నెల్లూరులో వైసీపీ నేతలు రైతాంగ సమస్యలను ప్రస్తావిస్తూ ర్యాలీ నిర్వహించారు. అన్నదాతకు అండగా చేపట్టిన వైసీపీ కార్యక్రమంలో భాగంగా మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి, ఇతర నేతలు వీఆర్సీ సెంటర్కి చేరుకున్నారు.
Nara Lokesh: టీడీపీ, బీజేపీ కూటమి బంధం బలంగా ఉందని.. రాబోయే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్ (CPR)కు తమ పార్టీ మద్దతు ఇస్తుందని ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. తాజాగా జరిగిన ఇండియా టుడే కాన్క్లేవ్ సౌత్ 2025లో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. టీడీపీ ఎన్డీఏలో చేరింది, అందుకు మద్దతు కొనసాగిస్తుంది. మేము ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వాన్ని నమ్ముతాం. కాబట్టి, ఉపరాష్ట్రపతి ఎన్నికలైనా లేదా ఇతర…
ఆరోగ్యశ్రీని రాష్ట్ర ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని వైసీపీ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. నెట్వర్క్ ఆసుపత్రులకు నిధులు విడుదల కాని కారణంగా పేదలకు వైద్యం అందడం లేదన్నారు. రెండు లక్షల కోట్లు అప్పు చేసిన ప్రభుత్వం ప్రజారోగ్యం కోసం 6 వేల కోట్లు ఖర్చు చేయదా? అని ప్రశ్నించారు. మెడికల్ కాలేజీల ప్రైవేట్ విధానంపై ప్రభుత్వం పునఃసమీక్షించాలని కోరారు. యూరియా కోసం అడిగితే సీఎం చంద్రబాబు బెదిరిస్తున్నారని, ప్రభుత్వం అవినీతి కారణంగానే యూరియా కొరత…
అమరావతిలో మంత్రులతో భేటీ నిర్వహించారు సీఎం చంద్రబాబునాయుడు. సుగాలి ప్రీతి కేసును సీబీఐకి అప్పగించామని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. సుగాలి ప్రీతి కుటుంబానికి అండగా ఉన్నందుకు తనను టార్గెట్ చేస్తున్నారన్నారు డిప్యూడీ సీఎం పవన్ కళ్యాణ్. స్వార్థ రాజకీయాల కోసం చేసే విషప్రచారాన్ని ధీటుగా తిప్పికొడదామని పవన్ అన్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. యూరియాపై జరుగుతున్న దుష్ప్రచారంపైనా కేబినెట్ భేటీ తర్వాత.. మంత్రులతో చర్చించారు సీఎం చంద్రబాబు నాయుడు . ఎరువులకు ఇబ్బంది లేకున్నా.. వైసీపీ…
ఏపీలో యూరియా కొరత, రైతుల సమస్యలపై మాజీ సీఎం జగన్ ట్వీట్ చేశారు. చంద్రబాబు కూటమి ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు.. మీకు ఓటేస్తే భవిష్యత్తుకు గ్యారెంటీ అన్నారు.. కానీ రైతులకు సులభంగా దొరికే యూరియా బస్తానే ఇవ్వలేక పోతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. ఇంత అధ్వాన్నంగా ప్రభుత్వాన్ని నడుపుతారా అంటూ విమర్శలు గుప్పించారు. మీరు అధికారంలోకి వచ్చింది మొదలు వరుసగా ఈ రెండేళ్ల పాటు రైతులకు ఎరువుల కష్టాలే..బస్తా యూరియా…
Pawan Kalyan : ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ 54వ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా సినీ సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖులు పవన్ కల్యాణ్ కు బర్త్ డే విషెస్ చెబుతున్నారు. ఈ క్రమంలోనే చిరంజీవి స్పెషల్ ట్వీట్ చేశారు. ఇండస్ట్రీలో అగ్ర హీరో, ప్రజల్లో జనసేనాని అంటూ తమ్ముడికి స్పెషల్ గా బర్త్ డే విషెస్ చెప్పారు. మరింత ఎత్తుకు ఎదగాలని, ప్రజలకు అండగా ఉండాలని కోరుకున్నారు. చిరంజీవి చేసిన ట్వీట్…