టీడీపీ నేతలకు బెల్ట్ షాపులు ఉపాధి హామీ పథకం కింద మారాయని వైసీపీ నేత, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు విమర్శించారు. బెల్టు షాపులు పెడితే బెండు తీస్తామని అసెంబ్లీ సాక్షిగా సీఎం చంద్రబాబు నాయుడు చెప్పారని ఆయన అన్నారు. ఇప్పటి వరకూ ఎంతమంది బెండు తీశారో సమాధానం చెప్పాలని ఆయన ప్రశ్నించారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. గురువారం జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో టీడీపీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు వైసీపీ నేత, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు. బెల్టు…
CM Chandrababu: టీటీడీ భక్తులకు సీఎం గుడ్న్యూస్ చెప్పారు. రోజురోజుకు పెరుగుతున్న యాత్రికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్ నిర్మిస్తున్నారు. నూతన బస్స్టాండ్ అన్ని సౌకర్యాలతో ఆకట్టుకునేలా ఉండాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. క్యాంపు కార్యాలయంలో నేషనల్ హైవేస్ లాజిస్టిక్స్ మేనేజ్మెంట్ లిమిటెడ్, ఏపీఎస్ఆర్టీసీ అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు.
YS Sharmila: APCC చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి విజయవాడలో ఏపీలో అమలవుతున్న సూపర్ సిక్స్ పథకాలపై కూటమి ప్రభుత్వాన్ని ఘాటుగా విమర్శించారు. సూపర్ సిక్స్ హామీలను సూపర్ హిట్ అని పేర్కొనడం సిగ్గుచేటుతో కూడినదని, ప్రజలకు ఇవ్వాల్సిన వాగ్దానాలు పూర్తిగా అమలులోకి వచ్చాయని చెప్పడం హాస్యాస్పదమని ఆమె పేర్కొన్నారు. సూపర్ సిక్స్ హామీలలో ఒక్కటైనా పూర్తిగా అమలు అయ్యిందా? రాష్ట్రంలో 50 లక్షల మంది నిరుద్యోగులలో ఒక్కరికి కూడా 3,000 రూపాయల భృతి అందించిందా? కూటమి…
నెల్లూరులో వైసీపీ నేతలు రైతాంగ సమస్యలను ప్రస్తావిస్తూ ర్యాలీ నిర్వహించారు. అన్నదాతకు అండగా చేపట్టిన వైసీపీ కార్యక్రమంలో భాగంగా మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి, ఇతర నేతలు వీఆర్సీ సెంటర్కి చేరుకున్నారు.
Nara Lokesh: టీడీపీ, బీజేపీ కూటమి బంధం బలంగా ఉందని.. రాబోయే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్ (CPR)కు తమ పార్టీ మద్దతు ఇస్తుందని ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. తాజాగా జరిగిన ఇండియా టుడే కాన్క్లేవ్ సౌత్ 2025లో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. టీడీపీ ఎన్డీఏలో చేరింది, అందుకు మద్దతు కొనసాగిస్తుంది. మేము ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వాన్ని నమ్ముతాం. కాబట్టి, ఉపరాష్ట్రపతి ఎన్నికలైనా లేదా ఇతర…
ఆరోగ్యశ్రీని రాష్ట్ర ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని వైసీపీ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. నెట్వర్క్ ఆసుపత్రులకు నిధులు విడుదల కాని కారణంగా పేదలకు వైద్యం అందడం లేదన్నారు. రెండు లక్షల కోట్లు అప్పు చేసిన ప్రభుత్వం ప్రజారోగ్యం కోసం 6 వేల కోట్లు ఖర్చు చేయదా? అని ప్రశ్నించారు. మెడికల్ కాలేజీల ప్రైవేట్ విధానంపై ప్రభుత్వం పునఃసమీక్షించాలని కోరారు. యూరియా కోసం అడిగితే సీఎం చంద్రబాబు బెదిరిస్తున్నారని, ప్రభుత్వం అవినీతి కారణంగానే యూరియా కొరత…