Central Government: దేశ రాజధాని ఢిల్లీలో బుధవారం కేంద్ర కేబినెట్ కీలక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రైస్ సపోర్టు స్కీమ్ (PSS) కింద సేకరించిన పప్పు దినుసుల స్టాక్ నుండి వివిధ సంక్షేమ పథకాలకు వినియోగించే శనగలను రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సబ్సిడీలపై సరఫరా చేయాలని ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ ఆమోదించింది. ఈ మేరకు కేజీ రూ.8 చొప్పున రాష్ట్రాలకు…
దేశంలోని ఇతర పార్టీల ప్రభుత్వాలను కూల్చివేయడానికి బీజేపీ 6,300 కోట్ల రూపాయలను ఖర్చు చేయకపోతే, ఆహార పదార్థాలపై కేంద్రం వస్తు సేవల పన్ను (జీఎస్టీ) విధించాల్సిన అవసరం లేదని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ శనివారం పేర్కొన్నారు.
కోట్లాది మంది సంఘటిత, అసంఘటిత రంగాల కార్మికుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. భారతదేశ కలలను, ఆశలను నెరవేర్చడం ద్వారా జాతి నిర్మాణంలో శ్రామిక శక్తి ప్రధాన పాత్ర పోషిస్తోందని మోడీ కొనియాడారు. తిరుపతిలో రెండు రోజుల కార్మిక సదస్సును ప్రధాని ఢిల్లీ నుంచి వర్చువల్ వేదికగా ప్రారంభించారు.
Central Governement: దేశంలోని వంటనూనె తయారీ కంపెనీలకు కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. వంటనూనెలను ప్యాకింగ్ చేసే సమయంలో ఉష్ణోగ్రత ఎంత ఉందనే వివరాలు ఇవ్వడానికి బదులుగా ప్యాకెట్ లేదా సీసాలో ఎంత నూనె ఉందో తెలిపే ఘనపరిమాణం, బరువు వివరాలను ముద్రించాలని వంటనూనెల తయారీ కంపెనీలు, ప్యాకర్లు, దిగుమతిదార్లను కేంద్రం ఆదేశించింది. తూకం విషయంలో జరుగుతున్న మోసాలను అరికట్టేందుకు ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు కేంద్రం వివరించింది. వివరాల ముద్రణలో ఈ మార్పులు చేపట్టేందుకు…
ఇక నుంచి సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తికి ఢిల్లీలో ఉచిత బంగ్లా, భద్రత, డ్రైవర్‌ను కేటాయించే విధంగా కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసింది. సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తులకు, హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తులకు కూడా ఈ సౌకర్యం వర్తించనుంది.
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ వ్యవహారం ప్రకంపనలు సృషిస్తోంది. ఢిల్లీ మాజీ ఎక్సైజ్ కమిషనర్‌ను కేంద్ర ప్రభుత్వం సస్పెండ్ చేసింది. తెలుగు ఐఏఎస్ అధికారి అరవ గోపికృష్ణను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.
CJI NV Ramana: విజయవాడలో జిల్లా కోర్టు నూతన భవన సముదాయాన్ని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ ప్రారంభించారు. సిటి సివిల్ కోర్టు ఆవరణలో 3.70 ఎకరాల విస్తీర్ణంలో రూ. 92.60కోట్ల వ్యయంతో 8 అంతస్తులతో సిటి కోర్టు కాంప్లెక్స్ కోసం భారీ భవనాన్ని నిర్మించారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, సీఎం జగన్, ఇతర న్యాయమూర్తులతో కలిసి ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 2013 మే 13న హైకోర్టు న్యాయమూర్తిగా…
VLC Media Player: అత్యంత ప్రజాదరణ పొందిన మీడియా ప్లేయర్ సాఫ్ట్వేర్, స్ట్రీమింగ్ మీడియా సర్వర్ VLC మీడియా ప్లేయర్ ఇకపై భారతదేశంలో పని చేయదు. ఎందుకంటే VLC మీడియా ప్లేయర్‌పై భారత ప్రభుత్వం రెండు నెలల కిందటే నిషేధం విధించినట్లు తెలుస్తోంది. మన దేశంలో VLC మీడియా ప్లేయర్, డౌన్లోడ్ లింక్‌పై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించడంతో దాన్ని డౌన్లోడ్ చేసుకునేందుకు కుదరడం లేదు. చైనాకు చెందిన హ్యాకింగ్ గ్రూప్ Cicada సైబర్ అటాక్స్ జరిపేందుకు…
Har Ghar Tiranga: దేశవ్యాప్తంగా 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరపాలని కేంద్ర ప్రభుత్వం తలపెట్టింది. ఈ మేరకు ఆజాదీకా అమృత్ మహోత్సవ్ వేడుకలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా చేపట్టిన హర్ ఘర్ తిరంగా కార్యక్రమానికి దేశ ప్రజల నుంచి విపరీతమైన స్పందన వస్తోంది. భారతీయ పోస్టల్ డిపార్ట్ మెంట్ ద్వారా జెండాలను విక్రయిస్తున్నారు. అతి తక్కువ ధరలో రూ. 25కి ఒక్కో జెండాను అమ్ముతున్నారు. ఈ నేపథ్యంలో గత 10 రోజుల్లో ఏకంగా కోటి…
Fact Check on house Rent GST: గత నెలలో జరిగిన జీఎస్టీ మండలి సమావేశంలో కేంద్ర ప్రభుత్వం జీఎస్టీలో కీలక మార్పులు చేసింది. ప్యాకింగ్ చేసిన ఆహార పదార్థాలపై జీఎస్టీ విధించింది. దీంతో పాలు, పెరుగు ధరలు సామాన్యులకు భారంగా మారాయి. అయితే ఇంటి అద్దెపైనా కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ విధించింది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో కొన్ని వార్తలు వైరల్ అవుతున్నాయి. జీఎస్టీ కారణంగా ఇంటి అద్దెలు కూడా పెరగబోతున్నాయని ప్రచారం జరుగుతోంది. దీంతో…