ఢిల్లీలో ప్రభుత్వ అధికారుల నియంత్రణపై కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఆర్డినెన్స్ పై ఇవాళ (సోమవారం) సుప్రీంకోర్టు విచారణ చేసింది. ఈ ఆర్డినెన్స్ ను సవాల్ చేస్తూ ఢిల్లీ సర్కార్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీంతో ఇవాళ పిటిషన్ ను అత్యున్నత న్యాయస్థానం విచారించింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.
ఆధార్ కార్డును ఫ్రీగా అప్‌డేట్ చేసుకునే వెసులుబాటుకు కేవలం ఒక రోజు మాత్రమే మిగిలి ఉంది. ఆధార్ కార్డు 10 ఏళ్లు నిండినవారు తమ ఆధార్ కార్డును అప్‌డేట్ చేసుకోవాలని ప్రభుత్వం వెల్లడించింది. ప్రజలు ఆధార్ కార్డులోని చిరునామా, పేరు, ఇతర సమాచారాన్ని అప్‌డేట్ చేసుకోవాలి.
జాక్ డార్సీ వాదనపై ఇప్పుడు కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ బదులిచ్చారు. డార్సీ నిక్కచ్చిగా అబద్ధాలు చెబుతున్నారని అన్నారు. ట్విట్టర్ పలుమార్లు భారత చట్టాలను ఉల్లంఘించిందని ఆయన వెల్లడించారు.
ప్రభుత్వ రంగ టెలికం దిగ్గజం భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్‌కు కీలకమైన పునరుద్ధరణ ప్యాకేజీకి కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది. మూడో పునరుద్దరణ ప్యాకేజీగా రూ. 89,047 కోట్లు అందించాలని బుధవారం సెంట్రల్ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది.
తెలంగాణకు వెంటనే ఎరువులు సరఫరా చేయాలని కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖా మంత్రి మాన్ సుఖ్ మాండవీయ కి లేఖ రాశారు తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. సకాలంలో ఎరువులు సరఫరా చేయాలని… రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా ఎరువులు సరఫరా చేయాలని లేఖలో డిమాండ్ చేశారు. కేంద్ర కేటాయింపుల ప్రకారమే 2.12 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు ఇంకా రావాల్సి ఉందని… కాబట్టి ఇతర దేశాల నుండి వచ్చిన వెసెల్స్ నుండి…
తెలంగాణ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. తెలంగాణలో పర్యాటక అభివృద్ధి కోసం మౌలిక సదుపాయాల నిర్మాణానికి స్వదేశ్ దర్శన్, ప్రసాద్ పథకాల కింద కేంద్రం రూ.300 కోట్లకు పైగా నిధులు మంజూరు చేసింది.స్వదేశ్ దర్శన్ పథకంలో రాష్ట్రంలో 3 పర్యాటక సర్క్యూట్స్ అభివృద్ధికి రూ.268.39 కోట్లు, ప్రసాద్ పథకం కింద రూ.36.73 కోట్ల మంజూరు చేసింది. బిజెపి తెలంగాణ అధ్యక్షులు, కరీంనగర్ ఎంపీబండి సంజయ్ కుమార్ రాసిన లేఖకు సమాధానమిస్తు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి…
ఢిల్లీ : కేంద్ర ఐటి, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కి ఎంపీ రఘురామ కృష్ణరాజు లేఖ రాశారు. ఏపీ లో ఫైబర్ నెట్ సంస్థ అక్రమంగా, అనధికారికంగా ఎం.ఎస్ ఓ .లైసెన్సెస్ ఉపయోగిస్తుందని… ఏపీ ఫైబర్ నెట్ చర్యలు బ్రాడ్ కాస్టింగ్ బిల్లు 1997 కు చట్ట విరుద్ధమని లేఖ లో పేర్కొన్నారు ఎంపీ రఘురామ. బ్రాడ్కాస్టింగ్ బిల్లు 1997 ప్రకారం ప్రభుత్వ సంస్థలు, ఎం.ఎస్.ఓ లైసెన్సెస్ పొందలేవని.. అనధికారికంగా, అక్రమంగా వాడుతున్న…
రైతు బంధుతో కేసీఆర్ దేశానికి ఆదర్శంగా, దిక్సూచిలా నిలిచారని ఆర్.నారాయణమూర్తి పేర్కొన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గత 36 ఏళ్లుగా దేశంలోని సమస్యల మీద కవులు, కళాకారులు, మీడియా స్పందించినట్లు మాదిరిగా సినిమా మాద్యమం ద్వారా తాను స్పందిస్తున్నానని తెలిపారు. అర్ధరాత్రి స్వతంత్రం నుండి అన్నదాత సుఖీభవ వరకు 36 సినిమాలు తీశానని..ఈ నెల 14న 37వ సినిమా “రైతన్న” విడుదలవుతుంది.. అందరూ ఆదరించాలని కోరుకుంటున్నానని వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువస్తున్న నూతన వ్యవసాయ చట్టాలు,…
విమాన ప్రయాణికులకు షాక్ తగిలింది. దేశీయ విమాన ప్రయాణం మరింత ప్రియం కానుంది. విమానయాన ఛార్జీల దిగువ పరిమితిని జూన్ 1 నుంచి 13-16 శాతం పెంచుతూ పౌర విమానయాన శాఖ నిర్ణయం తీసుకుంది. కేంద్రం ఉత్తర్వుల మేరకు.. 40 నిమిషాల విమాన ప్రయాణానికి ఛార్జీల దిగువ పరిమితి రూ.2,300 నుంచి రూ.2,600లకు పెరుగగా, 40-60 నిమిషాల ప్రయాణానికి దిగువ పరిమితి ఛార్జీ ప్రస్తుతం ఉన్న రూ. 2,900 నుంచి రూ.3,300కి పెంచింది. 60-90 నిమిషాల ప్రయాణానికి…