Har Ghar Tiranga: దేశవ్యాప్తంగా 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరపాలని కేంద్ర ప్రభుత్వం తలపెట్టింది. ఈ మేరకు ఆజాదీకా అమృత్ మహోత్సవ్ వేడుకలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా చేపట్టిన హర్ ఘర్ తిరంగా కార్యక్రమానికి దేశ ప్రజల నుంచి విపరీతమైన స్పందన వస్తోంది. భారతీయ పోస్టల్ డిపార్ట్ మెంట్ ద్వారా జెండాలను విక్రయిస్తున్నారు. అతి తక్కువ ధరలో రూ. 25కి ఒక్కో జెండాను అమ్ముతున్నారు. ఈ నేపథ్యంలో గత 10 రోజుల్లో ఏకంగా కోటి…
Fact Check on house Rent GST: గత నెలలో జరిగిన జీఎస్టీ మండలి సమావేశంలో కేంద్ర ప్రభుత్వం జీఎస్టీలో కీలక మార్పులు చేసింది. ప్యాకింగ్ చేసిన ఆహార పదార్థాలపై జీఎస్టీ విధించింది. దీంతో పాలు, పెరుగు ధరలు సామాన్యులకు భారంగా మారాయి. అయితే ఇంటి అద్దెపైనా కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ విధించింది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో కొన్ని వార్తలు వైరల్ అవుతున్నాయి. జీఎస్టీ కారణంగా ఇంటి అద్దెలు కూడా పెరగబోతున్నాయని ప్రచారం జరుగుతోంది. దీంతో…
Central Government: ఆర్ధిక ఇబ్బందులతో సతమతం అవుతున్న ఏపీ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ అందించింది. కేంద్ర ప్రభుత్వం తాజాగా పలు రాష్ట్రాలకు పన్నుల వాటా నిధులను విడుదల చేసింది. ఆయా రాష్ట్రాల నుంచి జీఎస్టీ రూపంలో పన్నులను అందుకుంటున్న కేంద్ర ప్రభుత్వం అందులో రాష్ట్రాల వాటాను ఆయా రాష్ట్రాలకు విడుదల చేసింది. ఇందులో భాగంగా బుధవారం కేంద్ర ప్రభుత్వం ఆయా రాష్ట్రాలకు రెండో విడత పన్నుల వాటాను విడుదల చేసింది. తొలి వాటా కింద దేశంలోని…
India Invites American Singer to Independence Day Celebrations: భారత 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా జరపాలని కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో పంద్రాగస్టు వేడుకలకు అమెరికా ప్రసిద్ధ గాయని మిల్బెన్‌ను ప్రత్యేక అతిథిగా ఆహ్వానించింది. ‘ఓం జయ్ జగదీశ హరే’తో పాటు ‘జనగణమన’ గీతాలు పాడిన అమెరికా గాయని మిల్బెన్ భారతీయులకు సుపరిచితురాలే. భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా గతంలో పలుసార్లు ఆమె గీతాలు పాడి వీడియోలు పోస్ట్ చేశారు.…
దేశ రాజధాని ఢిల్లీలో జరిగే రేపటి నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. నీతి ఆయోగ్ సిఫారసులను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదని.. మిషన్ కాకతీయకు రూ.5వేల కోట్లు గ్రాంట్ ఇవ్వాలని, మిషన్ భగీరథకు రూ.19,500 కోట్లు గ్రాంట్ ఇవ్వాలని నీతి ఆయోగ్ సిఫారసు చేసిందని.. వీటిని పూర్తి చేసినా కేంద్రం నిధులు ఇవ్వలేదని కేసీఆర్ ఆరోపించారు. కేంద్రం వైఖరికి నిరసనగానే నీతి ఆయోగ్ సమావేశానికి హాజరుకావడం లేదని కేసీఆర్ వివరణ ఇచ్చారు. దేశంలో ఉచితాలను…
మంకీపాక్స్ వ్యాప్తి నేపథ్యంలో అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం మంకీపాక్స్‌పై ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ కూడా ఏర్పాటుచేసింది. ఈ నేపథ్యంలోనే తాజాగా కొన్ని సూచనలు కూడా చేసింది.
ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం మరో శుభవార్త చెప్పేందుకు సిద్ధం అవుతోంది.. మరో రెండు మూడు వారాల్లో కేంద్ర ప్రభుత్వం ప్రమోషన్లను ప్రకటించే అవకాశం ఉంది.. ప్రమోషన్‌కు సంబంధించిన న్యాయపరమైన సమస్యలను పరిష్కరించడంపై ఫోకస్ పెట్టింది ప్రభుత్వం.. మొత్తంగా, పదోన్నతుల ప్రక్రియను వేగవంతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ నెల 1వ తేదీన 8 వేల మందికి పైగా కేంద్ర అధికారులకు పదోన్నతి కల్పించిన ప్రభుత్వం, ఇప్పుడు మరోసారి పలువురు అధికారులకు పదోన్నతి కల్పించేందుకు సిద్ధమవుతోంది. కేంద్ర…
Central Government answer on special package to andhra pradesh: ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేమని ఇటీవల పార్లమెంట్లో స్పష్టం చేసిన కేంద్ర ప్రభుత్వం మంగళవారం నాడు ప్రత్యేక ప్యాకేజీపై కీలక ప్రకటన చేసింది. ఏపీకి 2016లో ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీ ద్వారా ఇప్పటివరకు 17 ప్రాజెక్టుకు విదేశీ ఆర్ధిక సంస్థల నుంచి రూ.7,797 కోట్ల రుణం అందించామని కేంద్ర ఆర్ధిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి వెల్లడించారు. బీజేపీ రాజ్యసభ ఎంపీ జీవీఎల్…