తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లా కుప్పం పర్యటనలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.. తన సొంత నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు పర్యటించే ప్రాంతాల్లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాలు ఏర్పాటుచేశాయి ఆ పార్టీ శ్రేణులు.. రామకుప్పం మండలం కొల్లుపల్లెలో వైసీపీ జెండాలు పెద్ద సంఖ్యలో ఏర్పాటు, అంతేకాదు దారి పొడువునా వైసీపీ తోరణాలు కట్టారు.. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన తెలుగుదేశం పార్టీ శ్రేణులు.. పోలీసులతో వాగ్వాదానికి దిగారు.. పోలీసుల సహకారంతోనే ఉద్దేశపూర్వకంగా వైసీపీ జెండాలు ఏర్పాటు చేశారంటూ తెలుగు తమ్ముళ్ల మండిపడ్డారు.. అంతేకాదు.. వైసీపీ జెండాలు తొలగించే ప్రయత్నం చేశారు టీడీపీ కార్యకర్తలు.. దీంతో, భారీగా మోహరించారు పోలీసులు..
Read Also: MLA Karim Uddin Barbhuiya: ఐదారేళ్లలో బీజేపీ కనుమరుగు.. ఎమ్మెల్యే ఆసక్తికర వ్యాఖ్యలు
ఇక, అంతటితో ఆగకుండా చంద్రబాబు కాన్వాయ్ వద్దకు వచ్చిన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు.. జై జగన్.. జైజై జగన్ అంటూ నినాదాలు చేశారు.. జగన్ అనుకూల నినాదాలు చేసిన కార్యకర్తను పక్కకు లాక్కెళ్లి టీడీపీ కార్యకర్తలు చితకబాదినట్టుగా తెలుస్తోంది.. మొత్తంగా తన సొంత నియోజకవర్గం కుప్పంలో చంద్రబాబు పర్యటనలో అక్కడక్కడ స్వల్ప ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి.. అయితే, అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు.. ఉద్దేశ్యపూర్వకంగానే రెచ్చగొట్టే చర్యలకు దిగుతున్నారని టీడీపీ నేతలు ఫైర్ అవుతున్నారు.. కావాలనే జెండాలు ఏర్పాటు చేశారు.. ఉద్దేశ్యపూర్వకంగానే చంద్రబాబు కాన్వాయ్ దగ్గరకు వచ్చి నినాదాలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా, సీఎం వైఎస్ జగన్.. కుప్పం నియోజకవర్గంపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు.. ఈ మధ్యే కుప్పం వైసీపీ లీడర్లతో సమావేశమైన ఆయన.. కుప్పంలో అభివృద్ధి పనుల కోసం ప్రత్యేకంగా నిధులు కూడా విడుదల చేసిన విషయం తెలిసిందే.