CM Chandrababu : అభివృద్ధికి కొత్త దిక్సూచి.. కుప్పంలో ఏడు పరిశ్రమలకు శంకుస్థాపన
- కుప్పంలో ఏడు పరిశ్రమలకు సీఎం చంద్రబాబు వర్చువల్ శంకుస్థాపన
- ₹2,203 కోట్ల పెట్టుబడులతో 241 ఎకరాల్లో భారీ పరిశ్రమలు
- పరిశ్రమల రాకతో ఉపాధి పెరుగుదలపై స్థానికుల ఆనందం
- బెంగళూరు వలసలకు స్వస్తి… కుప్పం అభివృద్ధిపై ప్రజల్లో నమ్మకం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu : కుప్పం ప్రాంతం పరిశ్రమల హబ్‌గా మారే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు మరో కీలక అడుగు వేశారు. వర్చువల్‌గా ఏకకాలంలో ఏడు పరిశ్రమలకు శంకుస్థాపన చేసి కుప్పం అభివృద్ధి పథాన్ని మరింత వేగవంతం చేశారు. హిందాల్కో, శ్రీజా డైరీ, ఏస్ ఇంటర్నేషనల్, SVF సోయా, మదర్ డైరీ, E-Royce EV, ALEAP మహిళా పార్కులు.. ఈ సంస్థల ద్వారా మొత్తం రూ. 2,203 కోట్ల పెట్టుబడులు కుప్పంలోకి రానున్నాయి. ఈ పరిశ్రమల కోసం ప్రభుత్వం 241 ఎకరాల భూమిని కేటాయించింది.
CM Chandrababu : 48 మంది ఎమ్మెల్యేలపై సీఎం చంద్రబాబు సీరియస్.. నోటీసులకు ఆదేశం
Also Read
- CM Chandrababu: తిరుపతిని దివ్యక్షేత్రంగా తీర్చిదిద్దాలి.. రెండేళ్లలో పిలిగ్రిమ్ టౌన్షిప్ పూర్తి చేయాలి!
- Rajahmundry Theft Case: భారీ పగటి దొంగతనం కేసు ఛేదన.. రూ.53.51 లక్షల విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం!
- IAS Officers: ఏపీలో 11 మంది ఐఏఎస్ అధికారులకు కొత్త పోస్టింగ్‌లు..
- AP Mayor Seats: నేడు సీఎం చంద్రబాబు నివాసంలో కీలక భేటీ.. మేయర్ పీఠాలపై కూటమి కసరత్తు!
శంకుస్థాపన అనంతరం సీఎం చంద్రబాబు కుప్పం స్థానిక రైతులు, పాడి రైతులు, మహిళలు, యువతతో ముఖాముఖి జరిపారు. అభివృద్ధి పట్ల ప్రజలు వ్యక్తం చేసిన ఆనందం, కృతజ్ఞతలు ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. హంద్రీ-నీవా కాల్వ ద్వారా నీటిసౌకర్యం అందడం పట్ల స్థానికులు సంతోషం వ్యక్తం చేశారు. కుప్పంకు ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీలు, పాలు కొనుగోలు చేసే సంస్థలు రావడం వల్ల తమ పంటలు, పాల ఉత్పత్తులను ఇక్కడి పరిశ్రమలకే నేరుగా విక్రయించే అవకాశం వస్తుందని రైతులు తెలిపారు. పరిశ్రమలు ఇంత పెద్ద సంఖ్యలో కుప్పానికి వస్తాయని కలలో కూడా అనుకోలేదని మహిళా పాడి రైతులు హర్షం వ్యక్తంచేశారు.
తల్లికి వందనం పథకం ద్వారా లబ్ధిపొందుతున్నామని మహిళలు తెలిపారు. గతంలో ఉపాధి కోసం బెంగళూరుకు వలస వెళ్లాల్సి వచ్చేదని, ఇక పరిశ్రమలు స్థాపించడంతో కుప్పంలోనే ఉపాధి దొరకనున్నందుకు ఆనందంగా ఉందని స్థానికులు పేర్కొన్నారు. తమ ప్రాంతంలో వేలాది మందికి ఉద్యోగావకాశాలు కల్పించే పరిశ్రమలను తీసుకొచ్చినందుకు సీఎం చంద్రబాబుకు కుప్పం వాసులు ధన్యవాదాలు తెలిపారు. కుప్పాన్ని పరిశ్రమల కేంద్రంగా రూపుదిద్దే లక్ష్యంతో ముందుకు సాగుతున్న ప్రభుత్వం, ఈ ఏడాది పెట్టుబడులతో ప్రతి ఇంటికీ ఉపాధిని చేరవేసే దిశగా పునాది వేసిందని అధికారులు పేర్కొన్నారు.
Komatireddy Venakt Reddy : తెలంగాణ రాష్ట్ర చరిత్రలో కనీవిని ఎరగని స్థాయిలో రోడ్ల నిర్మాణం
తాజావార్తలు
-
Navratri 2026: నవరాత్రుల్లో డిజిటల్ ఫాస్టింగ్ అంటే ఏమిటి? మొబైల్‌కు దూరంగా ఉంటే ఆరోగ్యానికి ప్రయోజనాలివే
-
Kerala Assembly: సీఈసీ జ్ఞానేశ్ కుమార్ తొలగింపునకు కేరళ అసెంబ్లీ తీర్మానం.. అసలు కారణాలివే
-
Rupee vs Dollar: RBI 4 కీలక నిర్ణయాలు.. డాలర్‌తో పోలిస్తే 97 పైసలు బలపడిన రూపాయి!
-
CM Chandrababu: తిరుపతిని దివ్యక్షేత్రంగా తీర్చిదిద్దాలి.. రెండేళ్లలో పిలిగ్రిమ్ టౌన్షిప్ పూర్తి చేయాలి!
-
Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ @30 ఏళ్ల సినీ ప్రస్థానం..
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!