CM Chandrababu: మన ఇల్లు, మన ఊరు, మన వీధులను నిరంతరం శుభ్రంగా ఉంచుతోన్న పారిశుద్ధ్య కార్మికులకు వందనం అన్నారు సీఎం చంద్రబాబు. అపరిశుభ్రతను తరిమేసే వాళ్లు నిజమైన వీరులని కొనియాడారు. విజయవాడలో ఏర్పాటు చేసిన స్వచ్ఛత అవార్డుల కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ఆపరేషన్ సిందూర్ పేరుతో సైనికులు టెర్రరిస్టులను ఏరి వేశారని గుర్తు చేశారు. ఆరోగ్యాన్ని పణంగా పెట్టి పని చేసే పారిశుద్ధ్య కార్మికులు కూడా వీరులే అన్నారు. స్వచ్ఛ భారత్ పేరుతో కేంద్రం పెద్ద…
YS Jagan: ఉద్యోగులకు కూటమి ప్రభుత్వ మోసంపై మాజీ సీఎం వైఎస్ జగన్ ఫైర్ అయ్యారు.. తన హయాంలో అమలు చేసిన కార్యక్రమాలు, చంద్రబాబు మేనిఫెస్టోని చూపుతూ ఎక్స్ లో జగన్ ట్వీట్ చేశారు. ఎన్నికలకు ముందు మీరు ఉద్యోగస్తులకు ఇచ్చిన హామీలేంటి.. మీరు చేస్తున్నదేంటి? అని ప్రశ్నించారు. తీపి మాటలతో అరచేతిలో వారికి వైకుంఠం చూపి ఇప్పుడు వారిని మోసం చేస్తారా? నడిరోడ్డుమీద నిలబెడతారా? ఇందుకేనా మీరు అధికారంలోకి వచ్చింది? అని నిలదీశారు. మంత్రివర్గ సమావేశం…
Nimmala Ramanaidu: 2026 మే నెల చివరి వరకు 28,946 మందికి రూ. 900 కోట్లతో పునరావాసం కల్పిస్తామని ఏపీ ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. 2027 మార్చి వరకు పోలవరం నిర్వాసితులను పునరావాసం పూర్తి చేస్తామని తెలిపారు. పడకేసిన పోలవరం పనులను కార్యరూపం దాల్చేలా పనిచేస్తున్నామన్నారు. తాజాగా ఢిల్లీలో కేంద్ర జలశక్తి మంత్రి సి.ఆర్.పాటిల్తో భేటీ అయ్యారు.
YS Jagan: మన్యం జిల్లాలో పచ్చకామెర్లతో విద్యార్థులు మృతి చెందటంపై మాజీ సీఎం వైఎస్ జగన్ ఆందోళన వ్యక్తం చేశారు.. ప్రభుత్వ నిర్లక్ష్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.. కూటమి ప్రభుత్వం పాలనలో నిర్లక్ష్యం, అలసత్వం కారణంగా ఇవాళ పేద విద్యార్థులు ప్రాణాలు కోల్పోతున్నారని మండిపడ్డారు. అయినా వాళ్లకు కనికరం కూడా లేదని సోషల్ మీడియా ప్లాట్ఫాం ఎక్స్లో ట్వీట్ చేశారు.
Srisailam: శ్రీశైలం భ్రమరాంబ మల్లిఖార్జున స్వామి దేవస్థానం అభివృద్ధిపై దేవావయా, అటవీశాఖలతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఉన్నతాధికారులు హాజరయ్యారు. జ్యోతిర్లింగం, శక్తిపీఠం కలిగిన దివ్యక్షేత్రంగా వెలుగొందుతున్న ఆలయ సమగ్రాభివృద్ధిపై చర్చ జరిగింది. ఏటా లక్షల సంఖ్యలో భక్తులు వస్తున్నందున వారికి మెరుగైన సౌకర్యాలు కల్పించే ప్రణాళికలపై చర్చించారు. తిరుమల తరహాలోనే శ్రీశైల క్షేత్రాన్ని అభివృద్ధి చేసేలా కార్యాచరణకు ముఖ్యమంత్రి ఆదేశించారు. ఆధ్యాత్మికంగా, పర్యాటక…
Balakrishna: ఏపీ బ్రాండ్ సీఎం చంద్రబాబు అని హీరో, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ అన్నారు. రాష్ట్రంలో ఆర్థిక సమస్యలు చాలా ఉన్నాయన్నారు. అందుకే చంద్రబాబు 24 గంటలు పనిచేస్తున్నారని తెలిపారు. తాజాగా విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు అనుభవంతో రాష్ట్రం దేశ పటంలోనే సువర్ణ అక్షరాలతో లికించబడుతుందని కొనియాడారు. ఆధ్యాత్మికం, పర్యాటకం మిళితమైన కార్యక్రమని..
Somireddy Chandra Mohan Reddy: హౌసింగ్ శాఖలో రాష్ట్ర వ్యాప్తంగా రూ.3 వేల కోట్లకు పైగా కుంభకోణం జరిగిందని అసెంబ్లీలో సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రస్తావించారు. సొంతంగా ఇళ్లు కట్టుకోలేని గిరిజన బిడ్డలతో పాటు నిరుపేదలకు గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రూ.2.30 లక్షల చొప్పున మంజూరు చేసిందని చెప్పారు. వైసీపీ ప్రభుత్వంలో ఆ మొత్తాన్ని జగన్ రెడ్డి రూ.1.80 లక్షలకు తగ్గించారని.. నా ఎస్సీలు, నా ఎస్టీలు అంటూ జగనన్నకాలనీల పేరుతో దుర్మార్గాలకు…
CM Chandrababu: 2014-19 మధ్య కాలంలో అన్న క్యాంటీన్లు పెట్టాం.. తమిళనాడులో అమ్మ క్యాంటీన్లు పెడితే.. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం దాన్ని మరింత అభివృద్ధి చేసింది.. కానీ ఏపీలో దౌర్బాగ్యం.. అన్న క్యాంటీన్లను రద్దు చేశారని ఏపీ సీఎం చంద్రబాబు గుర్తు చేశారు. తాజాగా అసెంబ్లీలో ఆయన ప్రసంగించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. అన్న క్యాంటీన్లను పునః ప్రారంభించామని తెలిపారు. ఇప్పుడు 204 అన్న క్యాంటీన్లు ఉన్నాయి.. త్వరలో గ్రామీణ ప్రాంతాల్లో కూడా 70…