CM Chandrababu: సీఆర్డీఏ ప్రధాన కార్యాలయం ప్రారంభోత్సవం తర్వాత సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. రాజధానికి భూములు ఇచ్చిన రైతులకు అభినందనలు తెలిపారు. రాజధాని రాష్ట్రానికి మధ్యలో ఉంది కాబట్టే గుంటూరు- విజయవాడ మధ్య జిల్లాలో రాజధానిగా ప్రకటించాం.. హైదరాబాద్ నగరంలో హైటెక్ సిటీ పెడితే అవహేళన చేశారు.
గాలి, బొగ్గు, నీరు, సోలార్‌తో విద్యుత్ ఉత్పత్తి కావడం తాను చూశానని.. ఎద్దులను ఉపయోగించి కరెంట్ ప్రొడ్యూస్ చేయడం తొలిసారి చూస్తున్నా అని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఈరోజు నెల్లూరు జిల్లాలో నందగోకులం లైఫ్ స్కూల్‌ను ప్రారంభించిన అనంతరం.. విశ్వసముద్ర బయో ఎనర్జీ ఇథనాల్ ప్లాంట్‌కు సీఎం శ్రీకారం చుట్టారు. నందగోకులం ప్రాంగణంలో మూడు ప్రాజెక్టులు ప్రారంభించానని చెప్పారు. ఆహారం, నిద్ర, వ్యాయామం, మంచి పనులు చేస్తూ.. అందరూ ఆరోగ్యంగా ఉండండని సీఎం సూచించారు. సమాజం…
AI Fake Video Call: టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు, మాజీ మంత్రి దేవినేని ఉమా పేరుతో ఏఐ టెక్నాలజీతో నకిలీ వీడియో కాల్స్ ద్వారా తెలంగాణలోని పలువురు టీడీపీ నాయకుల వద్ద నుండి నగదును కాజేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కాకర్లపల్లి గ్రామానికి చెందిన కంచర్ల సతీష్ అనే టీడీపీ నాయకుడికి కొద్ది రోజుల క్రితం దేవినేని ఉమా పీఏ అంటూ ఫోన్ కాల్ వచ్చింది. తను…
అక్టోబరు 9న నర్సీపట్నం మెడికల్ కాలేజీని సందర్శిస్తాను అని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ తెలిపారు. అక్టోబరు 10 నుంచి నవంబర్ 22వరకూ రచ్చబండ కార్యక్రమం ఉంటుందని, మెడికల్ కాలేజీల ప్రైవటీకరణపై కరపత్రాలు పంపిణీ చేస్తామని చెప్పారు. కోటి సంతకాలను రచ్చబండ కార్యక్రమాల ద్వారా సేకరిస్తామని, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కనీసం ప్రతి పంచాయతీ నుంచి 500 మందితో సంతకాలు సేకరిస్తామన్నారు. ప్రతి నియోజకవర్గ సమన్వయ కర్త ప్రతిరోజూ రెండు గ్రామాలను సందర్శిస్తాడని,…
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి పాలన మీద ధ్యాస లేదని, సొంత ఆదాయాలు పెంచుకోవడం మీదే పూర్తి ధ్యాస పెట్టారని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ విమర్శించారు. రాష్ట్రంలో విచ్చలవిడిగా అవినీతి జరుగుతోందని, రాష్ట్ర ఖజానాకు రావాల్సిన ఆదాయాలు తగ్గుతున్నాయన్నారు. చంద్రబాబు, ఆయన కుమారుడు, ఆయన బినామీల జేబుల్లోకి ఆదాయాలు వెళ్తున్నాయని మండిపడ్డారు. రాష్ట్రంలో దోచుకో.. పంచుకో.. తినుకో అనేదే కనిపిస్తోందని వైఎస్ జగన్ మండిపడ్డారు. ఈరోజు తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో రీజినల్ కో-ఆర్డినేటర్లు,…
CM Chandrababu: మన ఇల్లు, మన ఊరు, మన వీధులను నిరంతరం శుభ్రంగా ఉంచుతోన్న పారిశుద్ధ్య కార్మికులకు వందనం అన్నారు సీఎం చంద్రబాబు. అపరిశుభ్రతను తరిమేసే వాళ్లు నిజమైన వీరులని కొనియాడారు. విజయవాడలో ఏర్పాటు చేసిన స్వచ్ఛత అవార్డుల కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ఆపరేషన్ సిందూర్ పేరుతో సైనికులు టెర్రరిస్టులను ఏరి వేశారని గుర్తు చేశారు. ఆరోగ్యాన్ని పణంగా పెట్టి పని చేసే పారిశుద్ధ్య కార్మికులు కూడా వీరులే అన్నారు. స్వచ్ఛ భారత్ పేరుతో కేంద్రం పెద్ద…
YS Jagan: ఉద్యోగులకు కూటమి ప్రభుత్వ మోసంపై మాజీ సీఎం వైఎస్ జగన్ ఫైర్ అయ్యారు.. తన హయాంలో అమలు చేసిన కార్యక్రమాలు, చంద్రబాబు మేనిఫెస్టోని చూపుతూ ఎక్స్ లో జగన్ ట్వీట్ చేశారు. ఎన్నికలకు ముందు మీరు ఉద్యోగస్తులకు ఇచ్చిన హామీలేంటి.. మీరు చేస్తున్నదేంటి? అని ప్రశ్నించారు. తీపి మాటలతో అరచేతిలో వారికి వైకుంఠం చూపి ఇప్పుడు వారిని మోసం చేస్తారా? నడిరోడ్డుమీద నిలబెడతారా? ఇందుకేనా మీరు అధికారంలోకి వచ్చింది? అని నిలదీశారు. మంత్రివర్గ సమావేశం…