Covaxin: రాజకీయ ఒత్తిళ్ల కారణంగా కొవాగ్జిన్ టీకాకు వేగంగా అనుమతి ఇచ్చారన్న ఆరోపణలపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ఈ ఆరోపణలు తప్పుదోవ పట్టించే అసత్య వార్తలు అని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. భారత్ బయోటెక్ తన టీకా తయారీలో కొన్ని ప్రక్రియలను వదిలేసిందని.. రాజకీయ ఒత్తిళ్ల కారణంగా క్లినికిల్ పరీక్షలను వేగవంతం చేసిందని మీడియాలో వచ్చిన వార్తలపై కేంద్రం వివరణ ఇచ్చింది. భారత ప్రభుత్వం, జాతీయ నియంత్రణ సంస్థ సీడీఎస్‌సీఓ కొవాగ్జిన్ టీకాకు అత్యవసర…
బలవంతపు మతమార్పిడులపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. ఇవి దేశభద్రతకు, మతస్వేచ్ఛకు పెనుసవాల్ అని సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది. వీటిని అరికట్టేందుకు కేంద్రం చిత్తశుద్ధితో కృషిచేయాలని సుప్రీం ఆదేశించింది.
Demonetisation: 2016లో బీజేపీ ప్రభుత్వం నోట్ల రద్దు చేయడం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఇప్పటికీ నోట్ల రద్దు ఎఫెక్ట్ భారత ఆర్ధిక వ్యవస్థపై కొనసాగుతుంది. నోట్ల రద్దు కారణంగా కేంద్ర ప్రభుత్వం తెచ్చిన రూ.2వేలు నోటుతో సామాన్యులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో 2016 నాటి నోట్ల రద్దును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పెద్ద ఎత్తున పిటిషన్‌లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్ల విచారణకు సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేసింది. బుధవారం నాడు ఈ పిటిషన్‌లను…
Central Government: ఆర్థిక లోటుతో సతమతం అవుతున్న ఏపీ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం మంగళవారం నాడు గుడ్ న్యూస్ అందించింది. రెవెన్యూ లోటు భర్తీ కింద రాష్ట్రానికి రూ.879 కోట్లను కేంద్రం విడుదల చేసింది. ఇప్పటికే పలు విడతల కింద ఏపీకి కేంద్రం రెవెన్యూ లోటు నిధులను విడుదల చేసింది. తాజాగా దేశంలోని 14 రాష్ట్రాలకు రెవెన్యూ లోటు నిధులను విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం ఏపీకి రూ.879 కోట్ల నిధులను విడుదల చేస్తున్నట్లు ఆర్ధిక శాఖ…
Edible Oil Prices: సామాన్యులకు మళ్లీ షాక్ తగలనుంది. ఇటీవల తగ్గుముఖం పట్టిన వంటనూనె ధరలు మళ్లీ పెరగనున్నట్లు సంకేతాలు అందుతున్నాయి. గతంలో లీటర్ వంటనూనె రూ.200 దాటగా అప్రమత్తమైన కేంద్రం తగుచర్యలు తీసుకోవడంతో ధరలు తగ్గాయి. ప్రస్తుతం లీటర్ ఆయిల్ ప్యాకెట్ రూ.140-150కి లభిస్తోంది. తాజాగా కేంద్ర ప్రభుత్వం పామాయిల్ దిగుమతి సుంకాలను 6 నుంచి 11 శాతం పెంచనుంది. ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేసింది. ఆయిల్ దిగుమతి సుంకాలు పెంచడంతో ఆ భారం…
Petrol Prices: దేశవ్యాప్తంగా వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. పెట్రోల్, డీజిల్పై చెరో 40 పైసలు తగ్గనున్నట్లు సోమవారం నాడు కేంద్రం ప్రకటించింది. దీంతో దేశంలో మరోసారి ఇంధన ధరలు తగ్గుముఖం పట్టనున్నాయి. మంగళవారం ఉదయం 6 గంటల నుంచి కొత్త ధరలు అమలులోకి రానున్నాయి. ప్రస్తుతం తెలంగాణలో లీటర్ పెట్రోల్ రూ.109.64, డీజిల్ రూ.97.8గా ఉంది. ఏపీలో లీటర్ పెట్రోల్ ధర రూ.111.67, డీజిల్ ధర రూ.99.40గా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో…
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ధనంజయ యశ్వంత్ చంద్రచూడ్ నియమితులు అయ్యారు.. ఇటీవలే ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లలిత్… జస్టిస్ చంద్రచూడ్ పేరును ప్రతిపాదించిన విషయం తెలిసిందే కాగా.. ఇప్పుడు జస్టిస్ చంద్రచూడ్ నియామకాన్ని కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది… ఈ విషయాన్ని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు సోషల్ మీడియాలో వెల్లడించారు.. దీంతో, నవంబర్ 9న జస్టిస్ చంద్రచూడ్ సుప్రీంకోర్టు 50వ సీజేఐగా బాధ్యతలు చేపట్టనున్నారు.. రెండేళ్ల పాటు ఆయన పదవీ కొనసాగి.. 2024,…
SC grants Centre two more weeks to file response on pleas challenging Places of Worship Act 1991: ప్రార్థనా స్థలాల చట్టం-1991లోని నిబంధనలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై స్పందించేందుకు కేంద్రానికి మరో రెండు వారాలు గడువు ఇచ్చింది సుప్రీంకోర్టు. అక్టోబర్ 31 లోగా అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్రాన్ని ఆదేశించింది. నవంబర్ 14న విచారణను వాయిదా వేసింది. 1991 ప్రార్థన స్థలాల చట్టంలోని కొన్ని నిబంధనలను సవాల్ చేస్తూ దేశవ్యాప్తంగా…
Election Commission: కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల్లో ఒక అభ్యర్థి ఒక చోటే పోటీ చేసేలా కొత్త నిబంధనను తీసుకురావాలని కసరత్తు చేస్తోంది. ఈ మేరకు శుక్రవారం నాడు కేంద్ర న్యాయశాఖకు కేంద్ర ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ లేఖ రాశారు. వచ్చే ఎన్నికల నుంచి ఈ నిర్ణయాలు అమలు చేసేలా ప్రయత్నించాలని లేఖలో సూచించారు. ప్రస్తుతం ఎన్నికల్లో అర్హత ఉన్న ఒక అభ్యర్థి రెండు వేర్వేరు నియోజకవర్గాల నుంచి పోటీ చేసే…