చంద్రబాబుకి శిక్షపడాలని అందరూ కోరుకున్నారు అని అన్నారు. ఇప్పుడు చంద్రబాబుకి శిక్షపడడంతో మ్రొక్కులు చెల్లించుకున్నాను అని ఆమె పేర్కొన్నారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లోని స్నేహ బ్లాక్ లో చంద్రబాబుకి పూర్తిస్థాయిలో భధ్రతా ఏర్పాట్లు కల్పించామని మంత్రి రోజా అన్నారు.
హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుపై కేసు పెట్టడానికి ముందే ప్లాన్ చేశారు అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం.. అవినీతి జరిగిందని చంద్రబాబుపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు.
స్నేహ బ్లాక్ మొత్తం సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్టుగా జైళ్లశాఖ డీజీ వెల్లడించారు. స్పెషల్ వార్డు ముందు ప్రత్యేక వైద్య బృందం 24 గంటలు అందుబాటులో ఉంటుందని ఆయన తెలిపారు. ఏసీబీ కోర్టు జడ్జి ఆదేశించినట్టే అన్ని వసతులు కల్పించామన్నారు. కేవలం చంద్రబాబు అనుమతిస్తేనే ఎవరికైనా ఎంట్రీ ఇస్తున్నామని డీజీ చెప్పుకొచ్చారు.