World Economic Forum : ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్) వార్షిక సదస్సు సోమవారం స్విట్జర్లాండ్ లోని దావోస్ లో ప్రారంభం కానుంది. ఈ సదస్సు ఈ నెల 24 వరకు కొనసాగనుంది. ప్రపంచంలోని శక్తివంతమైన నేతలు, వివిధ రంగాల ప్రముఖులు సుమారు 2,500 మంది ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నట్లు సమాచారం. ఈ సందర్భంలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా దావోస్ చేరుకున్నారు. విజయవాడ నుండి బయలుదేరిన చంద్రబాబు ముందుగా ఢిల్లీ చేరుకుని, అక్కడ నుంచి అర్ధరాత్రి…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్కు మాజీ మంత్రి, కాపు సంక్షేమ శాఖ అధ్యక్షుడు చేగొండి హరిరామ జోగయ్య బహిరంగ లేఖ రాశారు. గతంలో చంద్రబాబు నాయుడు కాపులకు కల్పించిన ఐదు శాతం రిజర్వేషన్ అమలు చేయలని డిమాండ్ చేశారు. ఆమరణ నిరాహార దీక్ష చేసినప్పుడు తనకు ఇచ్చిన మాటను పవన్ కళ్యాణ్ నిలబెట్టుకోవాలని కోరారు. కాపు రిజర్వేషన్ కోసం హరిరామ జోగయ్య ఎప్పటినుంచో పోరాడుతున్న విషయం తెలిసిందే. ‘8-3-2019 టీడీపీ హయాంలో ఇచ్చిన…
ఏపీ సీఎం చంద్రబాబు మూడు రోజుల పర్యటన కోసం దావోస్ బయల్దేరారు. ఈ క్రమంలో.. ముఖ్యమంత్రికి సీఎస్, అధికారులు విషెస్ చెప్పారు. 'సీఎం సర్.. ఆల్ ది బెస్ట్' అంటూ విష్ చేశారు.
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, సీఎంను కలవడం ఆనవాయితీగానే వస్తోందన్నారు పురంధేశ్వరి.. ఇద్దరి మధ్యా పలు ముఖ్యమైన అంశాలు చర్చకు వస్తాయి.. రాజకీయ అంశాలు సైతం చర్చకు వచ్చే అవకాశం ఉంది... రాష్ట్రానికి సంబంధించిన అంశాలు చర్చకు రావచ్చు.. అమిత్ షా, సీఎం కలయికలో వచ్చే అంశాలపై ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్నారు..
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డి కలిశారు. ఆయనతో పాటు ఏసీఏ అధ్యక్షుడు, ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని), ఏసీఏ కార్యదర్శి, రాజ్యసభ ఎంపీ సానా సతీష్ కూడా ఉన్నారు.
వైసీపీ హయంలో జరిగిన ప్రమాదాలను వివరిస్తూ మాజీ ఎమ్మెల్యే, తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి తన కార్యాలయంలో ఫ్లెక్సీ వేశారు. ‘రాబందుల ముఠా.. ఇదిగో జగనాసుర రక్తచరిత్ర’ అంటూ ప్రమాద ఘటనలకు సంబంధించిన వివరాలను వివరించారు. ప్రభాకర్ రెడ్డి నేడు మీడియాతో మాట్లాడుతూ తిరుమల తొక్కిసలాటపై వైసీపీ శవ రాజకీయాలు చేస్తుందని మండిపడ్డారు. తిరుమల టికెట్ల టోకెన్లు అమ్ముకుని మాజీ మంత్రి ఆర్కే రోజా బెంజ్ కారు తెచ్చుకుందని విమర్శించారు. నోరుంది కదా అని…
ఐదేళ్ల కుప్పాన్ని ఊహించని రీతిలో అభివద్ధి చేస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. సోమవారం ద్రవిడ యూనివర్శిటీలో ‘స్వర్ణ కుప్పం-విజన్ 2029’ డాక్యుమెంట్ను చంద్రబాబు విడుదల చేసి మాట్లాడారు. త్వరలో కుప్పాన్ని స్వచ్ఛ కుప్పంగా మారుస్తామని తెలిపారు.
Shyamala: వైస్సార్సీపీ పార్టీ అధికార ప్రతినిధి శ్యామల నేడు మీడియా సమావేశం నిర్వహించారు. ఇందులో భాగంగా ఆమె కూటమి ప్రభుత్వంపై విరుచుక పడ్డారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. చంద్రబాబు మహిళలకు ఎన్నో పథకాలను అమలు చేస్తామని చెప్పి అలాగే మోసం చేశారని.. చేతగానప్పుడు, చేయలేనప్పుడు వాగ్ధానాలు చేయకూడదని ఆవిడ పేర్కొంది. సూపర్ సిక్స్ పేరుతో బాండు పేపర్లు ఇచ్చి నిలువునా మోసం చేశారని, మహిళలను మోసం చేసినందుకు చంద్రబాబుపై 420 కేసు పెట్టవచ్చని ఆమె మాట్లాడారు.…
Jagan Mohan Reddy: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలులో కూటమి ప్రభుత్వం విఫలమైందంటూ వైయస్సార్సీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ధ్వజమెత్తారు. తాజాగా ఆయన కూటమి సర్కార్ను నిలదీస్తూ తన సోషల్ మీడియా వేదికగా సుదీర్ఘ సందేశాన్ని తెలిపారు. ఇక ఆ సందేశంలో పలు అంశాలపై సూటిగా ప్రశ్నించారు. ఇందులో ఏముందంటే.. చంద్రబాబు నాయుడు గారూ… ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలపై ఇంతటి బరితెగింపా? మేనిఫెస్టోపై ఇంతటి తేలిక తనమా? ప్రజలకు ఇచ్చిన…
పల్నాడు జిల్లా యలమంద గ్రామానికి చెందిన ఉల్లంగుల ఏడుకొండలుకు కలెక్టర్ పి.అరుణ్ బాబు ఎయిర్ కంప్రెషర్ అందజేశారు. ఉల్లంగుల ఏడుకొండలు కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకుంటామని, వ్యాపారం చేసుకునేందుకు సహకారం అందిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. సీఎం ఆదేశాన్ని.. జిల్లా కలెక్టర్ వెంటనే అమలు చేశారు. బుధవారం ఉదయం ఏడుకొండలు ఇంటిని సందర్శించిన కలెక్టర్ ఎయిర్ కంప్రెషర్ ను అందజేశారు.