Mamata Banerjee: పశ్చిమ బెంగాల్ ను బంగ్లా గా మార్చాలని కేంద్రానికి వినతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
West Bengal CM: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తన రాష్ట్రం పేరును ‘బంగ్లా’గా మార్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని మరోసారి డిమాండ్ చేశారు. బొంబాయి పేరును ముంబయిగా మార్చారు.. ఒరిస్సా పేరును ఒడిశాగా మార్చేస్తే తప్పులేదు కానీ, బెంగాల్ ను బంగ్లా గా మారిస్తే తప్పేముంది? అని ఆమె ప్రశ్నించారు. రాష్ట్రం పేరు మార్చేందుకు గతంలోనే అసెంబ్లీలో బిల్లు పాస్ చేశాం.. కేంద్ర ప్రభుత్వానికి అన్ని రకాల వివరణలు ఇచ్చాం.. కానీ చాలా కాలంగా పశ్చిమ బెంగాల్ పేరును బంగ్లాగా మార్చలేదన్నారు.
Read Also: Merry Christmas: అన్నిసార్లు వాయిదా పడినా హిట్ కొట్టారు…
Also Read
పశ్చిమ బెంగాల్ కంటే అక్షర క్రమంలో ముందున్న బంగ్లాగా పేరును మార్చడం వల్ల రాష్ట్రానికి కలిగే ప్రయోజనాలను సీఎం మమతా బెనర్జీ ఎత్తి చూపించారు. మన రాష్ట్రం పేరును బంగ్లాగా మార్చినట్లయితే.. వివిధ పోటీలలో పాల్గొనే, చదువుకునేందుకు వెళ్ళే మన పిల్లలకు ప్రాధాన్యత లభిస్తుంది అన్నారు. రాష్ట్రం పేరుతో ‘పశ్చిమ’ అని చేర్చాల్సిన అవసరం లేదని ఆమె అన్నారు. దీనికి ఉదాహరణగా పాకిస్థాన్‌లో పంజాబ్ అనే ప్రావిన్స్ ఉంది.. అదే పేరుతో భారతదేశంలో రాష్ట్రం ఉందని చెప్పారు. 2011లో అధికారంలోకి వచ్చిన తర్వాత తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రం పేరును ‘పశ్చిమ్ బంగా’ లేదా ‘వెస్ట్ బాంగో’గా మార్చాలని డిమాండ్ చేసింది. ఐదు సంవత్సరాల తరువాత, మమతా బెనర్జీ ప్రభుత్వం “బొంగో” అనే కొత్త పేరును ప్రతిపాదిస్తూ మరో తీర్మానాన్ని ఆమోదించింది.
తాజావార్తలు
-
OTR : బొత్స అనూషకు భీమిలి వైసీపీ బాధ్యతలు .. గంటాను ఢీ కొట్టగలరా?
-
OTR: ఆక్వా రైతుల ఆగ్రహం.. ఉద్యమానికి రెడీ?
-
El Nino: భారత్కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
-
Karnataka: హృదయ విదారక ఘటన.. తల్లి శవంపై ఏడుస్తూ కనిపించిన రెండేళ్ల చిన్నారి
-
OTR: కాంగ్రెస్ కంచుకోటలో గ్రూప్ వార్.. క్యాడర్లో పెరుగుతున్న అసంతృప్తి..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!