Ban on service charges: సర్వీస్ చార్జీలపై నిషేధం.. సీసీపీఏ సంస్థ స్ట్రాంగ్ వార్నింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రెస్టారెంట్, హోటళ్లకు వెళ్లే వారికి శుభవార్త తెలిపింది సీసీపీఏ సంస్థ. మనం ఆర్డర్ చేసి తినే తిండికన్నా ఎక్కవగా సర్వీస్ చార్జీలు కట్టాలంటూ తల పట్టుకునే పరిస్థితి. ప్రశ్నించడానికి కూడా సమయం లేకుండా.. బిల్లుల్లోనే ఆటోమేటిక్ గా చేర్చడాన్ని నిషేధిస్తూ కేంద్రీయ వినియోగదారుల హక్కుల పరిరక్షన ప్రాధికార సంస్థ (సీసీపీఏ) ఆదేశాలు జారరీ చేసింది. ఒకవేళ వీటిని ఉల్లంఘించే హోటళ్లు, రెస్టారెంట్లపై కస్టమర్లు ఫిర్యాదు చేయొచ్చని పేర్కొంది. అయితే.. సర్వీస్ చార్జీల విషయంలో వినియోగదారుల హక్కుల ఉల్లంఘన, అనుచిత వ్యాపార విధానాలను అరికట్టేందుకు సీసీపీఏ సోమవారం ఈ మేరకు మార్గదర్శకాలు జారీ చేసింది.
అంతేకాకుండా.. సర్వీస్ చార్జీ అనేది స్వచ్ఛందమేనని కస్టమర్లకు చెప్పకుండా, హోటళ్లు, రెస్టారెంట్లు దాన్ని బిల్లులో ఆటోమేటిక్‌గా చేరుస్తున్నాయని ఫిర్యాదులు మా దృష్టికొచ్చాయని, దాన్ని చెల్లించాలంటూ కస్టమరును బలవంతపెట్టకూడదని పేర్కొంది. అయితే.. ఇది స్వచ్ఛందమైనది.. ఐచ్ఛికమైనది మాత్రమేనని వినియోగదారుకు స్పష్టంగా తెలియజేయాలని పేర్కొనడమే కాకుండా.. సర్వీస్ చార్జీ వసూలు ప్రాతిపదికన లోపలికి ప్రవేశం విషయంలో గానీ సేవలు అందించడంలో గానీ ఎటువంటి ఆంక్షలు ఉండకూడదని పేర్కొంది. అయితే.. ఆహారం బిల్లులో సర్వీస్ చార్జీని చేర్చడం, ఆ తర్వాత మొత్తంపై జీఎస్‌టీని వసూలు చేయడం వంటివి సరికాదని సీసీపీఏ స్పష్టం చేసింది.
Also Read
- Modi-Rahul Gandhi: కులగణనపై మోడీకి ఖర్గే, రాహుల్‌గాంధీ లేఖ.. ఏముందంటే..!
- Operation Sindoor: పాకిస్తాన్ వేడుకున్నా దాడి చేశాం: మాజీ సీడీఎస్ అనిల్ చౌహాన్..
- Operation Sindoor: పాక్ అణుకేంద్రం ‘‘కిరాణా హిల్స్’’పై దాడి.. సంచలన నిజం చెప్పిన మాజీ CDS..
- Rahul Gandhi: కృతి సనన్ రక్షాబంధన్ యాడ్‌పై కంగనా విమర్శలు.. ఆమె ఇష్టమని రాహుల్‌గాంధీ మద్దతు
ఈనేపథ్యంలో.. మరోవైపు ప్రభుత్వ మార్గదర్శకాలతో పరిశ్రమపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని హోటల్.. రెస్టారెంట్ అసోసియేషన్స సమాఖ్య ఎఫ్‌హెచ్‌ఆర్‌ఏఐ వైస్ ప్రెసిడెంట్ గురుబక్షీష్ సింగ్ కొహ్లి వ్యాఖ్యానించారు. అయితే..ఈ ఆదేశాలను పూర్తిగా అధ్యయనం చేస్తామని.. తమ రంగాన్ని మాత్రమే వేరుగా చేసి చూడవద్దని ప్రభుత్వాన్ని కోరతామని ఆయన పేర్కొన్నారు. కాగా.. సాధారణంగా హోటళ్లు, రెస్టారెంట్లు ఆహారం బిల్లు మొత్తంపై పది శాతం సర్వీస్ చార్జీని వసూలు చేస్తున్న నేపథ్యంలో సీసీపీఏ మార్గదర్శకాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
ఫిర్యాదు చేయండిః
అయితే.. ఒకవేళ మార్గదర్శకాలకు విరుద్ధంగా ఏదైనా హోటల్ లేదా రెస్టారెంటు సర్వీస్ చార్జీ విధించిన పక్షంలో.. బిల్లు మొత్తం నుంచి దాన్ని తొలగించాలంటూ సదరు సంస్థను కస్టమరు కోరవచ్చు. అయినప్పటికీ ఫలితం లేకపోతే నేషనల్ కన్జూమర్ హెల్ప్‌లైన్ (NCH) నంబరు 1915కి లేదా NCH మొబైల్ యాప్ ద్వారా ఫిర్యాదు చేయొచ్చని తెలిపింది. తొందరగా ఫిర్యాదు చేయాలంటే.. ఎలక్ట్రానిక్ మాధ్యమంలో ఈ–దాఖిల్ పోర్టల్ ద్వారా వినియోగదారుల కమిషన్‌కి కూడా ఫిర్యాదు చేయవ్చని పేర్కొంది. అంతేకాకుండా.. అలాగే విచారణ.. చర్యల కోసం సంబంధిత జిల్లా కలెక్టరును కూడా ఆశ్రయించవచ్చని, సీసీపీఏకి ఈ–మెయిల్ ద్వారా కూడా ఫిర్యాదు పంపవచ్చని వివరించింది.
No hotels or restaurants can add service charges automatically or by default in the food bill: Union Consumer Affairs Ministry
— ANI (@ANI) July 4, 2022
తాజావార్తలు
-
Sandeep Reddy Vanga : ప్రభాస్ ‘స్పిరిట్’ కి A సర్టిఫికెట్ పక్కా.. నేను ఎంత గింజుకున్నా అంతే!
-
Modi-Rahul Gandhi: కులగణనపై మోడీకి ఖర్గే, రాహుల్‌గాంధీ లేఖ.. ఏముందంటే..!
-
Sandeep Reddy Vanga : ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్!
-
Power Bank Explosion : పవర్ బ్యాంక్ పేలి విద్యార్థికి తీవ్ర గాయాలు
-
OTR: మంత్రి కొండా సురేఖను కేబినెట్ నుంచి తప్పిస్తారా..?
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
-
144Hz డిస్‌ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!