YS Jagan: రాష్ట్రంలో కనీస మద్దతు ధరలు లభించక రైతులు రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నా వారి గోడును సీఎం చంద్రబాబు పట్టించుకోవడం లేదని వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. కనీస మద్దతు ధరలు లభించక, పెట్టిన పెట్టుబడులూ రాక రైతులు అప్పుల ఊబిలోకి కూరుకు పోతున్నారు.
Minister Kondapalli: విజయనగరం జిల్లా మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వేల కోట్లతో అమరావతి రాజధాని నిర్మాణానికి నాంది పలకడం శుభ పరిణామం అన్నారు. రాష్ట్రం విడిపోయి పదేళ్లు అయినా రాజధాని విషయంలో వెనకబడి ఉన్నాం.. గత పాలకులు రాజధానిని నిర్వీర్యం చేశారు.
Ambati Rambabu: అమరావతి పునః ప్రారంభ సభలో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ అసత్యాలు చెప్పారని మాజీ మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు. అమరావతి ఒక అంతులేని కథ.. అమరావతి నిర్మించడంలో చంద్రబాబు అట్టర్ ప్లాప్ అయ్యారు అని మండిపడ్డారు.
డ్రోన్లు, బెలూన్ల ఎగరవేతపై ఏపీ పోలీసులు ఆంక్షలు విధించారు. రేపు ప్రధాని మోడీ పర్యటన నేపథ్యంలో అమరావతి పరిధిలో డ్రోన్లు, బెలూన్ల ఎగరవేతపై నిషేధం విధించారు. ఒకవేళ ఎగరవేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
ప్రధాని మోడీ శుక్రవారం ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించనున్నారు. అమరావతిలో రాజధాని నిర్మాణ పనులను మోడీ ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా సుమారు రూ.58 వేల కోట్ల అమరావతి ప్రాజెక్ట్‌లకు శంకుస్థాపనం, ప్రారంభోత్సవాలు చేయనున్నారు.
Merugu Nagarjuna : ఏపీలో చదువులమ్మ తల్లిని చంద్రబాబు అటకెక్కిస్తున్నారని వైసీపీ మాజీ మంత్రి మేరుగ నాగార్జున అన్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చదువుకు జగన్ అధిక ప్రాధాన్యత ఇచ్చారని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాకుండా… అమ్మ ఒడి ద్వారా ప్రతీ తల్లి ఖాతాలో 15 వేల రూపాయలు జమచేశారని, ఏపీలో గొప్ప సంస్కరణలకు జగన్ ఆధ్యుడని ఆయన తెలిపారు. చంద్రబాబు అమ్మ ఒడి పథకాన్ని తల్లికి వందనంగా పేరుమార్చారని, ఇంట్లో ఎంత మంది పిల్లలుంటే అంతమందికీ 15…
Perni Nani: కూటమి ప్రభుత్వానికి బిల్డప్ ఎక్కువ.. బిజినెస్ తక్కువ అని వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని ఆరోపించారు. ఎన్నికల ముందు సీఎం చంద్రబాబు ప్రగల్భాలు పలికి అధికారంలోకి వచ్చారు..
Chelluboyina Venu: తన మనుషులకు లబ్ధి చేకూర్చటానికి ముఖ్యమంత్రి చంద్రబాబు లిక్కర్ పాలసీనే మార్చారని మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ విమర్శించారు. దీని వల్ల సంవత్సరానికి 1100 కోట్ల రూపాయల చొప్పున ఐదేళ్లలో 5500 కోట్లు ఖజానాకు నష్ట వచ్చిందని తెలిపారు.
Margani Bharat: చంద్రబాబు సమయంలోనే కొత్త డిస్పిలరీలకు అనుమతులు వచ్చాయని వైసీపీ నేత, మాజీ ఎంపీ మార్గాని భరత్ రామ్ అన్నారు. గత టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడే నాలుగైదు డిస్టిలరీలకు అత్యధికంగా ఆర్డర్లు ఇచ్చేవారని ఆరోపించారు.