ప్రతిపక్షాలపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు మంత్రి బొత్స సత్యనారాయణ గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రతిపక్షాలు త్యాగాలు త్యాగాలు అని పదేపదే అంటున్నారని ఎవ్వరి కోసం త్యాగాలు చేస్తున్నారో చెప్పాలని ప్రతిపక్షాలను బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. నాగార్జున సాగర్, పోలవరం ప్రాజెక్టులు కడుతుంటే ఎంత మంది రైతులు భూములు ఇవ్వలేదని ఆయన అన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం చేస్తున్న పనులను త్యాగం అంటారా? ఒక సామాజిక వర్గం కోసం చేసే పనులు త్యాగాలు…
టీడీపీ మైనార్టీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు మౌలానా ముస్తాక్ అహమ్మద్ నిర్వహించే మదర్సాపై వక్ఫ్ బోర్డు అధికారులు దౌర్జన్యం రాజకీయ కక్ష సాధింపేనని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ కక్ష సాధింపునకు అడ్డు అదుపు లేకుండా పోతోందని, మదర్సాలపై దాడులకు పాల్పడుతూ కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారన్నారు. వైసీపీ నేతల కక్షసాధింపు చర్యలకు గుడి, బడి అనే వ్యత్యాసం కూడా లేదా..? అని ప్రశ్నించారు. పేద విద్యార్థులకు విద్యనందిస్తున్న మదర్సాను…
నెల్లూరు మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై టీడీపీ అధినేత చంద్రబాబు సమీక్షించారు. మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ ఓటమి చెందడంతో నెల్లూరు నేతల పనితీరుపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో నెల్లూరు నగర పార్టీ డివిజన్ కమిటీలను రద్దు చేశారు. అంతేకాకుండా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ నెల్లూరు నగరానికి చెందిన ఇద్దరు నేతలు అజీజ్, కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డిని టీడీపీ అధినేత సస్పెండ్ చేశారు. ఈ ఇద్దరు నేతలు తమ పనితీరు మార్చుకోకుంటే భవిష్యత్‌లో కఠిన నిర్ణయాలు ఉంటాయని…
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన అఖండ మూవీ టాలీవుడ్‌కు ఊపిరి పోసిందని చిత్ర ప్రముఖులందరూ భావిస్తున్నారు. తాజాగా అఖండ సినిమాపై టీడీపీ అధినేత చంద్రబాబు కూడా స్పందించారు. అఖండ మూవీని తాను ఇటీవల చూసినట్లు చంద్రబాబు ఈరోజు ప్రెస్మీట్లో వెల్లడించారు. మంగళగిరి టీడీపీ ఆఫీసులో మీడియాతో మాట్లాడిన బాబు.. ఏపీలో ప్రస్తుతం పరిస్థితులు ఎలా ఉన్నాయనేది అఖండ సినిమాలో చూపించారని చెప్పారు. రాష్ట్రంలో ఏం జరుగుతుందో ఈ సినిమాలో అద్భుతంగా తెరకెక్కించారని… సినిమా చాలా…
ఏపీలో మరోసారి రాజకీయం వేడెక్కింది. తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోలవరం పనుల్లో అవినీతి జరిగిందన్నారని.. కానీ కేంద్రం ఒక్క పైసా కూడా అవినీతి జరగలేదని తేల్చిచెప్పిందన్నారు. రివర్స్ టెండరింగ్‌తో ప్రాజెక్టులను నాశనం చేశారని.. రివర్స్ టెండరింగ్‌లో ఏం సాధించారు..? అని ఆయన ప్రశ్నించారు. అవగాహన లేక తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారని.. పార్లమెంట్లో ఏపీ ప్రత్యేక హోదా గురించి ఎందుకు ప్రస్తావించలేదన్నారు. చిత్తశుద్ది ఉంటే వైసీపీ ఎంపీలు…
సాయితేజ కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలవాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మకు టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. ఇటీవల హెలికాఫ్టర్ ప్రమాదంలో సీడీఎస్ బిపిన్ రావత్‌తోపాటు సాయితేజ దుర్మరణం పాలైన విషయం తెల్సిందే.. చిత్తూరు జిల్లా వాసి లాన్స్ నాయక్ సాయితేజ కుటుంబానికి కోటి రూపాయలు పరిహారం ఇవ్వాలని లేఖలో తెలిపారు. సాయి తేజ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలన్నారు. కేవలం తొమ్మిదేళ్ల సర్వీసులో త్రివిధ దళాదిపతి వ్యక్తిగత భద్రతా సిబ్బందిలో చేరే…
గౌరవ సభల పేరుతో టీడీపీ రాష్ట్రవ్యాప్త ఉద్యమ కార్యాచరణ సిద్ధం చేసింది. ఇంట్లో ఆడవాళ్లని కూడా చట్టసభల్లో దూషిస్తూ కౌరవ సభలుగా మారుస్తున్నారని ఆరోపిస్తూ ప్రజల్లోకి వెళ్లాలన్నది ప్రణాళిక. అయితే ఈ వివాదానికి మూల కారణమైన వల్లభనేని వంశీ.. క్షమాపణలు చెప్పేశారు. అయినప్పటికీ ఆ కామెంట్సే అజెండాగా గౌరవ సభలు నడపాలా.. ఆగాలా..? అన్నది ప్రస్తుతం టీడీపీలో జరుగుతున్న చర్చ. వంశీ క్షమాపణలు తర్వాత టీడీపీ డైలమాలో పడ్డట్టుగానే కన్పిస్తోంది. ఏపీలో గౌరవ సభలు నిర్వహించాలని టీడీపీ…
చంద్రబాబుకు సజ్జల రామకృష్ణారెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఓటీఎస్ పై విమర్శించే నైతిక హక్కు చంద్రబాబు కు లేదని ఫైర్ అయ్యారు సజ్జల. పేదలందరూ దశాబ్దాలుగా ప్రభుత్వం ఇచ్చిన స్థలంలో ఇళ్లు కట్టుకుని ఉంటున్నారని.. సీఎం జగన్ చొరవతో ఇళ్ల రుణాలన్నీ మాఫీ చేసి ఉచితంగా రిజిస్ట్రేషన్ చేస్తున్నారన్నారు. ఓటీఎస్ పై ప్రజలు సహాయ నిరాకరణ చేయాలని చంద్రబాబు కోరారంటే దాన్ని ఏమనాలో వారే ఆలోచించుకోవాలని చురకలు అంటించారు. ఓటీఎస్ పథకంలో పేదలకు నష్టం కల్గించేది అంటూ ఏదీ…
టీడీపీ అధినేత చంద్రబాబు డా.బీఆర్ అంబేద్కర్ వర్థంతి సందర్బంగా నివాళులు అర్పించారు. అంతేకాకుండా రాజ్యాంగంలో ప్రతి ఒక్కరికీ హక్కులు ఉన్నాయంటూ వైసీపీ ప్రభుత్వ ఆ హక్కులను కాలరాస్తుందని తీవ్రంగా విమర్శించారు. అంతేకాకుండా ఓటీఎస్ పేరుతో ప్రజలకు వైసీపీ ప్రభుత్వం ఉరి వేస్తోందని చంద్రబాబు ఆరోపించారు. అయితే ఈ నేపథ్యంలో చంద్రబాబు మాటలకు కౌంటర్ గా వైసీపీ నేత, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు.