రేపటి నుంచి 3 రోజుల పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు యూఏఈలో పర్యటించనున్నారు. రాష్ట్రానికి పెట్టుబడుల సాధన కోసం యూఏఈలో సీఎం బృందం పర్యటిస్తోంది. వచ్చే నెల 14-15వ తేదీల్లో విశాఖలో జరగనున్న పార్టనర్షిప్ సమ్మిట్‌కు వివిధ సంస్థల ప్రతినిధులను చంద్రబాబు ఆహ్వానించనున్నారు. మూడు రోజుల పర్యటన కోసం రేపు ఉదయం 10 గంటలకు హైదరాబాద్ నుంచి దుబాయ్ వెళ్లనున్నారు. 3 రోజుల్లో వివిధ అంతర్జాతీయ సంస్థల యాజమాన్యాలు, ప్రతినిధులతో వన్ టూ వన్ మీటింగ్‌లకు ముఖ్యమంత్రి…
నెల్లూరు జిల్లా గుడ్లూరు మండలం రాళ్లపాడు గ్రామం ఘటనలో చనిపోయిన తిరుమలశెట్టి లక్ష్మీ నాయుడు కుటుంబానికి ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. లక్ష్మీ నాయుడు భార్యకు 2 ఎకరాల భూమి, 5 లక్షల నగదు పరిహారం ప్రకటించింది. లక్ష్మీ నాయుడు పిల్లలను చదివించే బాద్యత ప్రభుత్వం తీసుకుంటుందని సీఎం చంద్రబాబు ప్రకటించారు. కారు దాడిలో గాయపడ్డ పవన్, భార్గవ్‌లకు కూడా పరిహారం ఇవ్వనున్నారు. శాంతిభద్రతలపై సచివాలయంలో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. సమీక్షలో మంత్రులు అనిత, నారాయణ సహా…
బాధిత మహిళకు, అతని తల్లిదండ్రులకు న్యాయం జరగాలని సూచించారు. హత్య జరిగిన నాటి నుంచి ప్రభుత్వం ఫాలో చేస్తుంది.. హత్యకు సంబంధించి బాధిత కుటుంబానికి న్యాయం చేయటానికి ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో కమిటీ వేయటం జరిగింది.. నిందితుడికి బెయిల్ రాకుండా శిక్ష పడేలా చేస్తామన్నారు. ఇది ఒక భార్యాబిడ్డల ఆవేదన, తల్లిదండ్రుల ఆవేదన అని మంత్రి అనిత తెలిపింది.
అద్దెపల్లి జనార్థన్, జయ చంద్రారెడ్డి స్నేహితులని మీరే చెప్పారు అని గుర్తు చేశారు. ఇక, జనార్థన్ కు రెడ్ కార్పెట్ వేసి మీరే రప్పించారు అన్నారు. ఆయనతో నా పేరు చెప్పించారు.. కస్టడీలో ఉన్న వ్యక్తి వీడియో ఎలా బయటకు వచ్చింది అని మాజీ మంత్రి ప్రశ్నించారు. అయితే, నకిలీ మద్యం కేసులో ఏ విచారణకు అయినా నేను సిద్ధంగా ఉన్నాను, లై డిటెక్టర్ పరీక్షకు కూడా సిద్ధం, ఎక్కడికైనా వస్తాను అని జోగి రమేశ్ సవాల్…
CM Chandrababu: భవిష్యత్తును మార్చేది సంస్కరణలేనని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా.. సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉందని చెప్పారు. జీఎస్టీ సంస్కరణలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన సూపర్ జీఎస్టీ-సూపర్ సేవింగ్స్ ప్రచారంలో భాగంగా విద్యార్థులకు నిర్వహించిన పోటీల్లోని విజేతలను ముఖ్యమంత్రి సచివాలయంలో కలిశారు. 13 ఉమ్మడి జిల్లాలకు చెందిన 17 మంది విద్యార్థినీ విద్యార్థులు విజేతలుగా నిలిచారు.
Perni Nani: ఏపీలో మద్యం అమ్మకాల్లో క్యూఆర్ కోడ్ తామే ప్రవేశపెట్టమన్నట్లుగా సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. ఇది తామే కనిపెట్టినట్లుగా చంద్రబాబు గొప్పలు చెప్పుకుంటున్నారని.. అన్నీ ముఖ్యమంత్రి ప్రెస్ మీట్లు పెట్టి చెప్తుంటే సారా మంత్రి ఏమి చేస్తున్నారని విమర్శించారు.. జగన్ ప్రభుత్వ హయాంలో మద్యం బాటిల్ ఫ్యాక్టరీ నుంచి బయటకు వచ్చే ముందే క్యూఆర్ కోడ్ తోనే వచ్చేదని.. ఇప్పుడు అదేదో ఘన కార్యంలా చెప్పుకుంటున్నారన్నారు.. మీరు రాగానే…
PM Modi Srisailam Visit: ప్రధాని మోడీ శ్రీశైలం పర్యటన కొనసాగుతోంది. తాజాగా ప్రధాని శ్రీశైలానికి చేరుకున్నారు. తొలిసారి శ్రీశైలం శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జునస్వామి ఆలయానికి ప్రధాని నరేంద్ర మోడీ వచ్చారు.. ఆలయం వద్ద సీఎం డిప్యూటీ సీఎం, శివసేవకులు, కూటమి కార్యకర్తలు, బీజేపీ అభిమానులు ప్రధాని మోడీకి ఘన స్వాగతం పలికారు. భ్రమరాంబ, మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు.
PM Modi Visits Srisailam Temple: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శ్రీశైలంకు చేరుకున్నారు. ఉదయం ఢిల్లీ నుంచి కర్నూలు చేరుకున్న ప్రధానికి గవర్నర్ నజీర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వాగతం పలికారు. అనంతరం సైనిక హెలికాఫ్టర్‌లో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు శ్రీ శైలంకు చేరుకున్నారు. అక్కడ శ్రీశైలం భ్రమరాంబ అతిథి గృహానికి విచ్చేశారు. కాసేపట్లో శ్రీ భ్రమరాంబా సమేత మల్లికార్జున స్వామివారికి ప్రత్యేక పూజలు చేస్తారు.…
PM Modi Tour: నేడు ప్రధాని నరేంద్ర మోడీ ఏపీ పర్యటన కొనసాగనుంది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. నన్నూరు సమీపంలో "సూపర్ జీఎస్టీ - సూపర్ సేవింగ్స్" పేరుతో ప్రధాని మోడీ భారీ బహిరంగసభ కొనసాగనుంది. 3 లక్షల మందితో సూపర్ జీఎస్టీ సభ ఏర్పాటు చేయనున్నారు. 400 ఎకరాల్లో సభ ఏర్పాట్లు చేపట్టారు. 360 ఎకరాల్లో 12 పార్కింగ్ ప్రదేశాలు, 50 ఎకరాల్లో సభా ప్రాంగణం, వేదిక ఉండనుంది. జన సమీకరణకు దాదాపుగా 7వేల…
PM Modi Srisailam Tour: నేడు శ్రీశైలంలో ప్రధాని మోడీ పర్యటనకు సర్వం సిద్ధమైంది.. మోడీ పర్యటనకు కేంద్ర భద్రతా బలగాల పర్యవేక్షణ కొనసాగుతోంది.. శ్రీశైల క్షేత్రం భద్రతావలయంలో ఉంది. ప్రధాని మోడీ పర్యటన పూర్తయ్యే వరకు శ్రీశైలంలో రూట్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలులోకి రానున్నాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకూ శ్రీశైలం వెళ్లే దారులలో ట్రాఫిక్ ను నిలిపివేయనున్నారు.