భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయ్ వర్థంతి సందర్భంగా దేశం మొత్తం ఆయనకు నివాళులర్పిస్తోంది.. ఆయన సేవలను స్మరిస్తోంది.. 1924 డిసెంబర్ 25న మధ్య ప్రదేశ్ లోని గ్వాలియర్లో జన్మించిన అటల్ బిహారీ వాజ్‌పేయ్.. 2018 ఆగస్టు 16న కన్నుమూశారు.. భారతీయ జనతా పార్టీ తరపున ప్రధాన మంత్రి పదవిని పొందిన నేత ఆయన.. మొదటిసారిగా రెండవ లోక్‌సభకు ఎన్నికయ్యారు. మధ్యలో 3వ, 9వ లోక్‌సభలకు తప్పించి 14వ లోక్ సభ ముగిసేవరకు పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహించారు. ఆయన రెండుసార్లు రాజ్యసభకు కూడా ఎన్నికయ్యారు. 1968 నుండి 1973 వరకు జనసంఘ్ పార్టీకి అధ్యక్షుడిగా పనిచేసి, 1980 నుండి 1986 వరకు భారతీయ జనతా పార్టీకి వ్యవస్థాపక అధ్యక్షుడిగా సేవలు అందించారు.. 1996లో తొలిసారిగా ప్రధానమంత్రి పదవి యోగం లభించినా అది 13 రోజులకే పరిమితం కాగా.. 1998లో రెండో పర్యాయం ప్రధానమంత్రి పదవి పొంది 13 మాసాలు పాలించారు. 1999లో 13వ లోక్‌సభ ఎన్నికల అనంతరం మరోసారి ప్రధానమంత్రి పదవి చేపట్టి 2004 వరకు పదవిలో కొనసాగారు.. ఈ సమయంలో.. ఆంధ్రప్రదేశ్ నుంచి ఎన్డీఏ సర్కార్‌కు మద్దతుగా నిలిచారు చంద్రబాబు నాయుడు.. ఇవాళ వాజ్‌పేయ్ వర్ధంతి సందర్భంగా ఆయనను స్మరిస్తూ.. ట్వీట్ చేశారు.
Read Also: Bill Gates: ప్రధాని మోడీపై బిల్‌గేట్స్ ప్రశంసలు..
ఆధునిక భారత్ నిర్మాణంలో వాజ్‌పేయ్ కీలక పాత్ర పోషించారని గుర్తుచేసుకున్నారు చంద్రబాబు.. ఆధునిక భారత నిర్మాణంలో అత్యంత కీలక పాత్ర పోషించిన మహనీయులలో ముఖ్యులు అటల్ బిహారీ వాజ్‌పేయ్ గా పేర్కొన్న ఆయన.. ప్రధానిగా అత్యుత్తమ విధానాలతో దేశ గమనాన్ని మార్చిన నేత వాజ్‌పేయ్… ఆయన వర్ధంతి సందర్భంగా ఆ భారతరత్న స్మృతికి నివాళులు అర్పిస్తున్నాను అంటూ ట్వీట్ చేశారు. ఇక, వాజ్‌పేయ్ పాలనలో ఊపిరిపోసుకున్న టెలికాం, స్వర్ణ చతుర్భుజి ప్రాజెక్ట్, ఓపెన్ స్కై పాలసీ, సూక్ష్మసేద్యం, గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్థుల వంటి కీలక సంస్కరణల్లో ఆయనతో కలిసి పనిచేయడం… భాగస్వామి కావడం నాకు ఎంతో తృప్తిని ఇచ్చే అంశంగా పేర్కొన్నారు చంద్రబాబు.. దేశంలోని అభివృద్ధి చెందిన రోడ్లలో సగం వాజపేయి పాలనలో అభివృద్ధి చేసినవేనన్న ఆయన.. ఆ సమయంలోనే జరిగిన పోఖ్రాన్ అణు పరీక్షలు, కార్గిల్ విజయం వంటివి భారత దేశ సత్తాను ప్రపంచానికి చాటి చెప్పాయన్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేళ తప్పక తలచుకోవాల్సిన దేశ భక్తుడు వాజ్‌పేయిగా పేర్కొన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.
ఆధునిక భారత నిర్మాణంలో అత్యంత కీలక పాత్ర పోషించిన మహనీయులలో ముఖ్యులు శ్రీ అటల్ బిహారీ వాజపేయి గారు. ప్రధానిగా అత్యుత్తమ విధానాలతో దేశ గమనాన్ని మార్చిన నేత వాజపేయి గారి వర్ధంతి సందర్భంగా ఆ భారతరత్న స్మృతికి నివాళులు అర్పిస్తున్నాను.(1/3) pic.twitter.com/lNyyPxziqe
— N Chandrababu Naidu (@ncbn) August 16, 2022