడలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. టీడీపీలో కొనసాగాలా ? వద్దా ? అనే విషయంపై సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటానని వెల్లడించారు.
తిరువూరులో ఎంపీ కేశినేని నాని, కేశినేని చిన్ని వర్గాల మధ్య ఘర్షణ రచ్చగా మారింది.. దీంతో, చర్యలకు పూనుకుంది టీడీపీ.. ఎంపీ కేశినేని నానికి క్లారిటీ ఇచ్చేసింది.. బెజవాడ ఎంపీ టిక్కెట్టను వేరే వారికి కేటాయిస్తున్నట్టు స్పష్టం చేసింది.. ఇదే విషయాన్ని తన ఫేస్ బుక్ పేజీలో పోస్ట్ చేశారు ఎంపీ కేశినేని నాని. మొత్తంగా తిరువూరు ఘటన తర్వాత క్లారిటీ ఇచ్చేసింది టీడీపీ అధిష్టానం.
బీసీల్లో ఎంత మందికి ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ పదవులు ఇవ్వగలమో అంతమందికి ఇస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు హామీ ఇచ్చారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో చంద్రబాబు ఆధ్వర్యంలో ‘జయహో బీసీ’ వర్క్ షాప్ జరిగింది. ఈ నేపథ్యంలో చంద్రబాబు ప్రసంగించారు.
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల పొత్తులపై చర్చ సాగుతోంది. కుదిరిన పొత్తులపై క్లారిటీ లేకపోగా.. కొత్త పొత్తులపై సీఎం వైఎస్ జగన్ మాట్లాడడం.. కొత్త చర్చకు దారి తీసింది.. అసలు సీఎం వైఎస్ జగన్ ఉద్దేశం ఏంటి? అనేది ఆసక్తికరంగా మారింది. ఆయన వ్యాఖ్యలతో పొత్తుల విషయం ఇంకా అస్పష్టంగానే ఉందనే సంకేతాలు కనిపిస్తున్నాయి.. పొత్తుల విషయం ఇంకా ఉందంటూ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారిపోయింది.
కుటుంబంలో చిచ్చు పెడుతున్నారంటూ సీఎం జగన్ చేసిన కామెంట్లపై టీడీపీ అధినేత చంద్రబాబు కౌంటర్ ఇచ్చారు. మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ సెంటర్లో ఆంధ్రప్రదేశ్ సర్పంచుల సంఘం, ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ల ఆధ్వర్యంలో జరిగిన రాష్ట్ర స్థాయి సదస్సులో ఆయన ప్రసంగించారు. తన ఇంట్లో తాను చిచ్చు పెట్టుకున్న జగన్ మాపై పడటమేంటి అని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
మహిళా శక్తికి కృతజ్ఞుడను.. కేరళలోని త్రిసూర్‌లో ప్రధాని మోడీ ప్రసంగం ఈ ఏడాది చివర్లో జరగనున్న లోక్‌సభ ఎన్నికల కోసం బీజేపీ ప్రచారానికి మెగా పుష్‌గా భావించే ప్రధాని నరేంద్ర మోడీ దక్షిణ భారత పర్యటనలో 2వ రోజు త్రిసూర్‌లో భారీ రోడ్‌షో నిర్వహించారు. అనంతరం భారీ బహిరంగ సభలో ప్రధాని మోడీ ప్రసంగించారు. బుధవారం కేరళలోని త్రిసూర్‌లో జరిగిన మహిళా సదస్సులో ప్రధాని నరేంద్ర మోడీ మహిళలను ఉద్దేశించి ప్రసంగిస్తూ.. ఇంత పెద్ద సంఖ్యలో ఇక్కడికి…
చంద్రబాబు సమక్షంలో వివిధ జిల్లాల నుంచి వచ్చిన వైసీపీ నేతలు, కార్యకర్తలు టీడీపీలో చేరారు. వారికి పార్టీ అధినేత చంద్రబాబు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. విశాఖ, కడప, అనంతపురం, చీరాల, బాపట్ల, పార్వతీపురం నియోజకవర్గాల నుంచి వచ్చిన వైసీపీ నేతలు తెలుగుదేశంలో చేరారు.
టీడీపీ, చంద్రబాబుకు వైసీపీని చూస్తే ఎందుకు అంత భయమని ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున పేర్కొన్నారు. వైసీపీ ఇంఛార్జ్‌లను మార్చుకుంటే మీరు ఎందుకు భయపడుతున్నారంటూ ఆయన ప్రశ్నించారు. పురంధేశ్వరి టీడీపీ బీ టీం అన్న మంత్రి.. ఎస్సీ, ఎస్టీ, బీసీల గురించి మాట్లాడే స్థితికి పురంధరేశ్వరి వెళ్ళిందని.. కారంచేడులో దళితులు ఎంత మంది చనిపోయారో తెలుసా అంటూ ఆయన ప్రశ్నించారు.
ఎన్నికల వేళ టీడీపీ- జనసేన మళ్లీ కుట్రలకు తెరతీస్తారని సీఎం జగన్ పేర్కొన్నారు. 2014 ఎన్నికల్లో చంద్రబాబు, పవన్ కల్యాణ్ ప్రజలను అడ్డగోలుగా మోసం చేశారన్నారు.