ప్రకృతికి వ్యతిరేకంగా ఏ పనులు చేయకూడదని, అలా చేసినందు వల్లనే స్వర్ణముఖి నది బ్రిడ్జ్‌లు, కాజ్ వేలు కొట్టకుపోయానని.. ఇది ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి పరాకాష్టగా ఆయన అభివర్ణించారు. వరద బాధితులకు సాయం చేసేందుకు ఆయా జిల్లాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైసీసీపీ నేతలపై మాటల తూటా లు పేల్చారు. ఇక్కడి నేతలు చెరువులను కబ్జా చేసి క్రికెట్ గ్రౌండ్లు గా మార్చారన్నారు. దీని వల్లనే తిరుపతి మునిగిపోయిందన్నారు. నాలుగు రోజులు ప్రాణాలు అరచేతిలో…
జగన్ సర్కార్ పై మరోసారి రెచ్చి పోయారు టీడీపీ అధినేత చంద్రబాబు. తిరుపతిలోని పాప నాయుడు పేట వద్ద వరద భాధితులను పరామర్శించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ… వరి వేయద్దు అంటున్నారు, గంజాయి ఎయ్యాలా? అని నిప్పులు చెరిగారు. ప్రపంచంలో నే ఏపీ కి చెడ్డపేరు తెప్పిచ్చారని… ఇది ప్రజాస్వామ్యం కాదు. ఉన్మాద స్వామ్యమని నిప్పులు చెరిగారు. మడమ తిప్పను అని గిరగిరా తిప్పుతూనే ఉన్నాడు. తుగ్లక్ నయం ఈ జగన్ తుగ్లక్ కంటే అంటూ…
కొండపల్లి చైర్మన్ ఎన్ని వాయిదాపై టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అసలు ప్రజాస్వామ్యం ఉందా అని ప్రశ్నించారు. అంతేకాకుండా విధ్వంసం సృష్టించి వాయిదా వేయించడం దారుణమని, ఇది ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని ఆయన అన్నారు. ఎన్నిక నిర్వహణ రాకపోతే ఎస్ఈసీ, డీజీపీలు తప్పుకోవాలని ధ్వజమెత్తారు. ఎన్నిక అడ్డుకోవడమెందుకు.. వైకాపా వారినే చైర్మన్ చేయండి అంటూ మండి పడ్డారు. టీడీపీ సభ్యులను లోబర్చకోని కొండపల్లిలో పాగా వేయాలని చూస్తున్నారన్నారు. కౌన్సిల్ కార్యాలయంలోకి సంబంధం లేని…
రాజధాని బిల్లుల ఉపసంహరణపై టీడీపీ అధినేత, చంద్రబాబు నాయుడు స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ .. వికేంద్రీకరణ బిల్లు ఉపసంహరణ, సీఆర్డీయే రద్దు బిల్లు ఉపసం హరణ మరో బిల్లు తెస్తామన్న సీఎం జగన్ వైఖరి రాష్ట్రానికి ఎంతో నష్టం చేకూర్చుతుందని ఆయన ఆరోపించారు.సీఎం జగన్ వైఖరితో రాష్ర్టానికి తీవ్ర నష్టం జరగుతుందన్నారు. ఇప్పటికైనా సీఎం జగన్ కళ్లు తెరిచారన్నారు. ప్రజలకు ఉపాధి అవకాశాలను దెబ్బ తీసేందుకే జగన్ అనాలోచిత చర్యలు చేపడుతున్నారన్నారు. అమరావతి రైతులు…
ఈ నెల 18న ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాల్లో రెండో రోజు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సభలో తనను వ్యక్తిగతంగా దూషించారని చంద్రబాబు సభ నుంచి వెళ్లిపోయారు. అంతేకాకుండా ముఖ్యమంత్రి హోదాలోనే సభలో అడుగుపెడుతానంటూ శపథం చేశారు. అనంతరం నిర్వహించిన అసెంబ్లీ సమావేశాలు సోమవారానికి వాయిదా పడింది. ఈ నేపథ్యంలో నేటి ఉదయం 9 గంటలకు మూడోరోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంకానున్నాయి.ఇవాళ్టి నుంచి ప్రశ్నోత్తరాల సమయాన్ని అసెంబ్లీ చేపట్టనుంది. సభ ముందుకు ఏపీ ఉద్యాన నర్సరీల రిజిస్ట్రేషన్…
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు తల్లిదండ్రులు దివంగత నారా అమ్మణమ్మ, నారా కర్జూర నాయుడు సమాధుల వద్ద ప్రముఖ సినీనటుడు నారా రోహిత్ నిరసన తెలిపారు. అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబునాయుడు కుటుంబ సభ్యుల వ్యక్తిత్వ హననానికి పాల్పడుతూ వైసీపీ ముష్కరమూకలు చేసిన మానసిక దాడికి నిరసనగా రోహిత్ తమ పూర్వీకుల సమాధుల వద్ద నివాళులర్పించి బైఠాయించారు. తమ పెదనాన్న చంద్రబాబునాయుడు, పెద్దమ్మ భువనేశ్వరి, సోదరుడు నారా లోకేష్ క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచి యావత్ తెలుగుదేశం పార్టీ కేడర్…
టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ నేతలతో చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. అందులో.. వరద బాధితులకు తెలుగుదేశం పార్టీ శ్రేణులు అండగా నిలవాలి. వరద బాధితులకు ఆహారం, మందులు అందించాలి. పసి పిల్లలకు పాలు, బిస్కెట్స్ అందించి ఆకలి తీర్చండి అని తెలిపారు. ఎన్టీఆర్ ట్రస్ట్, టీడీపీ ,ఐ-టీడీపీ ఆధ్వర్యంలో ఇప్పటికే చాలా ప్రాంతాలకు ఆహారం, మందులు పంపిణీ జరుగుతోంది. ఇప్పటికే క్షేత్ర స్థాయిలో టీడీపీ శ్రేణులు సహాయక కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రకృతి వైపరీత్యాల సమయంలో ప్రజలను…
చంద్రబాబు తన మేధాశక్తిని క్రోడీకరించి మెలోడీ డ్రామాను క్రియేట్ చేశారు. ఇది దురదృష్టకరం అని మంత్రి పేర్ని నాని అన్నారు. అసెంబ్లీలో ఎవరూ చంద్రబాబు కుటుంబ సభ్యులు, వారి శ్రీమతి ప్రస్తావనే తేలేదు. రాజకీయాలను రాజకీయంగానే ఎదుర్కోవాలి. దాన్ని పక్కన పెట్డి మెలోడీ డ్రామా కోసం కుటుంబ సభ్యులను తెరమీదకు తెచ్చారు. చంద్రబాబు కుటుంబ సభ్యులను ఎవరు? ఏమన్నారో చెప్పాలి. చంద్రబాబు మాటలను వీడియో తీశారు కదా? అందులో ఎక్కడైనా దూషణల గురించి ఉందా అని అడిగారు.…
ఏపీలో నిరసన జ్వాలలు చెలరేగాయి. నిన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో టీడీపీ అధినేత తనను వ్యక్తిగతంగా దూషించారని ఆరోపిస్తూ సభను బయటకు వచ్చేశారు. అనంతరం తన ఛాంబర్ టీడీఎల్సీ సమావేశం నిర్వహించి మీడియాతో మాట్లాడారు. ఆయన మీడియాతో ముచ్చటిస్తూనే కన్నీటి పర్యంతమయ్యారు. తమ అభిమాన నేత ఇలా కన్నీరు పెట్టుకోవడాన్ని చూసిన టీడీపీ శ్రేణులను ఆవేదన గురి చేసింది. దీంతో ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. దీంతో టీడీపీ శ్రేణులు నిరసన, ఆందోళనకు దిగారు.…