తెలంగాణ పర్యాటక శాఖకు రూ.300 కోట్లు మంజూరు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. తెలంగాణలో పర్యాటక అభివృద్ధి కోసం మౌలిక సదుపాయాల నిర్మాణానికి స్వదేశ్ దర్శన్, ప్రసాద్ పథకాల కింద కేంద్రం రూ.300 కోట్లకు పైగా నిధులు మంజూరు చేసింది.స్వదేశ్ దర్శన్ పథకంలో రాష్ట్రంలో 3 పర్యాటక సర్క్యూట్స్ అభివృద్ధికి రూ.268.39 కోట్లు, ప్రసాద్ పథకం కింద రూ.36.73 కోట్ల మంజూరు చేసింది. బిజెపి తెలంగాణ అధ్యక్షులు, కరీంనగర్ ఎంపీబండి సంజయ్ కుమార్ రాసిన లేఖకు సమాధానమిస్తు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి ఈ వివరాలు వెల్లడించారు.
Also Read
- Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
- DoT SIM Card Warning: మీ పేరు మీద సిమ్‌ను వేరొకరు వాడుతున్నారా? మీకు రూ.50 లక్షల వరకు జరిమానా!, పైగా శిక్ష..
- Faria: నేనింకా ఇల్లు కొనలేదు.. సందీప్ కిషన్ చెప్పాక కొనాలనుకున్నా.!
- Danam Nagender: సుప్రీం తీర్పును స్వాగతిస్తున్నా.. ఎన్నికలు ఎప్పుడొచ్చినా రెడీ..!
మహబూబ్ నగర్ జిల్లాలోని ఎకో సర్క్యూట్ కోసం 2015-16లో రూ.91.62 కోట్లు, ములుగు-లక్నవరం-మేడారం-తాడ్వయి-దామరవి-మల్లూరు-బొగత జలపాతంను కలుపుతూ ట్రైబల్ సర్క్యూట్ కింద చేపట్టనున్న అభివృద్ధి పనులకు 2016-17లో రూ.79.87 కోట్లు, కుతుబ్ షాహీ హెరిటేజ్ పార్క్-పైగా టూంబ్స్- హయత్ బక్షి మస్క్ –రేమండ్స్ టూంబ్ లను కలుపుతూ హెరిటేజ్ సర్క్యూట్ కింద చేపట్టనున్న అభివృద్ధి పనులకు 2017-18లో రూ.96.90 కోట్లు మంజూరు చేసినట్టు లేఖలో పేర్కొన్నారు. ప్రసాద్ పథకం కింద ఆలంపూర్ లోని జోగులాంబ దేవి అమ్మవారి ఆలయం అభివృద్ధికి 2020-21లో రూ.36.73 కోట్లు మంజూరు చేసినట్టు తెలిపారు. రాష్ట్రంలో పర్యాటకాభివృద్ధికి మరిన్ని నిధులు మంజూరు చేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని, కేంద్ర మార్గదర్శకాలను అనుసరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తగిన ప్రతిపాదనలు పంపిస్తే, వాటిని సమీక్షించి నిర్ణయం తీసుకుంటామని కేంద్రమంత్రి లేఖలో పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
Turkey Earthquake: టర్కీలో భారీ భూకంపం.. 5.8 తీవ్రతతో కంపించిన భూమి
-
DoT SIM Card Warning: మీ పేరు మీద సిమ్‌ను వేరొకరు వాడుతున్నారా? మీకు రూ.50 లక్షల వరకు జరిమానా!, పైగా శిక్ష..
-
Faria: నేనింకా ఇల్లు కొనలేదు.. సందీప్ కిషన్ చెప్పాక కొనాలనుకున్నా.!
-
Danam Nagender: సుప్రీం తీర్పును స్వాగతిస్తున్నా.. ఎన్నికలు ఎప్పుడొచ్చినా రెడీ..!
ట్రెండింగ్
-
144Hz డిస్‌ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!
-
150+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో Xiaomi Watch S5, Smart Band 11 లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే.!
-
100W ఫాస్ట్ ఛార్జింగ్, 200MP కెమెరా, 120Hz LTPO డిస్ప్లేతో Xiaomi 18 Pro లాంచ్.!
-
8500mAh బ్యాటరీ, ట్రిపుల్ స్టీరియో స్పీకర్లు, లైకా 200MP ట్రిపుల్ కెమెరాలతో కొత్త ఫ్లాగ్షిప్ Xiaomi 18 Pro Max వచ్చేసిందోచ్..!