YS Jagan : ఆంధ్రప్రదేశ్‌లో మెడికల్ విద్య రంగంపై సీఎం చంద్రబాబు తీసుకుంటున్న నిర్ణయాలను మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు చేతుల్లోకి ఇవ్వడం దరిద్రపు పని అని ఆయన వ్యాఖ్యానించారు. జగన్ మాట్లాడుతూ.. “మూడేళ్లలో మేము 17 మెడికల్ కాలేజీలు ప్రారంభించాం. ప్రతి జిల్లాలో గవర్నమెంట్ కాలేజీలు ఏర్పరిచాం. కానీ చంద్రబాబు ఒక్క మెడికల్ కాలేజీ కూడా తీసుకురాలేదు. ఇప్పుడు వాటిని ప్రైవేట్ వారికి అప్పగించాలనే ప్రయత్నం చేస్తున్నారు. సంవత్సరానికి వెయ్యి కోట్లు ఖర్చు చేసి అయినా ప్రజల ఆరోగ్య భవిష్యత్తును కాపాడాలి,” అని అన్నారు.
చంద్రబాబు మంచి చేయకపోగా, చెడు చేస్తున్నారని విమర్శించిన ఆయన, విద్యార్థులు దీనిపై ప్రశ్నించాల్సిన బాధ్యత ఉందన్నారు. “మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈ నెల 12న ర్యాలీలు నిర్వహిస్తాం. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై డిసెంబర్‌లో ఆందోళనలు చేపడతాం. అంతవరకు చంద్రబాబుకు సమయం ఇస్తున్నాం,” అని జగన్ చెప్పారు.
అంతేకాకుండా.. “మా వైసీపీ ప్రభుత్వం పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్ అమలు చేసింది. విద్యా దీవెన కింద రూ.12,609 కోట్లు ఇచ్చాం. వసతి దీవెన కింద ప్రతి విద్యార్థికి రూ.20 వేల చొప్పున అందించాం. పేద కుటుంబాలు అప్పుల పాలు కాకుండా చూశాం,” అని గుర్తుచేశారు. “పేదలకు చదువు భారం కాకూడదు. కానీ ఈ ప్రభుత్వం అన్నింటినీ ధ్వంసం చేస్తోంది. పిల్లలు చదవకూడదనే ఉద్దేశంతో చంద్రబాబు పనిచేస్తున్నారు. రూ.4,200 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్, రూ.2,200 కోట్ల వసతి దీవెన పెండింగ్‌లో ఉంచారు. మా హయాంలో ప్రభుత్వ రంగంలోనే 6.3 లక్షల ఉద్యోగాలు ఇచ్చాం. గ్రామ, వార్డు సచివాలయాల్లో 1.2 లక్షల మందికి ఉపాధి కల్పించాం,” అని మాజీ సీఎం వైఎస్ జగన్ అన్నారు.
AP Update : ఏపీ సర్కార్ సంచలనం.. గ్రామ సచివాలయాల పేరు మార్పు