వారసత్వ రాజకీయాల గురించి అందరికీ తెలిసిందే! పార్టీ పగ్గాలు దాదాపు వారసులకే దక్కుతాయి. తరతరాలుగా రాజకీయాల్లో కొనసాగుతోన్న సంస్కృతి ఇది. ఈ నేపథ్యంలోనే టీడీపీ పగ్గాలు నారా లోకేశ్‌కే దక్కుతాయని ఎప్పట్నుంచో ప్రచారం జరుగుతోంది. ఆ పార్టీ అధినేత చంద్రబాబు సైతం ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నారనే అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి. పార్టీ నేతలు అదే చెప్తూ వస్తున్నారు. అయితే.. వారసత్వం ఒక్కటే పరమావధి కాదని, కష్టపడి పని చేసే తత్వం ఉన్న వాళ్ళకే అవకాశం దక్కుతుందని చంద్రబాబు…
కోనసీమలో అల్లర్ల నేపథ్యంలో ఇంటర్నెట్ సేవల్ని నిలిపివేసిన విషయం విదితమే! వారం రోజులు అవుతున్నా, ఇంటర్నెట్ సేవల్ని పునరుద్ధరించలేదు. దీంతో ఉద్యోగులు ఎక్కడ తమ ఉద్యోగం పోతుందోనన్న భయంతో ఇతర ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు. ఈ నేపథ్యంలోనే వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విమర్శలు గుప్పించారు. వారం రోజులైనా కోనసీమలో ఇంటర్నెట్ సేవలను పునరుద్ధరించలేకపోవడం.. రాష్ట్ర అసమర్థ పాలనకు నిదర్శనమని అన్నారు. ఎక్కడో కశ్మీర్లో వినిపించే ‘ఇంటర్నెట్ సేవల నిలిపివేత’ అనే…
జూనియర్ ఎన్టీఆర్ కి భయపడి పార్టీ నుంచి తరిమేసారని ఆర్కే రోజా అన్నారు. ఇవాళ ఏపీ పర్యాటక శాఖమంత్రి ఆర్కే రోజా (శనివారం) ఉదయం నియోజకవర్గ నేతలతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. మీడియాతో మాట్లాడుతూ.. గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంలో 99 శాతం మంది ప్రజలు ప్రేమతో ఆదరిస్తూన్నారని అన్నారు. లక్షా 35 వేల కోట్లను సంక్షేమ పథకాలకు కేటాయించారని రోజా తెలిపారు. చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రానికి పట్టిన శని అని గతంలోనే స్వర్గీయ…
కొన్ని రోజుల నుంచి ఏపీలో పొత్తు రాజకీయాలు నడుస్తున్నాయి. తన పర్యటనలో భాగంగా ‘అందరూ కలిసి ముందుకు రావాలి’ అని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు చేసినప్పటి నుంచి.. ఈ పొత్తు వ్యవహారం అగ్గి రాజేసుకుంది. దీంతో.. ఏపీ నేతల నోట పొత్తు మాటలే వస్తున్నాయి. ప్రతి ఒక్కరూ ఈ అంశం మీదే ప్రధానంగా మాట్లాడుతున్నారు. ఒకరిపై మరొకరు విమర్శనాస్త్రాలు సంధించుకుంటున్నారు. తమ సీఎం జగన్‌ని ఒంటరిగా ఎదుర్కొనే దమ్ము లేకపోవడం వల్లే, చంద్రబాబు పొత్తుల్ని…
తెలుగుదేశం పార్టీ పండుగ మహానాడు నిర్వహణపై కమిటీలతో టీడీపీ అధినేత చంద్రబాబు సమీక్ష చేపట్టారు. ఒంగోలు సమీపంలోని మండవారి పాలెంలోనే మహానాడు నిర్వహణకు నిర్ణయం తీసుకున్నామన్నారు. ఒంగోలు నగర సమీపంలోని మండవారి పాలెంలో 27,28 తేదీల్లో మహానాడు జరగనుంది. సమయం తక్కువగా వుండడంతో పనులు వేగవంతం చేయాలన్నారు చంద్రబాబు. మొదటి రోజు ప్రతినిధుల సభ, రెండో రోజు బహిరంగ సభ వుంటుందన్నారు. మహానాడు నిర్వహణకు ఒంగోలు మినీ స్టేడియం ఇవ్వాలని కోరారు టీడీపీ నేతలు. అయితే, స్టేడియం…
ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం మరోసారి టీడీపీ మీద మండిపడ్డారు. టీడీపీ సహా ఇతర పార్టీలన్నీ ఫిలాసఫీ లేని పార్టీలని.. పాలసీ, విధానం లేకుండా పొత్తులు పెట్టుకుంటే పొట్టలో కత్తులు పెట్టుకున్నట్టేనని ఆయన అన్నారు. సీఎం జగన్ మాత్రం పొలిటికల్ ఫిలాసఫీతో ఉన్నారని, అందుకే సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారన్నారు. పిల్లల విద్య కోసం నాడు-నేడు, విద్యా దీవెన, అమ్మ ఒడి వంటివి అనేక కార్యక్రమాల్ని రూపొందించారని తెలిపారు. గతంలో…
ట్విటర్లో మంత్రి అంబటి రాంబాబు, టీడీపీ నేత అయ్యన్న పాత్రుడు మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. రాజకీయం దగ్గర నుంచి వ్యక్తిగత వ్యవహారాల దాకా వీరి మధ్య వార్ వెళ్ళింది. మాజీ మంత్రి నారాయణను అరెస్ట్ చేసిన విషయంపై రాంబాబు చేసిన ట్వీట్‌కి గాను.. కాంబాబు అంటూ అయ్యన్నపాత్రుడు బదులిచ్చినప్పటి నుంచి ఈ ట్విటర్ వార్ వ్యక్తిగతంగా మలుపు తీసుకుంది. ఒకరిపై మరొకరు తీవ్ర స్థాయిలో ఆరోపణలు, విమర్శలు చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా.. అప్పట్లో రాంబాబు ఓ…
‘గడప గడపకు మన ప్రభుత్వం’ పేరుతో వైసీపీ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమంలో భాగంగా పలుచోట్ల నేతలకు ప్రజల నుంచి వ్యతిరేకత ఎదురైంది. దీన్ని బట్టే వైసీపీ పాలన పట్ల ప్రజలు ఎంత వ్యతిరేకంగా ఉన్నారో తెలిసిపోతోందని టీడీపీ నేతలు విమర్శలు చేయడం మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలోనే ఈ అంశంపై వివరణ ఇచ్చేందుకు ఏపీ మంత్రి అంబటి రాంబాబు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలేనంటూ ఆయన తీవ్ర ఆగ్రహావేశాలకు గురయ్యారు. తమ…
తన సొంత నియోజకవర్గం కుప్పంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పర్యటన ముగిసింది.. మూడురోజుల పాటు సొంత నియోజకవర్గంలో ఆయన పర్యటన కొనసాగగా.. స్థానిక సమస్యలపై మండల స్థాయి టీడీపీ నాయకులకు దిశానిర్దేశం చేశారు. శాంతిపురం మండలం, గుడిపల్లి మండలంలోని పలు గ్రామాల్లో బాదుడే బాదుడు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. తెలుగుయువత కార్యకర్తలతో ప్రత్యేక సమావేశంలో పాల్గొన్నారు చంద్రబాబు. రాబోయే ఎన్నికల్లో యువతకు 40 శాతం సీట్లు కేటాయిస్తామని ప్రకటించారు.. Read Also: Breaking: మరోసారి ఏపీ…
వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా టీడీపీ చేపట్టిన బాదుడే బాదుడు నిరసన కార్యక్రమంలో భాగంగా.. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లాల్లో పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కుప్పంలోని శాంతిపురం మండలానికి చేరుకున్న ఆయన.. మరోసారి సీఎం జగన్‌పై నిప్పులు చెరిగారు. శిశుపాలుడు 100 తప్పులు చేసినట్లు.. జగన్ కూడా తప్పుల మీద తప్పులు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టడం జగన్ చివరి తప్పు అవుతుందని, మీటర్లు పెట్టకుండా రైతులు ఎదురు తిరగాలని పిలుపునిచ్చారు. లేకపోతే..…