జమ్మలమడుగు అభివృద్ధిలో భాగస్వాములైన పారిశ్రామికవేత్తలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు సీఎం చంద్రబాబు నాయుడు. పేదల సేవలో తాను ఉండాలని సింగపూర్ కార్యక్రమాన్ని ముగించుకుని వచ్చినట్టు తెలిపారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 64 లక్షల మందికి 33 వేల కోట్ల రూపాయలు డైరెక్ట్ గా పేదలకు ఇస్తున్నామని చెప్పారు.
YS Jagan Accuses CM Chandrababu of Revenge Politics: కాలేజ్ రోజుల్లో పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి చెప్పుతో కొట్టారని సీఎం చంద్రబాబు గుర్తు పెట్టుకున్నారని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ అన్నారు. కాలేజ్ రోజుల్లో అందరూ ఉడుకు రక్తం మీద ఉంటారని, అది గుర్తు పెట్టుకుని ఆయన కొడుకు మిథున్ రెడ్డిని జైల్లో పెట్టారన్నారు. చంద్రగిరి ఎమ్మెల్యేగా గెలిచారని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని జైల్లో పెట్టారని, చంద్రబాబు సొంత నియోజకవర్గంలో గెలిచారని ఇదంతా…
తన పర్యటన సందర్భంగా నెల్లూరులో 2 వేల మంది పోలీసులు తిష్ట వేశారని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మండిపడ్డారు. వాళ్లంతా తన సెక్యూరిటీ కోసం కాదని, తన కోసం వచ్చే జనాల్ని అడ్డుకోవటానికిని ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో ఎమర్జెన్సీ తరహా పరిస్థితులు కనిపిస్తున్నాయని, జరుగుతున్న ఘటనలే అందుకు నిదర్శనం అని పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు అడుగులకు పోలీసులు మడుగులు ఒత్తుతున్నారని ఎద్దేవా చేశారు. రాజకీయ నాయకులు తమ పార్టీ వారిని కలవటం నేరమా?,…
సీఎం చంద్రబాబును స్కిల్ స్కాంలో అరెస్ట్ చేశారు కాబట్టి.. మాజీ సీఎం వైఎస్ జగన్ను అరెస్ట్ చేయాలని చూస్తున్నారని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. రాష్ట్ర ప్రజలకు ఒక అద్భుతాన్ని తయారు చేసినట్లుగా జగన్ మీద విషం చిమ్ముతున్నారని మండిపడ్డారు. భవిష్యత్తులో తన కొడుకుకు జగన్ అడ్డంకి లేకుండా చేయాలనే చంద్రబాబు తపనపడుతున్నారని పేర్కొన్నారు. మిగతా వారు అయితే మాట వింటారని.. జగన్ వినడు కాబట్టి కుట్రలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ జగన్…
SIPB: సీఎం చంద్రబాబు మార్గదర్శంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో దూసుకెళ్తోంది. ఈ నేపథ్యంలో ఏపీకి కొత్తగా రూ.20,216 కోట్ల విలువైన నాలుగు భారీ ప్రాజెక్టులు రానున్నాయి. దీంతో దాదాపు 50,600 మందికి ఉద్యోగావకాశాలు ఏర్పడనున్నాయని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన తొమ్మిదవ రాష్ట్ర పెట్టుబడి ప్రమోషన్ బోర్డు (SIPB) సమావేశంలో ఈ ప్రాజెక్టులకు ఆమోదం లభించింది. ఈ సమావేశంలో సిఫీ ఇన్ఫినిటీ స్పేసెస్ లిమిటెడ్, సత్వ డెవలపర్స్ ప్రైవేట్…
CM Chandrababu: విజయవాడలో ఇన్వెస్టోపియా గ్లోబల్ సమ్మిట్ లో ఏపీ సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నేను జనవరిలో అబ్దులా బిన్ ను కలిసాను అప్పుడు ముందుగా ఏపీకి రావలని కోరాను.. ఏపీ గురించి మీకు అప్పుడే అర్థమవుతుందని చెప్పా..
Green Hydrogen Valley: నేడు సీఎం క్యాంపు కార్యాలయంలో చీఫ్ సెక్రటరీ విజయానంద్, నెడ్ క్యాప్ ఎండి కమలాకర్ బాబు సమక్షంలో గ్రీన్ హైడ్రోజన్ డిక్లరేషన్ విడుదల అయ్యింది. ఇందులో భాగంగా 2030 నాటికి ఏపీని గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీగా మార్చేందుకు అవసరమైన కార్యాచరణ ప్రకటిస్తూ డిక్లరేషన్ విడుదల చేశారు. ఇటీవల అమరావతిలో గ్రీన్ హైడ్రోజన్పై రెండు రోజుల పాటు సమ్మిట్ జరిగిన విషయం తెలిసిందే. అమరావతిలో జరిగిన ఈ సమ్మిట్లో 600 మంది ప్రతినిధులు, ఇండస్ట్రీ…
Botsa Satyanarayana: పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించిన మాజీ మంత్రి బొత్సా సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలిసి రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారు అని ఆరోపించారు.
KTR : ఢిల్లీలో జరిగిన రెండు తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీపై మాజీ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. సీఎం రేవంత్ రెడ్డి ముసుగు వీడింది. నేటితే అసలు గుట్టు బయట పడింది. తెలంగాణ నిధులను రాహుల్ గాంధీకి, నీళ్లను చంద్రబాబు నాయుడికి ఇవ్వడానికి రేవంత్ రెడీ అయ్యారంటూ మండిపడ్డారు కేటీఆర్. ఈ రోజు జరిగిన మీటింగ్ లో అసలు బనకచర్ల ప్రస్తావన రాలేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అసలు ఏపీ మొదటి ప్రతిపాదనే…