కేంద్రానికి తెలంగాణ వ్యవసాయ శాఖ లేఖ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణకు వెంటనే ఎరువులు సరఫరా చేయాలని కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖా మంత్రి మాన్ సుఖ్ మాండవీయ కి లేఖ రాశారు తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. సకాలంలో ఎరువులు సరఫరా చేయాలని… రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా ఎరువులు సరఫరా చేయాలని లేఖలో డిమాండ్ చేశారు. కేంద్ర కేటాయింపుల ప్రకారమే 2.12 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు ఇంకా రావాల్సి ఉందని… కాబట్టి ఇతర దేశాల నుండి వచ్చిన వెసెల్స్ నుండి ఎరువులు కేటాయించాలని కోరారు మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి.
గంగవరం పోర్టులోని ఐపీఎల్ కంపెనీ వెసెల్ నుండి 23 వేల మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా చేయాలని… కాకినాడ, విశాఖ పోర్టులలో ఉన్న ఆర్ సీ ఎఫ్, ఛంబల్, ఐపీఎల్ ఫర్టిలైజర్స్ కు చెందిన వెసెల్స్ నుండి 30 వేల మెట్రిక్ టన్నుల డీఏపీ కేటాయించాలని డిమాండ్ చేశారు మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. క్రిబ్ కో కంపెనీ నుండి రెండు అదనపు రేక్ లు యూరియా కేటాయించాలని.. అక్టోబర్, నవంబర్ నెలలలో తక్కువగా సరఫరా చేసిన ఎరువులను డిసెంబర్ నుండి మార్చి సరఫరాలో భర్తీ చేయాలని కోరారు.
Also Read
తాజావార్తలు
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?
-
OTR : మేయర్ సీటు విషయంలో టీడీపీ ప్రయోగం చేస్తుందా?
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
-
Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!