Chandrababu Naidu: దళితులకు ఏపీలో రక్షణ లేదని తేలిపోయింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సీఎం జగన్ పాలనలో దళితులకు రక్షణ లేకుండా పోయిందని మండిపడ్డారు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు. నెల్లూరులో మరో దళితుడికి జగన్ ఉరి వేశారు.కావలిలో కరుణాకర్ ఆత్మహత్యకు వైసీపీ నేతల వేధింపులే కారణం.ఒక ఘటన మరువక ముందే మరో దారుణం ఎపిలో సర్వసాధారణం అయిపోయింది.రాష్ట్రంలో ఏం జరుగుతోంది? రోజుకో దళితుడు ఎందుకు ప్రాణాలు కోల్పోతున్నాడు?నెల్లూరు జిల్లా, కావలి మండలం, ముసునూరు గ్రామంలో దుగ్గిరాల కరుణాకర్ ఆత్మహత్య చేసుకున్నారు.
తాను లక్షలు ఖర్చుపెట్టి సాగుచేసిన చేపల చెరువుల్లో పంటను అమ్ముకోనివ్వకుండా, వైసీపీ నేతలు కేతిరెడ్డి జగదీష్ రెడ్డి, సురేష్ రెడ్డిలు వేధిస్తున్నందుకే ప్రాణాలు తీసుకుంటున్నట్లు లేఖలో తెలిపారు.శ్రీశైలం దేవస్థానం బోర్డు సభ్యుడిగా కూడా ఉన్న జగదీష్ రెడ్డి ఆగడాలకు జగన్ రెడ్డి ముందుగానే అడ్డుకట్ట వేసివుంటే , ఇప్పుడు ఈ దళిత సోదరుని ప్రాణాలు పోయేవి కావు.భూదందాలు, సెటిల్మెంట్లను దాటిన ధనదాహం.. ఇప్పుడు వ్యక్తుల ప్రాణాలను కూడా మింగేస్తోందని ట్వీట్ చేశారు చంద్రబాబు.
Also Read
వై.ఎస్.జగన్మోహన్ రెడ్డీ…ఇదిగో, నీ పాలనలో మరో దళితుడికి నువ్వేసిన ఇంకో ఉరి. ఒక ఘటన మరువక ముందే మరో దారుణం ఎపిలో సర్వసాధారణం అయిపోయింది. రాష్ట్రంలో ఏం జరుగుతోంది?..రోజుకో దళితుడు ఎందుకు ప్రాణాలు కోల్పోతున్నాడు?.. అనే అంశాలపై ప్రజల్లో చర్చ జరగాలి(1/5)#DalitLivesDontMatterInAp pic.twitter.com/kSgc9J32eu
— N Chandrababu Naidu (@ncbn) August 20, 2022
సమాజ శత్రువులుగా మారిన వైసీపీ రాక్షసులను కట్టడి చేయడంలో ఆ పార్టీ ఎప్పుడూ ఉదాసీనంగానే వ్యవహరిస్తోంది.నేడు ఇద్దరు పిల్లలు అనాథలు కావడానికి, ఒక కుటుంబం రోడ్డున పడడానికి కారణమైన వారిపై కనీసం ఇప్పటికైనా పోలీసులు చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు కూడా జిల్లా పోలీసు ఉన్నతాధికార్లు మానవత్వం మరిచి, రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గితే అంతకంటే నీచం మరొకటి ఉండదు. కొందరు పోలీసులు తమ మనసుల మురికిని ఖాకీ దుస్తులకూ అంటిస్తున్నారు. జరిగినదానికి జగన్ రెడ్డి బాధ్యత వహించి బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలి. నిందితులను కఠినంగా శిక్షించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.
Read Also: Madhya Pradesh: తల గాయానికి “కండోమ్ ప్యాక్” తో డ్రెస్సింగ్..
తాజావార్తలు
-
OTR : నెల్లిమర్ల నగర పంచాయతీలో ఛైర్మన్ సీటు పంచాయితీ
-
Pothireddypadu : పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వద్ద భారీ ప్రమాదం.. తెగిపడిన 9వ గేటు
-
Gyanesh Kumar: ‘సర్’ ఫిర్యాదులు వచ్చే ఎన్నికల నాటికి పరిష్కరిస్తాం.. సీఈసీ కీలక వ్యాఖ్యలు
-
OTR: చిన్నారెడ్డి ఏం చేయబోతున్నాడు..?
-
Story Board : ఉద్యోగ నియామకాల్లో ఎక్కడ తేడా కొడుతోంది ? అన్ని రాష్ట్రాల్లో ఇంతేనా ?
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?