సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఇవాళ రెండో రోజు కలెక్టర్ల సమావేశం జరగనుంది. జిల్లాలో ఉన్న ప్రధాన సమస్యలను కలెక్టర్లు వివరించనున్నారు. ప్రతి కలెక్టర్ కు 10 నిమిషాల సమయం కేటాయిస్తారు.. రెవెన్యూ సమస్యలు.. ల్యాండ్ సర్వే.. మద్యం షాపులు.. జిల్లాలో పథకాల అమలుపై చర్చ జరగనుంది. వాట్సప్ గవర్నెన్స్, పీ4, జిల్లాలో పేదలకు ఇళ్ళ స్థలాలు, సోలార్‌రూఫ్ టాఫ్ లపై సీఎం దిశానిర్దేశం చేయనున్నారు.
READ MORE: Kunal Kamra: మధ్యప్రదేశ్‌లో కునాల్ కమ్రా పోస్టర్లు కలకలం.. శివసేన పేరుతో వార్నింగ్
స్వర్ణాంధ్ర విజన్-2047 లక్ష్య సాధన కలెక్టర్ల సామర్థ్యం, నెట్‌వర్కింగ్, సకాలంలో పనులు జరిగేలా చూసి ఫలితాలు రాబట్టడంపైనే ఆధారపడి ఉంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఏపీ సచివాలయంలో నిన్న నిర్వహించిన కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో ఆయన ప్రసంగించారు. ‘డబ్బులుంటేనే అన్ని పనులూ అవుతాయనుకోవడం సరికాదు. మీరు చేసే నెట్‌వర్కింగ్, పనుల వల్ల పెట్టుబడులు వస్తాయి. కొత్తగా రూ.2 వేల కోట్లతో వయబిలిటీ గ్యాప్ ఫండ్ (వీజీఎఫ్) కూడా ఏర్పాటు చేశాం. అవసరమైతే దాన్ని మరో రూ.3-4 వేల కోట్లు పెంచుతాం. కలెక్టర్లు ప్రాజెక్టులకు రూపకల్పన చేసి పెట్టుబడిదారులను తీసుకొస్తే వీజీఎఫ్ కింద నిధులిస్తాం. జిల్లా స్థాయి ప్రాజెక్టులైనా ప్రభుత్వం తోడ్పాటు అందిస్తుంది’ అని ఆయన పేర్కొన్నారు. కలెక్టర్ల సదస్సులో స్వర్ణాంధ్ర విజన్ లక్ష్య సాధనపై సీఎం సమీక్షించారు.
READ MORE: Crime: ప్రేమ వ్యవహారం? తండ్రి, కూతురిని చంపి.. తానూ ఆత్మహత్య చేసుకున్న యువకుడు..