గృహిణిలకు కేంద్రం శుభవార్త చెప్పింది. వంట నూనెల ధరలు పెరుగుతాయంటూ ఇటీవల వార్తలు హల్‌చల్ చేశాయి. ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి తరుణంలో నూనెల ధరలు పెరుగుతాయంటూ వచ్చిన వార్తలతో భయాందోళన చెందారు. మొత్తానికి కేంద్రం గుడ్‌న్యూస్ చెప్పింది. వంట నూనెలపై దిగుమతి సుంకాన్ని కేంద్ర ప్రభుత్వం ఇటీవల భారీగా పెంచింది. దీంతో వంట నూనె ధరలు పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ పరిస్థితిని అదనుగా తీసుకుని వంట నూనెల ధరలు పెంచొద్దని సంబంధిత సంస్థలకు కేంద్రం సూచించింది. తక్కువ సుంకానికి ఇప్పటికే దిగుమతి చేసుకున్న వంట నూనెల నిల్వలు సరిపడా మొత్తంలో ఉన్నాయని తెలిపింది. దాదాపు 30లక్షల టన్నుల స్టాక్ ఉందని, 45-50 రోజులకు అవి సరిపోతాయని.. ఈ నేపథ్యంలో ధరల పెంచొద్దని ఆహార మంత్రిత్వశాఖ పేర్కొంది.
ఇది కూడా చదవండి: Maharashtra: స్కూల్‌లో విద్యార్థులు డమ్మీ ఫైటింగ్.. ఓ టీచర్ ఏం చేసిందంటే..! వీడియో వైరల్
ఇదిలా ఉంటే దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ టైంలో ధరలు పెరిగితే ఎన్నికలపై ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కేంద్రం.. నూనెల ధరలు పెంచొద్దని ఆయా సంస్థలకు సూచించింది.
ఇది కూడా చదవండి: Indigo flight: ఢిల్లీ ఎయిర్‌పోర్టులో తప్పిన ప్రమాదం.. దెబ్బతిన్న ఇండిగో విమానం టెయిల్ సెక్షన్