Chandrababu Arrested: చంద్రబాబుకు హౌస్ రిమాండ్ అవసరం లేదు.. డీజీ..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన హౌస్ రిమాండ్ పిటిషన్‌పై విజయవాడలోని ఏసీబీ కోర్టు ఈరోజు మధ్యాహ్నం తుది తీర్పును వెల్లడించనుంది. చంద్రబాబు హౌస్ రిమాండ్‌కు అనుమతి ఇవ్వాల్సిందిగా ఆయన తరఫు న్యాయవాదులు కోరారు. అయితే చంద్రబాబుకు హౌస్ రిమాండ్‌ను సీఐడీ తరఫు న్యాయవాదులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఇరుపక్షాలు నిన్న (సోమవారం) కోర్టులో సుదీర్ఘంగా వాదనలు వినిపించగా.. న్యాయమూర్తి నేడు (మంగళవారం) తీర్పు వెల్లడించనున్నట్టుగా తెలిపారు.
Read Also: Jammu And Kashmir : జారి ట్రక్కుపై పడ్డ బండరాయి.. నలుగురు మృతి
Also Read
అయితే ఈ పరిస్థితుల వేళ జైళ్ల శాఖ డీజీ హరీష్ కుమార్ గుప్తా అడ్వొకేట్ జనరల్‌కు రాసిన లేఖ వెలుగులోకి వచ్చింది. నిన్న (సోమవారం) ఆయన ఈ లేఖ రాశారు. చంద్రబాబుకు హౌస్ రిమాండ్ అవసరం లేదని జైళ్ల శాఖ డీజీ అందులో వెల్లడించారు. ఏసీబీ న్యాయమూర్తి ఆదేశాల మేరకు చంద్రబాబుకు జైల్లో అన్ని రకాల వసతులతో కూడిన స్పెషల్ వార్డు కేటాయించామన్నారు. చంద్రబాబు ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని స్పెషల్ బ్లాక్ శానిటైజ్ చేశామని పేర్కొన్నారు. చంద్రబాబు ఉన్న స్నేహ బ్లాక్‌కు అత్యంత కట్టుదిట్టమైన భద్రత కల్పించినట్లు చెప్పారు. స్పెషల్ బ్లాక్ దగ్గర మూడంచెల భద్రతను ఏర్పాటు చేసినట్లు ఆ లేఖలో తెలిపారు.
Read Also: Kim Jong Un: రష్యా వెళ్లిన కిమ్.. పుతిన్‌తో ఆయుధ ఒప్పందం..
ఇక, స్నేహ బ్లాక్ మొత్తం సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్టుగా జైళ్లశాఖ డీజీ వెల్లడించారు. స్పెషల్ వార్డు ముందు ప్రత్యేక వైద్య బృందం 24 గంటలు అందుబాటులో ఉంటుందని ఆయన తెలిపారు. ఏసీబీ కోర్టు జడ్జి ఆదేశించినట్టే అన్ని వసతులు కల్పించామన్నారు. కేవలం చంద్రబాబు అనుమతిస్తేనే ఎవరికైనా ఎంట్రీ ఇస్తున్నామని డీజీ చెప్పుకొచ్చారు. రాజమండ్రి సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ అక్కడి భద్రతను 24 గంటలు పర్యవేక్షిస్తున్నారని జైళ్లశాఖ డీజీ హరీష్ గుప్తా అన్నారు.
తాజావార్తలు
-
Story Board : అసలు UPI ఉద్దేశమేంటి.. దేశం మళ్లీ క్యాష్ ఎకానమీకి ఓటేస్తుందా..?
-
Etela Rajender : తెలంగాణకు బీసీ సీఎం.. ఈటల కీలక వ్యాఖ్యలు
-
OTR : బొత్స అనూషకు భీమిలి వైసీపీ బాధ్యతలు .. గంటాను ఢీ కొట్టగలరా?
-
OTR: ఆక్వా రైతుల ఆగ్రహం.. ఉద్యమానికి రెడీ?
-
El Nino: భారత్‌కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్‌నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!