ఈనెల 12న మెడికల్ కాలేజీలపై కోటి సంతకాల ర్యాలీని వైసీపీ నిర్వహించనుంది. అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలలోనూ ర్యాలీలు జరగనున్నాయి. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైసీపీ కోటి సంతకాల ర్యాలీ కొనసాగనుంది. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు ఉదయం ర్యాలీల పోస్టర్‌ను పార్టీ నేతలు రిలీజ్ చేశారు. పార్టీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మాజీమంత్రి అంబటి రాంబాబు, టీజేఆర్ సుధాకర్ బాబు, దొంతిరెడ్డి వేమారెడ్డి, మనోహర్ రెడ్డి, వంగవీటి నరేంద్ర, చంద్రశేఖర్ రెడ్డి తదితరులు పోస్టర్ రిలీజ్ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Also Read: MSK Prasad: మాజీ చీఫ్ సెలెక్టర్ ఎంఎస్కే ప్రసాద్‌కు చేదు అనుభవం.. బీసీసీఐకి ఫిర్యాదు?
వైసీపీ మాజీమంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ… ‘మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ దురదృష్టకరం. మాజీ సీఎం వైఎస్ జగన్ తెచ్చిన మెడికల్ కాలేజీలపై సీఎం చంద్రబాబు కక్ష కట్టటం సబబు కాదు. దీనిపై కోటి సంతకాల కార్యక్రమం చేస్తున్నాం. 12న అసెంబ్లీ నియోజకవర్గాలలో నిరసన ర్యాలీలు చేస్తాం. ప్రభుత్వ నిర్ణయం పేదలకు వ్యతిరేకంగా ఉంది. ఆ నిర్ణయాన్ని వెనక్కు తీసుకునే వరకు ఉద్యమం చేస్తాం. కూటమి ప్రభుత్వానికి కళ్లు తెరిపిస్తాం’ అని అన్నారు.