కాకినాడ పర్యటనలో భాగంగా టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు.. ఏపీలో పొత్తు రాజకీయాల చర్చకు దారి తీశాయి. అధికార పార్టీ నేతలందరూ ఒక్కాసారిగా దిగొచ్చి.. చంద్రబాబుకు ఒంటరిగా ఎన్నికల్లో పోటీ చేసే దమ్ము లేదని, అందుకే పొత్తులకు సిద్ధమయ్యారంటూ తీవ్ర స్థాయిలో విమర్శనాస్త్రాలు సంధించడం మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు రంగంలోకి దిగి, తన వ్యాఖ్యల్ని వక్రీకరించారంటూ క్లారిటీ ఇచ్చారు. ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని ఓడించడానికి ప్రజలంతా కలిసి రావాలంటూ తాను కాకినాడలో…
ఏపీలో పొత్తు రాజకీయాలపై వాడీవేడీ చర్చలు కొనసాగుతున్న తరుణంలో.. ప్రభుత్వం సలహాదారు, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి విపక్ష పార్టీలపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. పవన్ కళ్యాణ్ చెప్తున్న డైలాగులన్నీ చంద్రబాబువి అని చెప్పారు. పవన్ ఏదో వ్యూహం అంటున్నారు, ఇంతకీ వ్యూహం అంటే ఏంటి? అని ప్రశ్నించారు. ‘‘ఒకరేమో త్యాగాలకు సిద్ధమంటారు, మరొకరు నేనే సీఎం అంటారు, ఇంకొకరు మేం కలవమంటారు, అసలు విపక్ష పార్టీలకు వారిలో వారికే స్పష్టత లేదు’’ అని…
ఇప్పుడు ఏపీలో ఎక్కడ చూసినా పొత్తు రాజకీయాలపైనే చర్చలు నడుస్తున్నాయి. ప్రధాన పార్టీ నేతలందరూ ఆ అంశంపైనే మాట్లాడుతున్నారు. ఇప్పుడు మంత్రి జోగి రమేష్ ఈ విషయంపై స్పందించారు. సీఎం జగన్ బలంగా ఉన్నారు కాబట్టే, చంద్రబాబు పొత్తుల కోసం వెంపర్లాడుతున్నారని విమర్శించారు. జగన్‌ని సింగిల్‌గా ఎదుర్కొనే ధైర్యం చంద్రబాబుకు, టీడీపీకి లేదని ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్ ఒక్కడుగా రాగలడా? అని ప్రశ్నించిన ఆయన.. ఆయనకు కావాల్సింది కూడా పొత్తులేనన్నారు. బలహీనులైన మనల్ని జగన్ బలవంతుల్ని…
ఏపీలో పొత్తు రాజకీయాలపై చర్చలు సాగుతున్న తరుణంలో.. ఎంపీ నందిగం సురేష్ స్పందించారు. చంద్రబాబుకు సింగిల్‌గా వచ్చే దమ్ము లేకపోవడం వల్లే, ‘రండి కలిసి రండి’ అంటూ అడుక్కుంటున్నారని విమర్శించారు. దత్తపుత్రుడితో కలిసి, కుయుక్తులు పన్నాలని చూస్తున్నారని ఆరోపించారు. ఎంతమంది కలిసి వచ్చినా, జగన్‌ని ఎవరూ కదిపించలేరని వ్యాఖ్యానించారు. 2014, 2019 ఎన్నికల్లో జగన్ సింగిల్‌గా పోటీ చేశారని.. పొత్తులకు వెంపర్లాడలేదని చెప్పారు. సోషల్ మీడియాలో టీడీపీ తప్పుడు ప్రచారాలు చేస్తోందని మండిపడ్డారు. గతంలో అగ్రవర్ణాలకు మాత్రమే…
ఇటీవల మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైజాగ్‌ను సందర్శించిన తరుణంలో.. మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆయనపై హాట్ కామెంట్స్ చేశారు. మూడు సంవత్సరాల తర్వాత చంద్రబాబు వైజాగ్‌కి వచ్చారని, ఈ సందర్భంగా ‘అమరావతి అభివృద్ధిని చేస్తాం, విశాఖను రాజధాని చేస్తాం’ అని అమరావతి ప్రజలకు చంద్రబాబు చెప్పొచ్చు కదా అని అన్నారు. చంద్రబాబు అధికారంలో ఉన్న 14 సంవత్సరాల కాలంలో రాష్ట్రం కరువుతో ఉందని.. ఆయన రాజకీయాలు చేస్తూ, నారా లోకేష్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని…
టీడీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై మంత్రి గుడివాడ అమర్నాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మనిషి రక్తం బాగా మరిగిన పులికి వేటాడటానికి మనుషులు దొరకనప్పుడు ఎలా పిచ్చెక్కినట్టు వ్యవహరిస్తుందో, అధికారం పోయినందుకు చంద్రబాబుకి అదే పిచ్చి హిమాలయాలకు చేరిందని ఆరోపించారు. దేశంలోకెల్లా అత్యధిక డీబీటీ ద్వారా ఈ రోజుకు దాదాపు 1.39 లక్షల కోట్లు… అది కూడా 35 నెలల్లో పేదల చేతిలో వైసీపీ ప్రభుత్వం పెట్టిందన్నారు. ఇలాంటి ప్రభుత్వాన్ని ఎలా ఎదుర్కోవాలో ఈ గుంటనక్కకు…
ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి అంబటి రాంబాబు తొలిసారి పోలవరం ప్రాజెక్ట్‌ను సందర్శించారు. ఈ ప్రాజెక్ట్‌పై అవగాహన పెంచుకోవడం కోసమే క్షేత్రస్థాయిలో పర్యటించడం జరిగిందని ఆయనన్నారు. ఈ ప్రాజెక్ట్ ఎప్పెడెప్పుడు పూర్తవుతుందా? అని ప్రజలు ఎదురుచూస్తున్నారని, అయితే వరద ఉధృతి కారణంగా డయాఫ్రమ్ వాల్ దెబ్బతినడంతో ఈ ప్రాజెక్ట్ నిర్మాణం ఆలస్యం అవుతోందని అన్నారు. గత ప్రభుత్వాల నిర్లక్ష్యం, తొందరపాటు చర్యల వల్ల ఆ వాల్ దెబ్బతిందని చెప్పిన రాంబాబు.. ఆ సమస్యని…
రేపల్లె రైల్వే స్టేషన్ అత్యాచార ఘటనపై చంద్రబాబు చేసిన తాజా వ్యాఖ్యలు రాష్ట్రంలో అగ్గి రాజేశాయి. ఏపీలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని, రాష్ట్రంలో శాంతి – భద్రతలు కూడా లోపించాయని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలకు డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. జరిగిన సంఘటనల గురించి తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందని, ఒకట్రెండు సంఘటనలతో రాష్ట్రంలో శాంతి – భద్రతలులేవని వ్యాఖ్యానించడం కరెక్ట్ కాదన్నారు. దిశా చట్టం లేకపోయినప్పటికీ, ఆ స్ఫూర్తితో తాము జరుగుతున్న ఘటనలపై విచారణ…
టీడీపీ పాలనలో చేసిన అప్పులతో తాము ఇబ్బందులు పడుతున్నామన్నారు మంత్రి ఆదిమూలపు సురేష్. టిడ్కో ఇళ్లపై మంత్రి ఆదిమూలపు సురేష్ సమీక్ష జరిపారు. అన్ని వసతులతో టిడ్కో ఇళ్ళు పూర్తి చేస్తాం. గతంలో టీడీపీ అప్పులు మిగిలిస్తే వాటిని తీరుస్తున్నాం. డిసెంబరుకు 2.62 లక్షల ఇళ్ళు పూర్తికి ప్రణాళిక రెడీ చేశామన్నారు. గత ప్రభుత్వాల మాదిరి అర్భాటాలకు పోయి అప్పులు చేసి ప్రజా సమస్యలను గాలికి వదలటం లేదు. మాట ఇస్తే దానికి కట్టుబడి పని చేయటం…
ఈరోజు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయనకు సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానులు, టీడీపీ పార్టీ కార్యకర్తల నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో చంద్రబాబుకు స్పెషల్ బర్త్ డే విషెస్ తెలుపుతూ మెగాస్టార్ చిరంజీవి ఓ పిక్ ను షేర్ చేశారు. గతంలో చంద్రబాబును కలిసినప్పుడు చిరు ఫ్లవర్స్ బొకే అందిస్తున్న పిక్ అది. “శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి జన్మ దిన శుభాకాంక్షలు… వారు కలకాలం సంపూర్ణ…