CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొంథా తుఫాన్ తర్వాత పరిస్థితితో పాటు పంట నష్టంపై కాసేపట్లో ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. ప్రాథమిక అంచనాల ప్రకారం రాష్ట్రంలో 304 మండలాల్లో 1,825 గ్రామాల్లో పంట నష్టంపై ఆరా తీయనున్నారు. 87 వేల హెక్టార్లలో పంట నష్టం జరిగినట్టు అధికారులు అంచనా వేశారు.
Read Also: Cricketer Died: ఫిల్ హ్యూస్ మాదిరే.. 17 ఏళ్ల క్రికెటర్ హఠాన్మరణం!
అయితే, 59 వేల హెక్టార్లలో వరి, మొక్క జొన్న, మినుము పంటలకు నష్టం వాటిల్లింది. మొక్కజొన్న, వరి, పత్తి పంటలు బాగా దెబ్బతిన్నట్టు గుర్తించారు. డ్రోన్ సహాయంతో పంట నష్టంపై అంచనా వేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 78 వేల 796 మంది రైతులు తీవ్రంగా నష్ట పోయినట్టు ప్రాథమిక సమాచారం. ఇక, ఈ వరదల ధాటికి 42 పశువులు చనిపోయాయి. క్షేత్ర స్థాయిలో పరిస్థితి పరిశీలించిన తర్వాత పంటనష్టం మరింత పెరిగే అవకాశం ఉందనే అభిప్రాయంలో ప్రభుత్వం ఉంది.