ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 విజేతగా భారత్ నిలిచింది. ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై గెలిచి మూడోసారి ఛాంపియన్స్ ట్రోఫీ కైసవం చేసుకుంది. ఫైనల్‌లో అద్భుత ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్న రోహిత్ శర్మకు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. టోర్నీ ఆసాంతం రాణించిన న్యూజిలాండ్ ఆటగాడు రచిన్ రవీంద్రను ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డు వరించింది. ఈ అవార్డుపై టీమిండియా మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ స్పందించాడు. మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి అసలైన హీరో…
టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా అంతర్జాతీయ వన్డేలకు రిటైర్మెంట్ ఇస్తున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టిన విషయం తెలిసిందే. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్లో జడేజా తన బౌలింగ్ స్పెల్ ముగిసిన వెంటనే విరాట్ కోహ్లీని హగ్ చేసుకోవడమే ఇందుకు కారణం. రిటైర్మెంట్ వార్తలపై జడ్డు ఫైర్ అయ్యాడు. హగ్ చేసుకుంటే రిటైర్మెంట్ అని రాస్తారా? అని మండిపడ్డాడు. దయచేసి పుకార్లు పుట్టించకండి అని జడేజా కోరాడు. ప్రస్తుతం భారత జట్టులో రోహిత్…
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్లో న్యూజిలాండ్‌పై టీమిండియా నాలుగు వికెట్ల తేడాతో అద్భుతమైన విజయం సాధించింది. ఇది భారత్‌కు మూడవ ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్. ఈ విజయం తర్వాత భారత ఆటగాళ్ల పంట పండింది. వారికి భారీ మొత్తంలో ప్రైజ్ మనీ లభించింది. టీమిండియాలోని ప్రతి సభ్యుడికి కోటి రూపాయలకు పైగా ప్రైజ్ మనీ లభించింది.
ICC ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ను 4 వికెట్ల తేడాతో ఓడించిన టీం ఇండియా. దుబాయ్‌లో మూడోసారి ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకోవడం ద్వారా ఆస్ట్రేలియా సాధించిన రెండు ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్‌లను భారత్ అధిగమించింది. ఛాంపియన్ ట్రోఫీ విజయం తర్వాత టీమిండియా స్టార్ బ్యాటర్ కోహ్లీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అది తన భార్యను హగ్ చేసుకున్న వీడియో అనుకుంటే పొరపాటే.. మరి ఇంతకంటే స్పేషల్ ఏంటీ అని ఆలోచిస్తున్నారా? ఈ…
దుబాయ్‌లో భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న ఫైనల్ మ్యాచ్‌లో కివీస్ 251 పరుగులు చేసింది. 2025 ఛాంపియన్స్ ట్రోఫీ ఛాంపియన్‌గా నిలిచేందుకు భారత్ 252 పరుగులు చేయాల్సి ఉంది. మ్యాచ్ మొదట్లో న్యూజిలాండ్ జట్టు 270-280 స్కోరును సులభంగా సాధిస్తుందని అనిపించింది. కానీ బ్యాటర్స్‌కి సాధ్యం కాలేదు. 4 క్యాచ్‌లు వదిలివేసినప్పటికీ.. భారత స్పిన్నర్లు న్యూజిలాండ్‌పై అద్భుతంగా బౌలింగ్ చేసి వారిని 251 పరుగులకే పరిమితం చేశారు.
Rohit Sharma To Surprise Kiwis: దుబాయ్ వేదికగా న్యూజిలాండ్‌తో ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ ఆడేందుకు భారత్ రెడీ అయింది. మరి తుది జట్టు ఎలా ఉంటుందనే దానిపై ఇప్పటికే పలువురు తమ అభిప్రాయాలను తెలియజేశారు.
ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ కోసం క్రికెట్ అభిమానులు ఎదురు చూస్తున్నారు. కాసేపట్లో భారత్–న్యూజిలాండ్ మధ్య దుబాయ్ వేదికగా మ్యా్చ్ జరగనుంది. మధ్యాహ్నం 2.30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా ఎన్టీవీతో యువ క్రికెటర్లు, క్రికెట్ ఫ్యాన్స్, కోచెస్ తమ అభిప్రాయాలను పంచుకున్నారు.
Ravichandran Ashwin: ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ కోసం క్రికెట్ అభిమానులు ఎదురు చూస్తున్నారు. భారత్ - న్యూజిలాండ్ మధ్య దుబాయ్ వేదికగా ఇవాళ (మార్చ్ 9) మధ్యాహ్నం 2.30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది.
ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా.. నేడు భారత్-న్యూజిలాండ్ మధ్య ఫైనల్ జరగనుంది. దుబాయ్ స్టేడియం వేదికగా మధ్యాహ్నం 2.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. కాగా.. దుబాయ్‌లో భారత్ మ్యాచ్ లు ఆడింది. ఛాంపియన్స్ ట్రోఫీలో వరుసగా నాలుగు విజయాలు సాధించి ఫైనల్‌కు చేరుకుంది. దుబాయ్‌లోని పిచ్ స్పిన్‌కు అనుకూలంగా ఉంటుంది. దుబాయ్‌లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ ఇప్పటివరకు నాలుగు మ్యాచ్‌లు ఆడింది. అందులో స్పిన్నర్లు ఆధిపత్యం చెలాయించారు.
IND vs NZ Final: ఛాంపియన్స్ ట్రోఫీలో రసవత్తర సమరానికి సమయం అసన్నమైంది. అన్ని లీగ్ మ్యాచ్‌ల్లోనూ నెగ్గి అద్భుతమైన ఫామ్‌లో ఉన్న భారత్.. రోజు జరిగే ఫైనల్లో న్యూజిలాండ్‌తో తలపడబోతుంది. ఈ ట్రోఫీని దక్కించుకునేందుకు రోహిత్ సేనకు ఇదో మంచి అవకాశం అని చెప్పాలి. అయితే, న్యూజిలాండ్ కూడా చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తుంది.