సాయితేజ కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలవాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మకు టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. ఇటీవల హెలికాఫ్టర్ ప్రమాదంలో సీడీఎస్ బిపిన్ రావత్‌తోపాటు సాయితేజ దుర్మరణం పాలైన విషయం తెల్సిందే.. చిత్తూరు జిల్లా వాసి లాన్స్ నాయక్ సాయితేజ కుటుంబానికి కోటి రూపాయలు పరిహారం ఇవ్వాలని లేఖలో తెలిపారు. సాయి తేజ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలన్నారు. కేవలం తొమ్మిదేళ్ల సర్వీసులో త్రివిధ దళాదిపతి వ్యక్తిగత భద్రతా సిబ్బందిలో చేరే…
గౌరవ సభల పేరుతో టీడీపీ రాష్ట్రవ్యాప్త ఉద్యమ కార్యాచరణ సిద్ధం చేసింది. ఇంట్లో ఆడవాళ్లని కూడా చట్టసభల్లో దూషిస్తూ కౌరవ సభలుగా మారుస్తున్నారని ఆరోపిస్తూ ప్రజల్లోకి వెళ్లాలన్నది ప్రణాళిక. అయితే ఈ వివాదానికి మూల కారణమైన వల్లభనేని వంశీ.. క్షమాపణలు చెప్పేశారు. అయినప్పటికీ ఆ కామెంట్సే అజెండాగా గౌరవ సభలు నడపాలా.. ఆగాలా..? అన్నది ప్రస్తుతం టీడీపీలో జరుగుతున్న చర్చ. వంశీ క్షమాపణలు తర్వాత టీడీపీ డైలమాలో పడ్డట్టుగానే కన్పిస్తోంది. ఏపీలో గౌరవ సభలు నిర్వహించాలని టీడీపీ…
చంద్రబాబుకు సజ్జల రామకృష్ణారెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఓటీఎస్ పై విమర్శించే నైతిక హక్కు చంద్రబాబు కు లేదని ఫైర్ అయ్యారు సజ్జల. పేదలందరూ దశాబ్దాలుగా ప్రభుత్వం ఇచ్చిన స్థలంలో ఇళ్లు కట్టుకుని ఉంటున్నారని.. సీఎం జగన్ చొరవతో ఇళ్ల రుణాలన్నీ మాఫీ చేసి ఉచితంగా రిజిస్ట్రేషన్ చేస్తున్నారన్నారు. ఓటీఎస్ పై ప్రజలు సహాయ నిరాకరణ చేయాలని చంద్రబాబు కోరారంటే దాన్ని ఏమనాలో వారే ఆలోచించుకోవాలని చురకలు అంటించారు. ఓటీఎస్ పథకంలో పేదలకు నష్టం కల్గించేది అంటూ ఏదీ…
టీడీపీ అధినేత చంద్రబాబు డా.బీఆర్ అంబేద్కర్ వర్థంతి సందర్బంగా నివాళులు అర్పించారు. అంతేకాకుండా రాజ్యాంగంలో ప్రతి ఒక్కరికీ హక్కులు ఉన్నాయంటూ వైసీపీ ప్రభుత్వ ఆ హక్కులను కాలరాస్తుందని తీవ్రంగా విమర్శించారు. అంతేకాకుండా ఓటీఎస్ పేరుతో ప్రజలకు వైసీపీ ప్రభుత్వం ఉరి వేస్తోందని చంద్రబాబు ఆరోపించారు. అయితే ఈ నేపథ్యంలో చంద్రబాబు మాటలకు కౌంటర్ గా వైసీపీ నేత, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు.
అంబేడ్కర్ 65వ వర్థంతిని స్మరించుకుంటూ ఆ మహనీయునికి జాతీ మొత్తం ఘన నివాళుర్పిస్తుందని టీడీపీ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. భారతదేశమంతటా రాజ్యాంగం ఒకేలా అమలు చేస్తుందన్నారు. కానీ ఏపీలో మాత్రం రాజ్యాంగం రోజు రోజుకు అవహేళనకు గురవుతుందని విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో రాష్ర్టంలో రాజ్యాంగ విలువలు, హక్కులను కాలరాస్తున్నారని ఆరోపించారు. సమాజంలో ఉన్న వైషమ్యాలు రూపుమాపాలని డాక్టర్ అంబేడ్కర్ రాజ్యాంగాన్ని రచించారన్నారు.…
ఇటీవల ఏపీలో కురిసిన భారీ వర్షాలకు పలు జిల్లాలో వరదలు సంభవించాయి. వాగులు, వంకలు పొంగిపొర్లి గ్రామాల్లోకి వరద నీరు చేరడంతో తీవ్ర పంట, ఆస్తి నష్టం చోటు చేసుకుంది. వర్షాలతో అన్నమయ్య ప్రాజెక్ట్‌కు భారీగా వరద నీరు చేరడంతో అన్నమయ్య జలాశయం కొట్టుకుపోయింది. దీంతో అన్నమయ్య ప్రాజెక్ట్ కొట్టుకుపోవడం మానవ తప్పిదం అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపణలు చేశారు. చంద్రబాబు మాటలకు కౌంటర్‌గా మంత్రి అనిల్ మాట్లాడుతూ.. అన్నమయ్య ప్రాజెక్ట్ కెపాసిటీ 2లక్షల 17…
ఇటీవల జరిగిన మునిసిపాలిటీలు, నగర పంచాయతీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఎదురైన అనుభవాలు, ఫలితాలపై పార్టీ అధినేత చంద్రబాబునాయుడు సమీక్ష నిర్వహించారు. పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు మున్సిపాల్టీ నేతలతో చంద్రబాబు సమావేశం అయ్యారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై విశ్లేషించారు. స్థానిక సంస్థల ఎన్నికలెప్పుడూ అధికార పార్టీకి అనుకూలంగానే ఉంటాయన్నారు. గతంలో టీడీపీ నంద్యాల ఉప ఎన్నికలోనూ.. ఆ తర్వాత కాకినాడ మున్సిపల్ ఎన్నికల్లోనూ ఘన విజయం సాధించింది. కానీ ఏడాది తర్వాత జరిగిన సాధారణ ఎన్నికల్లో వైసీపీ…
ప్రపంచ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవంలో పాల్గొన్న చంద్రబాబు వైసీపీపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ సందర్భంగా కార్యక్రమ అనంతరం మీడియాతో మాట్లాడారు.రాజ్యాంగం ఇంకా బతికే ఉంది.. తప్పును ప్రశ్నించే హక్కు అందరికి ఉందన్నారు.చట్ట సభలకు దివ్యాంగులను పంపే బాధ్యత నేను తీసుకుంటా.దివ్యాంగులకు రిజర్వేషన్లు ఇచ్చే ప్రయత్నం చేస్తానని చెప్పారు. దివ్యాంగుల కోసం ఒక కార్పొరేషన్ పెట్టి లక్షల మందికి సాయం చేశాం. విభిన్న ప్రతిభావంతులకు రూ. 500 ఉండే పెన్షన్‌ను రూ. 3 వేలు చేశామని ఆయన…
నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన మూడవ చిత్రం “అఖండ”. నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి ఖండ ఖండాలలో ‘అఖండ’మైన విజయం లభించింది. 2021లో ఓవర్సీస్ లో భారీ కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా ‘అఖండ’ రికార్డు క్రియేట్ చేసింది. ఇక డిసెంబర్ 2న థియేటర్లలో మొత్తం ‘జై బాలయ్య’ నామజపమే విన్పించింది. సోషల్ మీడియాలో, థియేటర్ల వద్ద భారీ కటౌట్లు పెట్టి ఆయన అభిమానులు చేసిన సందడి మాములుగా లేదు.…