IND vs PAK: పాకిస్తాన్ గెలుస్తుంది.. ఐఐటీ బాబా జోస్యం
- సోషల్ మీడియాలో ఐఐటీ బాబా వీడియో వైరల్
- ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్, పాకిస్తాన్ మధ్య జరిగే మ్యాచ్ గురించి అంచనా
- భారత జట్టు ఓడిపోతుందన్న ఐఐటీ బాబా.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళా కారణంగా చాలా మంది బాబాలు వెలుగులోకి వచ్చారు. ఇందులో ఐఐటీ బాబా అత్యధిక వార్తల్లో నిలిచాడు. ఐఐటీ ముంబైలో చదువుకున్న అభయ్ సింగ్ సోషల్ మీడియాలో వార్తల్లో నిలిచారు. అతను తన అభిమానులతో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల ద్వారా మాట్లాడుతూ.. వారి ప్రశ్నలకు సమాధానాలు ఇస్తుంటాడు. కాగా.. సోషల్ మీడియాలో ఐఐటీ బాబాకు సంబంధించిన ఓ వీడియో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో అతను ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్, పాకిస్తాన్ మధ్య జరిగే మ్యాచ్ గురించి ఒక అంచనా వేశాడు. అతను భారత జట్టు ఓడిపోతుందని అన్నాడు. దీంతో.. టీమిండియా ఫ్యాన్సే కాకుండా.. పాకిస్తాన్ అభిమానులు కూడా ఆశ్చర్యానికి గురవుతున్నారు.
Also Read
- Mohsin Naqvi: హమ్మయ్య.. భారత్-పాక్ ఫైనల్ ఫైట్‌కు పాకిస్థాన్ ట్రోఫీ దొంగ డుమ్మా..!
- EPFO Claim Rejection: మీ PF క్లెయిమ్ రిజెక్ట్ అవుతోందా..? ముందుగా ఈ విషయాలు చెక్ చేయండి
- Abhijeet Dipke: అభిజీత్ దీప్కే సంచలన నిర్ణయం.. జంతర్ మంతర్ 2.0ని ప్రకటించిన సీజేపీ..
- Nara Lokesh: దేశంలో ఏపీని నెం.1గా నిలపడమే మా లక్ష్యం.. దానికి మీ సహకారం కావాలి
ఐఐటీ బాబా ఆ వీడియోలో మాట్లాడుతూ, “ఈసారి భారత్ గెలవదని నేను మీకు ముందుగానే చెబుతున్నాను. విరాట్ కోహ్లీతో సహా భారత ఆటగాళ్ళు ఫలితాన్ని మార్చలేరు.” అని అన్నాడు. కాగా.. క్రికెట్ ఫ్యాన్స్ అతని వ్యాఖ్యలపై తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ఐసీసీ ఈవెంట్లలో ఇప్పటివరకు టీమిండియా పాకిస్తాన్ పై విజయాలు సాధించిన సంగతి తెలిసిందే.. కాగా.. ఈ టోర్నీలో పాకిస్తాన్ తన తొలి మ్యాచ్‌లో ఓటమిని చవిచూసింది. మరోవైపు.. భారత జట్టు బంగ్లాదేశ్‌ను ఓడించింది. ఈ క్రమంలో.. భారత్ జట్టు బలంగా ఉంది.
Read Also: Madhu Yaskhi Goud : అవినీతి అధికారుల లిస్ట్ ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి దగ్గరకు చేరింది
2025 ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా.. 5వ మ్యాచ్‌లో భారత్, పాకిస్తాన్ తో తలపడుతుంది. ఈ మ్యాచ్ ఫిబ్రవరి 23 ఆదివారం దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరుగుతుంది. టోర్నమెంట్ నిర్వహణ బాధ్యతను పాకిస్తాన్ కు అప్పగించారు. అయితే.. భద్రతా కారణాల దృష్ట్యా టీమిండియా పాకిస్తాన్‌కు వెళ్లలేదు. దీంతో.. ఈ ఐసిసి ఈవెంట్ హైబ్రిడ్ మోడల్‌లో నిర్వహిస్తున్నారు. కాగా.. భారత్‌తో మ్యాచ్ కోసం పాకిస్తాన్ దుబాయ్ వెళ్తుంది.
https://twitter.com/multiversehubs/status/1892394231190126634
తాజావార్తలు
-
BYD Denza D9: BYD Denza D9 భారత్‌లోకి.. 800KM రేంజ్, మసాజ్ సీట్లతో లగ్జరీ MPV!
-
Mohsin Naqvi: హమ్మయ్య.. భారత్-పాక్ ఫైనల్ ఫైట్‌కు పాకిస్థాన్ ట్రోఫీ దొంగ డుమ్మా..!
-
EPFO Claim Rejection: మీ PF క్లెయిమ్ రిజెక్ట్ అవుతోందా..? ముందుగా ఈ విషయాలు చెక్ చేయండి
-
Sangeetha: కొడుకు సినిమా కోసం థియేటర్‌కి వచ్చిన సీఎం విజయ్ భార్య సంగీత.. వీడియో వైరల్
-
Acerpure Nitro QLED TV: 100 ఇంచెస్ స్క్రీన్‌తో Acerpure Nitro TV లాంచ్.. 120Hz డిస్‌ప్లే, Dolby Vision, 65W సౌండ్!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!